- Home
- Sports
- రెండు ప్రపంచకప్‌లు.. ఐపీఎల్‌లో మ్యాచ్ విన్నర్.. కట్ చేస్తే.. BPLలో నడ్డి విరగొట్టుకున్నాడుగా
రెండు ప్రపంచకప్‌లు.. ఐపీఎల్‌లో మ్యాచ్ విన్నర్.. కట్ చేస్తే.. BPLలో నడ్డి విరగొట్టుకున్నాడుగా
BPL 2026: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2026 వేలం నవంబర్ 30న జరిగింది. ఈ వేలంలో తన పేరు నమోదు చేసుకున్న ఓ భారతీయ ఆటగాడు.. చివరికి అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు. వేలంలో పాల్గొన్న మొదటి భారతీయ ప్లేయర్ కూడా అతడే.

12 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(BPL) 12 సంవత్సరాల తర్వాత ఆటగాళ్ల వేలం నిర్వహించింది. నవంబర్ 30న, 245 మంది విదేశీ ఆటగాళ్లతో పాటు అనేక మంది దేశీయ ఆటగాళ్లు ఆరు జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో మనం ఓ భారతీయ ఆటగాడి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి.
ఇదే మొదటిసారి..
BPL వేలంలో ఓ భారతీయ ఆటగాడు తన పేరు నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఆశ్చర్యకరంగా, ఏ జట్టు కూడా అతడి కోసం బిడ్ చేయలేదు. చివరికి అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు. అతడు మరెవరో కాదు.. టూ-టైం ప్రపంచకప్ విన్నర్, ముంబై జట్టు మాజీ ఆటగాడు పీయూష్ చావ్లా.
ఎవరూ కొనుగోలు చేయలేదు..
ఈ భారత మాజీ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. 36 ఏళ్ల చావ్లా జూన్ 2025లో అంతర్జాతీయ క్రికెట్, దేశీయ క్రికెట్, IPL నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. విదేశీ లీగ్‌లలో ఆడే స్వేచ్ఛ ఉన్నందున అతడు రిటైర్మెంట్ తర్వాత BPL వేలంలోకి ప్రవేశించాడు. అనూహ్యంగా ఏ ఫ్రాంచైజీ కూడా అతడ్ని కొనుగోలు చేయలేదు.
పీయూష్ కెరీర్ ఇలా..
పీయూష్ చావ్లా కెరీర్ విషయానికొస్తే.. టీమిండియా తరపున 3 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20లు ఆడిన ఈ లెగ్ స్పిన్నర్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. అతడు ఐపీఎల్‌లో 192 మ్యాచ్‌లు కూడా ఆడాడు. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ 2014 ట్రోఫీ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
బడా ప్లేయర్స్ కూడా అమ్ముడుపోలేదు..
ఈ వేలంలో ఐరిష్ ఫాస్ట్ బౌలర్లు జోష్ లిటిల్, రవి బొపారా, సమిత్ పటేల్, షోయబ్ మాలిక్.. స్పిన్నర్లు మాథ్యూ హంఫ్రీస్, అమీర్ జమాల్, మహమ్మద్ హారిస్, మహమ్మద్ వసీం, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దునిత్ వెల్లలాగే, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే వంటి ప్రముఖ ఆటగాళ్ళు కూడా అమ్ముడుపోలేదు. ప్రస్తుత పాకిస్తాన్ T20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్ అలీ అఘా కూడా అమ్ముడుపోలేదు.

