MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ సీక్రెట్ లీక్.. మ్యాచ్‌కు ముందు ఏం చేస్తాడో తెలుసా?

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ సీక్రెట్ లీక్.. మ్యాచ్‌కు ముందు ఏం చేస్తాడో తెలుసా?

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సంచలనం వైభవ్ సూర్యవంశీ తను తుపాను ఆటతో దుమ్మురేపుతున్నాడు. అయితే, గ్రౌండ్ లో తన విధ్వంసక బ్యాటింగ్ వెనుక ఉన్న ఆసక్తికర రహస్యం బయటపెట్టారు. మ్యాచ్‌కు ముందు వైభవ్ ఏం చేస్తారో తెలుసా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 23 2026, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ
Image Credit : vaibhav suryavanshi instagram

ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్ 2026లో ఒక 15 ఏళ్ల కుర్రాడు ప్రపంచ క్రికెట్‌ను తనవైపు తిప్పుకుంటున్నాడు. అతడే వైభవ్ సూర్యవంశీ. క్రీజులోకి వస్తే చాలు, బౌలర్ ఎవరన్నది చూడకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే ఈ యువ ఆటగాడు, తాజాగా తన విధ్వంసక బ్యాటింగ్ వెనుక ఉన్న ఒక వింతైన రహస్యాన్ని వెల్లడించారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత వైభవ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చిన్న వయసులోనే రికార్డుల వేట మొదలుపెట్టిన వైభవ్ సూర్యవంశీ
Image Credit : Getty

చిన్న వయసులోనే రికార్డుల వేట మొదలుపెట్టిన వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ గురించి ఇప్పుడు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్ వంటి బిగ్ టోర్నమెంట్లలో కూడా నిర్భయంగా బ్యాటింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మైదానంలో అడుగుపెట్టిన మొదటి బంతి నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటం వైభవ్ స్టైల్. అయితే, ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు ఒత్తిడి ఉండదా? అన్న ప్రశ్నకు వైభవ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

36
మ్యాచ్‌కు ముందు టామ్ అండ్ జెర్రీ.. డోరేమాన్ ఆడే వైభవ్ !
Image Credit : Getty

మ్యాచ్‌కు ముందు టామ్ అండ్ జెర్రీ.. డోరేమాన్ ఆడే వైభవ్ !

మైదానంలో బౌలర్ల పని పట్టే ముందు ఈ యువ ఆటగాడు మొబైల్‌లో ఏం చూస్తారో తెలిస్తే మీరు నవ్వాలో, ఆశ్చర్యపోవాలో అర్థం కాదు. సాధారణంగా ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థి బౌలర్ల వీడియోలు లేదా పాత ఇన్నింగ్స్‌లు చూస్తారు. కానీ వైభవ్ మాత్రం టామ్ అండ్ జెర్రీ లేదా డోరేమాన్ వంటి కార్టూన్లు చూస్తారట. లక్నోతో మ్యాచ్ ముగిసిన తర్వాత స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వైభవ్ ఈ విషయాన్ని సరదాగా పంచుకున్నారు.

"నా మెదడులో ఏమీ ఆలోచనలు ఉండవు. నాకు ఇప్పటికీ కార్టూన్లు చూడటం అంటే చాలా ఇష్టం. ప్రతి మ్యాచ్‌కు ముందు కార్టూన్లు చూడటం నాకు అలవాటు, అది ఇప్పటికీ కొనసాగుతోంది," అని వైభవ్ నవ్వుతూ చెప్పారు. అయితే తన ప్రధాన లక్ష్యం ఎప్పుడూ జట్టును గెలిపించడంపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

46
కార్టూన్ల వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటి?
Image Credit : ANI

కార్టూన్ల వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటి?

ప్రపంచంలోనే అత్యంత ఒత్తిడితో కూడిన లీగ్ ఐపీఎల్. ఇక్కడ 15 ఏళ్ల వయసులో ఆడటం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే వైభవ్ కార్టూన్లు చూడటం వల్ల తన మెదడు క్రికెట్‌ను ఒక భారంగా కాకుండా, ఒక గేమ్ గా మాత్రమే చూస్తుందని తెలిపాడు. అలాగే, ఒత్తిడికి లోనుకాను అని చెప్పాడు. ఇలా చేయడం వల్ల మైదానంలో చాలా ప్రశాంతంగా, రిలాక్స్‌డ్‌గా ఉంటూ అత్యంత వేగవంతమైన బౌలర్లను సైతం అలవోకగా ఎదుర్కోగలుగుతున్నట్టు చెప్పాడు.

56
లక్నోతో మ్యాచ్‌లో వైభవ్ ఇన్నింగ్స్
Image Credit : BCCI

లక్నోతో మ్యాచ్‌లో వైభవ్ ఇన్నింగ్స్

తన కార్టూన్ ప్రేమను వెల్లడించిన వైభవ్, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. లక్నో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మొహ్సిన్ ఖాన్ వైభవ్‌ను బోల్తా కొట్టించారు. విశేషమేమిటంటే, ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీకి 'మెయిడెన్ ఓవర్' వేసి, వికెట్ తీసిన తొలి బౌలర్‌గా మొహ్సిన్ ఖాన్ నిలిచారు.

66
ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్
Image Credit : Getty

ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్

ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 7 ఇన్నింగ్స్‌లలో 254 పరుగులు సాధించారు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాజస్థాన్ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడమే కాకుండా, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా వైభవ్ కొనసాగుతున్నారు. తనదైన శైలిలో బ్యాటింగ్‌తో అలరిస్తున్న ఈ 'కార్టూన్ లవర్' రాబోయే మ్యాచ్‌ల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
Suryakumar Yadav: నిమిషాల లెక్కన ప్రపంచ రికార్డు.. టీ20ల్లో ఆ భారత బ్యాటర్ విధ్వంసం.. ఎవరో తెలుసా?
Recommended image2
T20ల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీ వీరులు వీరే.. కోహ్లీని దాటేసిన అభిషేక్ శర్మ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved