MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Rohit Sharma : కోహ్లీ, ధోనీ వల్ల కాలేదు.. రోహిత్ అరుదైన రికార్డు ఏంటో తెలుసా?

Rohit Sharma : కోహ్లీ, ధోనీ వల్ల కాలేదు.. రోహిత్ అరుదైన రికార్డు ఏంటో తెలుసా?

Rohit Sharma : ఐపీఎల్ 2026లో కేకేఆర్‌తో మ్యాచ్‌ ద్వారా రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించారు. 19 సీజన్లలో క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. అలాగే, కేకేఆర్ పై మరో సూపర్ నాక్ తో దుమ్మురేపాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 29 2026, 10:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హిట్ మ్యాన్ విశ్వరూపం.. ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు
Image Credit : ANI

హిట్ మ్యాన్ విశ్వరూపం.. ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరుగుతున్న మ్యాచ్ ఒక అరుదైన మైలురాయి నమోదైంది. భారత స్టార్ బ్యాటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో మైదానంలోకి అడుగుపెట్టగానే ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. లీగ్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని 19 సీజన్లలోనూ ఆడిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ చేరడమే కాకుండా, ఒక ప్రత్యేక రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.

25
తొలి క్యాప్డ్ ప్లేయర్‌గా రోహిత్ అరుదైన రికార్డు
Image Credit : Facebook/Mumbai Indians

తొలి క్యాప్డ్ ప్లేయర్‌గా రోహిత్ అరుదైన రికార్డు

ఐపీఎల్ 2008లో ప్రారంభమైన నాటి నుండి నేటి 2026 సీజన్ వరకు మొత్తం 19 సీజన్లలోనూ ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ 19 సీజన్లలోనూ ఒక క్యాప్డ్ (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న) ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఏకైక ఆటగాడు రోహిత్ మాత్రమే. విరాట్ కోహ్లీ కూడా 19 సీజన్లలో ఆడుతున్నప్పటికీ, తొలి సీజన్ నాటికి కోహ్లీ ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. అంటే కోహ్లీ తన మొదటి ఐపీఎల్ సీజన్‌ను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడగా, రోహిత్ మాత్రం టీమిండియా తరపున ఆడిన తర్వాతే ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ధోని, రైనా వంటి దిగ్గజాలను కూడా రోహిత్ వెనక్కి నెట్టారు.

Related Articles

Related image1
IPL ఎంట్రీలోనే సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించాడు.. ఎవడ్రా ఈ జేకబ్ డఫీ?
Related image2
IPL 2026: హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. ఆ రికార్డు ఇక రోహిత్ సొంతం
35
అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితా
Image Credit : Facebook/Mumbai Indians

అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితా

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. కేకేఆర్ తో జరుగుతున్న మ్యాచ్ లో హాఫ్ సెంచరీ బాదాడు.  38 బంతుల్లో 78 పరుగుల నాక్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు.

ఇప్పటివరకు 72 సార్లు ఈ ఘనత సాధించి విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా, డేవిడ్ వార్నర్ 66, శిఖర్ ధావన్ 53 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశారు. రోహిత్ శర్మ ప్రస్తుత మ్యాచ్‌తో కలిపి 50 సార్లు ఈ మైలురాయిని చేరుకున్నారు. అలాగే కేఎల్ రాహుల్ 45 సార్లు ఈ ఘనత సాధించి రేసులో ఉన్నారు. ఈ గణాంకాలు ఐపీఎల్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ స్థిరత్వాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి.

45
ముంబై ఇండియన్స్‌తో ఘనమైన రికార్డులు
Image Credit : Facebook/Mumbai Indians

ముంబై ఇండియన్స్‌తో ఘనమైన రికార్డులు

ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ ప్రస్థానం అత్యంత విజయవంతంగా సాగింది. ఈ ఫ్రాంచైజీ తరపున ఇప్పటివరకు 228 మ్యాచ్‌లు ఆడిన ఆయన 5876 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రోహిత్ రికార్డుల్లో నిలిచారు. అలాగే ఈ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కూడా ఆయనే. విశేషం ఏమిటంటే, 2009 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పైనే రోహిత్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం గమనార్హం. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా రోహిత్ ఐపీఎల్‌లో తిరుగులేని ముద్ర వేశారు.

55
ఐదు సార్లు ఛాంపియన్ కెప్టెన్‌గా..
Image Credit : ANI

ఐదు సార్లు ఛాంపియన్ కెప్టెన్‌గా..

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకరు. ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తూ ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించారు. ఒక ప్లేయర్‌గా 2009లో డెక్కన్ చార్జర్స్‌తో కలిపి మొత్తం ఆరు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడారు. ప్రస్తుతం 2026 సీజన్‌లో తన 19వ ఎడిషన్‌ను ఆడుతూ, ఫిట్‌నెస్‌లోనూ, పరుగుల వేటలోనూ ప్లేయర్లకు పోటీనిస్తున్నారు. విరాట్ కోహ్లీ తన అరంగేట్రం 18 ఆగస్టు 2008న చేయగా, అప్పటికే రోహిత్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం వల్లే ఈ క్యాప్డ్ ప్లేయర్ రికార్డు హిట్ మ్యాన్ ఖాతాలో పడింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
Tilak : మృత్యువుతో పోరాడి గెలిచాడు.. తిలక్ వర్మను వణికించిన ఆ భయంకర వ్యాధి ఏంటో తెలుసా?
Recommended image2
IPL 2026: హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. ఆ రికార్డు ఇక రోహిత్ సొంతం
Recommended image3
RCB vs SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 కారణాలు ఇవే
Related Stories
Recommended image1
IPL ఎంట్రీలోనే సన్‌రైజర్స్‌కు చుక్కలు చూపించాడు.. ఎవడ్రా ఈ జేకబ్ డఫీ?
Recommended image2
IPL 2026: హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్.. ఆ రికార్డు ఇక రోహిత్ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved