MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Paris Olympics 2024 : రేస్‌వాక్ ఫైనల్‌‌లో ప్రియాంక గోస్వామి - ఇంతకీ ఎవరీమె

Paris Olympics 2024 : రేస్‌వాక్ ఫైనల్‌‌లో ప్రియాంక గోస్వామి - ఇంతకీ ఎవరీమె

Paris Olympics 2024-Priyanka Goswami: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ప్రియాంక గోస్వామి 2021లో జార్ఖండ్‌లో జరిగిన నేషనల్ ఓపెన్ రేస్ వాకింగ్ ఛాంపియన్‌షిప్‌లో 1:28:45 గంట‌ల స‌మ‌యంలో పూర్తిచేసి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఇప్పుడు  పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 20 కి.మీ రేస్‌వాక్ ఫైనల్‌లో బరిలోకి దిగింది. 

Mahesh Rajamoni | Updated : Aug 01 2024, 10:31 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Priyanka Goswami

Priyanka Goswami

Paris Olympics 2024-Priyanka Goswami: పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్ ఫైనల్లో భారత రేస్ వాక‌ర్ ప్రియాంక గోస్వామి భార‌త్ కు మ‌రో ఒలింపిక్ మెడ‌ల్ ను అందించడానికి బరిలోకి దిగింది. పారిస్ ఒలింపిక్స్ ఆరో రోజైన గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు గోస్వామి ఫైనల్ రేసులో పాల్గొంటారు. అంత‌కుముందు, టోక్యో ఒలింపిక్స్ లో అరంగేట్రం చేసిన గోస్వామికి ఇది రెండో ఒలింపిక్స్. టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె 17వ స్థానంలో నిలిచారు.

25
Priyanka Goswami

Priyanka Goswami

ఎవ‌రీ ప్రియాంక గోస్వామి? ప్రియాంక గోస్వామి స్వ‌స్థ‌లం ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన గోస్వామి తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే క్రీడల వైపు మొగ్గు చూపారు. అథ్లెటిక్స్ కు మారడానికి ముందు ఆమె పాఠశాలలో కొంత‌కాలం పాటు జిమ్నాస్టిక్స్ ప్రాక్టిస్ చేశారు. అయితే, ఆమె చివ‌ర‌కు రేస్ వాకింగ్ కెరీర్ ను ఎంచుకున్నారు.

35
Asianet Image

ఈ 28 ఏళ్ల యంగ్ అథ్లెట్ జార్ఖండ్ లో జరిగిన 2021 నేషనల్ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్ షిప్ లో 1:28:45 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. టోక్యో ఒలింపిక్స్ లో గోస్వామి చోటు దక్కించుకోవడానికి దోహదపడిన జాతీయ రికార్డు కూడా ఇదే. 2022 కామన్వెల్త్ గేమ్స్ లో 10,000 మీటర్ల నడకలో రజత పతకం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్  రేస్ వాకింగ్ లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్ గా చ‌రిత్ర సృష్టించింది.

 

45
Asianet Image

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 2023లో  ప్రియాంక గోస్వామి 20 కిలోమీటర్ల రేస్-వాక్ ఈవెంట్ లో రజతం సాధించారు. ప్రస్తుతం మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్ లో 30వ ర్యాంక్, మహిళల ఓవరాల్ ర్యాంకింగ్ 1194గా ఉంది. మారథాన్ రేస్ వాక్ రిలేలో కూడా భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తుంది.
 

55
Asianet Image

20 కిలోమీటర్ల రేస్ వాక్ తో పాటు ఆగస్టు 7న జరిగే పారిస్ ఒలింపిక్స్ 2024లో మిక్స్ డ్ మారథాన్ రేస్ వాక్ రిలే ఈవెంట్ లో గోస్వామి భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
భారత దేశం
 
Recommended Stories
MI vs DC: ఢిల్లీ చిత్తు.. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ బెర్త్ క‌న్ఫార్మ్ చేసుకున్న ముంబై ఇండియ‌న్స్
MI vs DC: ఢిల్లీ చిత్తు.. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ బెర్త్ క‌న్ఫార్మ్ చేసుకున్న ముంబై ఇండియ‌న్స్
Mumbai Indians: అంబానీ టీమ్ కు టెన్షన్ పెంచుతున్న ఆర్సీబీ స్టార్
Mumbai Indians: అంబానీ టీమ్ కు టెన్షన్ పెంచుతున్న ఆర్సీబీ స్టార్
IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిది ఆ జట్టేనా !
IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిది ఆ జట్టేనా !
Top Stories