అరె చిచ్చా.! ఇది హిట్‌మ్యాన్ ఇలాకా.. మళ్లీ బాహుబలి రేంజులో టాప్‌లోకి వచ్చేశాడుగా
Rohit Sharma: వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. 781 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్‌ను వెనక్కి నెట్టాడు. శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో టాప్ 5లో కొనసాగగా..

రోహిత్ తిరిగి అగ్రస్థానానికి..
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. బ్యాటర్ల విభాగంలో గత వారం ఒక స్థానం కోల్పోయినప్పటికీ, అద్భుత ప్రదర్శనతో మరోసారి నంబర్ వన్ ప్లేయర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం 781 రేటింగ్ పాయింట్లతో ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అతని అద్భుత ఫామ్ అతని కెరీర్‌లో మొదటిసారిగా అగ్రస్థానానికి చేర్చింది.
ఇద్దరి మధ్య 15 పాయింట్లు తేడా..
న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్, వెస్టిండీస్‌తో జరిగిన చివరి రెండు వన్డేలకు అందుబాటులో లేకపోవడంతో టాప్ ప్లేస్‌ను కోల్పోయి, 766 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. రోహిత్ శర్మ, డారిల్ మిచెల్ మధ్య 15 పాయింట్ల స్వల్ప అంతరం ఉంది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ 764 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
ఐదో ర్యాంకులో విరాట్ కోహ్లీ
టీమిండియాకు చెందిన యువ సంచలనం శుభ్‌మాన్ గిల్ 745 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లీ 725 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఒక స్థానం కోల్పోయి 8వ ర్యాంకు నుంచి 9వ ర్యాంకుకు పడిపోయాడు. కేఎల్ రాహుల్ 16వ స్థానంలో కొనసాగుతున్నాడు.
టాప్ 10లో భారత్ నుంచి ఒక్కడే ఆటగాడు..
వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో భారత్ నుంచి ఒక్క ఆటగాడు మాత్రమే ఉన్నాడు. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక స్థానం కోల్పోయినప్పటికీ, ప్రస్తుతం ఏడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా 14వ ర్యాంకులో, మహమ్మద్ సిరాజ్ 15వ ర్యాంకులో, మహమ్మద్ షమీ 18వ ర్యాంకులో, అక్షర్ పటేల్ 29వ ర్యాంకులో కొనసాగుతున్నారు.
అక్షర్ పటేల్ తొమ్మిదో ర్యాంకు
ఆల్‌రౌండర్ల జాబితాలోనూ భారత్ నుంచి ఒకే ఆటగాడు టాప్ 10లో స్థానం సంపాదించాడు. అక్షర్ పటేల్ తొమ్మిదో ర్యాంకును నిలబెట్టుకున్నాడు. అఫ్గానిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉండగా, రవీంద్ర జడేజా 11వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా 24వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

