MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • IPL షాకింగ్: ఆర్సీబీ కంటే ముందే రికార్డు కొట్టిన రాజస్థాన్ రాయల్స్.. ఏకంగా వేల కోట్లకు అమ్మకం!

IPL షాకింగ్: ఆర్సీబీ కంటే ముందే రికార్డు కొట్టిన రాజస్థాన్ రాయల్స్.. ఏకంగా వేల కోట్లకు అమ్మకం!

Rajasthan Royals : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.63 బిలియన్ డాలర్లకు అమ్ముడై, ఒక బిలియన్ డాలర్ల విలువను దాటిన మొదటి ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 24 2026, 08:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాజస్థాన్ రాయల్స్ కొత్త బాస్ ఇతనే.. వాల్‌మార్ట్ వారసులతో కలిసి ఐపీఎల్ టీమ్ కొనేశారు
Image Credit : ANI

రాజస్థాన్ రాయల్స్ కొత్త బాస్ ఇతనే.. వాల్‌మార్ట్ వారసులతో కలిసి ఐపీఎల్ టీమ్ కొనేశారు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వాణిజ్య విలువ ఆకాశమే హద్దుగా పెరుగుతోంది. దీనికి తాజా నిదర్శనం రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు పై జరిగిన భారీ డీల్. 2008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ఇప్పుడు ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడైన మొదటి ఐపీఎల్ ఫ్రాంచైజీగా రికార్డు సృష్టించింది.

 ‎క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం, అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్టియం రాజస్థాన్ రాయల్స్‌లో 100 శాతం యాజమాన్య హక్కులను సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ సుమారు 1.63 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు ₹13,000 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ జట్టు యాజమాన్యం యూకేకు చెందిన మనోజ్ బదాలే (ఎమర్జింగ్ మీడియా) చేతుల్లో ఉంది. 2026 ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత కల్ సోమని అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎవరీ కల్ సోమని? భారీ బ్యాకింగ్ వెనుక ఉన్నది వీరే..
Image Credit : Getty

ఎవరీ కల్ సోమని? భారీ బ్యాకింగ్ వెనుక ఉన్నది వీరే..

అమెరికాలోని అరిజోనా (స్కాట్స్‌డేల్) కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న భారత సంతతి పారిశ్రామికవేత్త కల్ సోమని రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త కాదు. ఆయన 2021లోనే ఈ జట్టులో కొంత వాటాను కొనుగోలు చేసి భాగస్వామిగా చేరారు. ఇప్పుడు ఏకంగా పూర్తి యాజమాన్యాన్ని దక్కించుకున్నారు. ‎ ‎ఈ భారీ డీల్ వెనుక అమెరికా క్రీడా, వ్యాపార రంగంలోని దిగ్గజాల సపోర్ట్ ఉంది. ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ చైన్ 'వాల్‌మార్ట్' (Walmart) వారసుడు, ఎన్ఎఫ్ఎల్ (NFL) జట్టు 'డెన్వర్ బ్రాంకోస్' యజమాని రాబ్ వాల్టన్ ఈ కన్సార్టియంలో భాగస్వామిగా ఉన్నారు. అలాగే, ఎన్ఎఫ్ఎల్ జట్టు 'డెట్రాయిట్ లయన్స్' యజమానులైన హాంప్ కుటుంబం కూడా సోమనికి సపోర్టుగా నిలిచింది. షీలా ఫోర్డ్ హాంప్ నేతృత్వంలోని ఈ కుటుంబానికి ఫోర్డ్ మోటార్ కంపెనీతో బలమైన సంబంధాలు ఉన్నాయి.

34
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త బెంచ్‌మార్క్
Image Credit : Asianet News

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త బెంచ్‌మార్క్

రాజస్థాన్ రాయల్స్ సాధించిన ఈ ఫీట్ ఐపీఎల్ ప్రపంచంలోనే ఒక సంచలనం. వాస్తవానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) భారీ ధరకు అమ్ముడవుతుందని అందరూ ఊహించారు. కానీ, రాజస్థాన్ రాయల్స్ అందరికంటే ముందే ఈ మైలురాయిని చేరుకుంది. ‎ 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు మనోజ్ బదాలే నేతృత్వంలోని ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ ఈ జట్టును కేవలం 67 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో ఇది లీగ్‌లోనే అతి తక్కువ ధర కలిగిన జట్టు. ఇప్పుడు 1.63 బిలియన్ డాలర్లకు చేరడం అంటే, పెట్టుబడిపై అద్భుతమైన లాభాలను ఆర్జించినట్లు లెక్క. ‎

 ఒప్పందంపై సంతకాలు జరిగినప్పటికీ, మైదానంలో జట్టు నిర్వహణలో వెంటనే మార్పులు ఉండవు. 2026 ఐపీఎల్ సీజన్ ముగిసే వరకు ప్రస్తుత మేనేజ్మెంట్ పర్యవేక్షణలోనే జట్టు కొనసాగుతుంది. 19వ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే సిద్ధమవుతోంది. యువ ఆటగాడు రియాన్ పరాగ్‌ను జట్టు కెప్టెన్‌గా నియమించగా, గాయపడిన సామ్ కర్రన్ స్థానంలో శ్రీలంక ఆటగాడు దసున్ షనకను తీసుకుంది.

44
IPL: ఆర్సీబీ వైపు అందరి చూపు
Image Credit : ANI

IPL: ఆర్సీబీ వైపు అందరి చూపు

రాజస్థాన్ రాయల్స్ 1.63 బిలియన్ డాలర్ల మార్కును సెట్ చేయడంతో, ఇప్పుడు అందరి దృష్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై పడింది. మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఆర్సీబీ విక్రయ ప్రక్రియ గనుక మొదలైతే, ఆ జట్టు విలువ ఏకంగా 2 బిలియన్ డాలర్లను (సుమారు ₹16,000 కోట్లకు పైగా) దాటే అవకాశం ఉంది. ‎ ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన లీగ్‌లలో ఒకటిగా, అమెరికాకు చెందిన ఎన్ఎఫ్ఎల్ (NFL) తర్వాత రెండవ స్థానంలో నిలిచిందని ఈ ఒప్పందం నిరూపించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
IPL : స్టేజ్ పై హార్దిక్, సూర్య.. అభిమానుల రచ్చ.. రోహిత్ ఎంట్రీతో సీన్ మారిపోయింది !
Recommended image2
IPL 2026 రద్దవుతుందా? యుద్ధం సెగతో క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved