ముంబై టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు.? రూ. 2.75 కోట్లతో అంబానీ ఏం చేస్తారబ్బా
IPL 2026: ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తమ వ్యూహాలకు పదునుపెట్టాయ్. తక్కువ పర్స్‌తో ముంబై బ్యాకప్ ప్లేయర్‌లపై దృష్టి సారించగా, పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్, స్పిన్నర్ కోసం వెతుకుతోంది.

మినీ వేలానికి అంతా సిద్దం..
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌కు అన్ని ఫ్రాంచైజీలు సిద్దమయ్యాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసేందుకు సిద్దమయ్యాయి. ముంబై ఇండియన్స్ దగ్గర అతి తక్కువ పర్స్ ఉంది. కేవలం రూ. 2.75 కోట్లతో మినీ వేలంలోకి అడుగుపెడుతోంది. తమ కోర్ టీమ్‌ను పూర్తిగా రిటైన్ చేసుకున్న ముంబై, వేలానికి ముందే ముగ్గురు ఆటగాళ్లను ట్రేడ్ చేసుకుంది. దీంతో ముంబై, ప్రస్తుతం 20 మంది ఆటగాళ్లతో బలంగా ఉంది. కేవలం ఐదు స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒక ఫారెన్ స్లాట్ మాత్రమే ఉంది.
బ్యాకప్ ప్లేయర్స్ ఎవరు..
వేలంలో ముంబై లక్ష్యం బ్యాకప్ ప్లేయర్‌ను కొనుగోలు చేయడమే. ముఖ్యంగా వికెట్ కీపర్ రియాన్ రికల్టన్ ఫామ్‌లో లేకపోవడం, ట్రెంట్ బోల్ట్‌కు సరైన విదేశీ పేస్ బౌలింగ్ బ్యాకప్ లేకపోవడం ఆ జట్టును ఆందోళన కలిగిస్తోంది. ముంబై జట్టు విల్ జాక్స్‌ను విదేశీ బ్యాట్స్‌మెన్ బ్యాకప్‌గా వాడుతోంది. బౌలింగ్‌లో స్పెన్సర్ జాన్సన్ లేదా ముస్తాఫిజుర్ రెహమాన్ లాంటి ఎడమచేతి వాటం పేసర్‌ను లక్ష్యంగా చేసుకోవచ్చు. వాళ్లు దొరక్కపోతే బెన్ ద్వార్షుయిస్‌ను కొనే ఛాన్స్ ఉంది. ఇక డొమెస్టిక్ ప్లేయర్ల తీసుకోనుంది ముంబై.
21 మంది ఆటగాళ్ల రిటైన్..
పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 కోసం అత్యధికంగా 21 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రూ. 11.5 కోట్లతో ఆక్షన్‌లోకి వస్తోంది. రెండు విదేశీ, రెండు దేశీయ స్లాట్‌లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ జట్టుకు బలమైన ప్లేయింగ్ ఎలెవన్ ఉంది. జేవియర్ బాట్‌లెట్, స్టోయినిస్/ఓవెన్ అజ్మతుల్లా ఓమర్‌జాయ్ లాంటి ప్లేయర్స్ మంచి బ్యాకప్‌లుగా ఉన్నారు. ముషీర్ ఖాన్, విష్ణు వినోద్, వైశాక్ విజయ్ కుమార్, నరెస్ట్ ఠాకూర్ లాంటి ఇండియన్ బెంచ్ స్ట్రెంత్ కూడా బలంగా ఉంది. అయితే, జట్టుకు సరైన విదేశీ వికెట్ కీపర్ లేడు.
వికెట్ కీపర్, బ్యాకప్ స్పిన్నర్..
జాస్ ఇంగ్లిష్‌ను వదిలేయడంతో క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్ లాంటి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లను లక్ష్యంగా పెట్టుకోవచ్చు పంజాబ్. అలాగే విదేశీ స్పిన్నర్ కోసం ముజీబుర్ రెహమాన్, మహేష్ తీక్షణ లేదా అఖిల్ హుస్సేన్ లాంటి వారిని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అలాగే చాహల్, బ్రార్‌లకు బ్యాకప్‌గా కరణ్ శర్మ, ప్రశాంత్ సోలంకి, సంజయ్ యాదవ్ లాంటి ఇండియన్ స్పిన్నర్‌ల కోసం పంజాబ్ చూడవచ్చు. దేశీ వికెట్ కీపర్ కోసం అధిక ధర వెచ్చించేందుకు పంజాబ్ సిద్దం అవ్వొచ్చునని అంచనా.
ముంబై అలా.. పంజాబ్ ఇలా..
అటు ఐపీఎల్‌లో అగ్ర జట్టుల్లో ఒకటైన ముంబై ఈసారి తక్కువ పర్స్‌తో ఎలాంటి జట్లను కొనుగోలు చేస్తుంది.. చాలా ఏళ్ల తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ చేరుకొని.. 15 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరుకున్న పంజాబ్.. ఈసారి కచ్చితంగా ఫైనల్ గెలిచి ట్రోఫీ నెగ్గాలని.. తన జట్టును బలంగా మార్చుకోనుంది.

