IND vs SA రెండో వన్డే నుంచి CSK కెప్టెన్ ఔట్.. విధ్వంసక వీరుడి రీఎంట్రీ !
IND vs SA 2nd ODI: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే (ODI) మ్యాచ్ డిసెంబర్ 3వ తేదీన (బుధవారం) రాయ్‌పూర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో ఏయే మార్పులు ఉండవచ్చు, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుంది అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భారత్ పోరాడి గెలిచింది
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ విధ్వంసకర సెంచరీ బాదాడు. 120 బంతుల్లో 11 బౌండరీలు, 7 సిక్సర్లతో 135 పరుగులు సాధించాడు. అలాగే, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (57), కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) కూడా హాఫ్ సెంచరీలు చేశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 332 పరుగులకే ఆలౌట్ అయింది. మాథ్యూ బ్రీట్జ్కే (72), మార్కో జాన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) అర్ధ శతకాలతో పోరాడినా ఫలితం దక్కలేదు.
2వ వన్డేలో ఒకే ఒక మార్పుతో భారత జట్టు
డిసెంబర్ 3న జరగనున్న 2వ వన్డే మ్యాచ్‌లో భారత జట్టులో ఒకే ఒక మార్పు ఉండే అవకాశం ఉందని సమాచారం. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో రిషబ్ పంత్ ఎంట్రీ ఉంటుందని సమాచారం.
మొదటి వన్డేలో తనకు లభించిన ఏకైక అవకాశాన్ని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో 2వ వన్డేలో అతని స్థానంలో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ను ఆడించే అవకాశం ఉంది.
మిగతా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్‌లో, విరాట్ కోహ్లీ వన్-డౌన్‌లో, ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉంటారు.
మిడిల్ ఆర్డర్‌లో పంత్, జడేజా
మిడిల్ ఆర్డర్‌లో వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, చివర్లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తారు. స్పిన్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉంటారు. ఫాస్ట్ బౌలింగ్‌లో మొదటి వన్డేలో అద్భుతంగా రాణించిన హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలు ఉంటారు.
భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)
దక్షిణాఫ్రికాతో జరిగే 2వ వన్డే కోసం భారత జట్టు బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):
1. కేఎల్ రాహుల్ (కెప్టెన్)
2. రోహిత్ శర్మ
3. యశస్వి జైస్వాల్
4. విరాట్ కోహ్లీ
5. రిషబ్ పంత్
6. వాషింగ్టన్ సుందర్
7. రవీంద్ర జడేజా
8. హర్షిత్ రాణా
9. కుల్దీప్ యాదవ్
10. అర్ష్‌దీప్ సింగ్
11. ప్రసిద్ధ్ కృష్ణ

