MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ సంజూ మేనియా! ఇది మనోడి సత్తా !

భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్‌లోనూ సంజూ మేనియా! ఇది మనోడి సత్తా !

Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లోకి భారత్‌ను చేర్చిన సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. కోహ్లీలా ఆడాడంటూ కొనియాడారు. సోషల్ మీడియాలో పాక్ ప్లేయర్ల కామెంట్స్ వైరల్ గా మారాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 02 2026, 08:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సంజూ శాంసన్ విశ్వరూపం.. పాక్ దిగ్గజాలు కూడా ఫిదా !
Image Credit : Getty

సంజూ శాంసన్ విశ్వరూపం.. పాక్ దిగ్గజాలు కూడా ఫిదా !

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. తన అజేయమైన 97* పరుగుల ఇన్నింగ్స్‌తో భారత జట్టును సెమీఫైనల్‌కు చేర్చాడు. ఈ విజయంతో కేవలం భారత్‌లోనే కాకుండా, దాయాది దేశం పాకిస్థాన్‌లో కూడా సంజూ పేరు మారుమోగిపోతోంది. రెండుసార్లు ఛాంపియన్లైన వెస్టిండీస్ విధించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో సంజూ చూపిన పరిణతిని సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి దిగ్గజాలతో పాటు పాక్ మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సంజూ లో విరాట్ కోహ్లీ కనిపిస్తున్నాడు: బాసిత్ అలీ
Image Credit : Getty

సంజూ లో విరాట్ కోహ్లీ కనిపిస్తున్నాడు: బాసిత్ అలీ

పాకిస్థాన్ మాజీ బ్యాటర్ బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో సంజూ బ్యాటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సంజూ బ్యాటింగ్‌లో నాకు విరాట్ కోహ్లీ కనిపించాడు. వేర్వేరు బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టే విధానం, అతని పవర్ హిట్టింగ్ అద్భుతం" అని కొనియాడారు. కోహ్లీ లేని లోటు తెలియకుండా సంజూ ఛేజ్ మాస్టర్ లా వ్యవహరించాడని ఆయన పేర్కొన్నారు. ఏ బౌలర్‌ను ఎప్పుడు టార్గెట్ చేయాలి, గేర్లు ఎప్పుడు మార్చాలి అనే విషయంలో సంజూ లెక్కలు పక్కాగా ఉన్నాయని బాసిత్ అన్నారు.

36
ఒత్తిడిలో నిలబడిన సంజూ
Image Credit : Getty

ఒత్తిడిలో నిలబడిన సంజూ

పవర్‌ప్లేలో దూకుడుగా ఆడాల్సిన అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10) త్వరగానే పెవిలియన్ చేరారు. ఆ సమయంలో సంజూ బాధ్యతాయుతంగా ఆడి జట్టును ఆదుకున్నాడు. "పవర్‌ప్లే హిట్టర్లు ఇద్దరూ అవుటైనప్పుడు సంజూ ఆడిన ఇన్నింగ్స్ విలువ 125 పరుగులతో సమానం. వారిద్దరి లోటు తెలియకుండా జట్టును ముందుకు నడిపించాడు" అని బాసిత్ అలీ అభినందించారు.

46
సంజూకు వ్యక్తిగత మైలురాళ్ల కంటే విజయమే ముఖ్యం: హఫీజ్
Image Credit : ANI

సంజూకు వ్యక్తిగత మైలురాళ్ల కంటే విజయమే ముఖ్యం: హఫీజ్

పాక్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ మాట్లాడుతూ.. సంజూ నిస్వార్థమైన ఆట తీరును మెచ్చుకున్నారు. "సంజూ ఎప్పుడూ తన వ్యక్తిగత సెంచరీ కోసం ప్రయత్నించలేదు. అతనికి 100 కంటే జట్టు విజయమే ముఖ్యం. తొలుత దూకుడుగా ఆడిన అతను, తర్వాత ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు యాంకర్ రోల్ పోషించాడు. ఆటగాడికి తన దేశాన్ని గెలిపించడమే అతిపెద్ద మైలురాయి అని సంజూ నిరూపించాడు" అని హఫీజ్ పేర్కొన్నారు.

56
షెహజాద్ సవాల్.. సంజూ ప్రశంస
Image Credit : ANI

షెహజాద్ సవాల్.. సంజూ ప్రశంస

పాక్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ సైతం సంజూ ప్రదర్శనను చూసి ఆశ్చర్యపోయారు. ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్ ఓడిపోతుందని జోస్యం చెప్పిన మహమ్మద్ అమీర్ అంచనాలను ఆయన తప్పుబట్టారు. "సంజూ శాంసన్.. క్యా బాత్ హై! దక్షణి ఆఫ్రికాపై గతంలో రెండు సెంచరీలు బాదినా, అతనికి తగినన్ని అవకాశాలు రాలేదు. కానీ ఈ మ్యాచ్‌తో అతని కెరీర్ కొత్త మలుపు తిరుగుతుంది" అని షెహజాద్ అన్నారు.

66
కోహ్లీ, రోహిత్ ల నుండి నేర్చుకున్న పాఠం
Image Credit : X/BCCI

కోహ్లీ, రోహిత్ ల నుండి నేర్చుకున్న పాఠం

మ్యాచ్ అనంతరం సంజూ మాట్లాడుతూ.. తాను గత పదేళ్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను గమనిస్తూ చాలా నేర్చుకున్నానని చెప్పాడు. అదే క్రమశిక్షణను మైదానంలో అమలు చేశానని, ఇది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజని తెలిపాడు. పరిమిత అవకాశాలు వచ్చినప్పటికీ, అత్యంత కీలకమైన సెమీఫైనల్ చేరే మ్యాచ్‌లో ఇలాంటి ప్రదర్శన చేయడం సంజూ పోరాట పటిమకు నిదర్శనం. భారత్ తన తర్వాతి సెమీఫైనల్ మ్యాచ్‌ను గురువారం ఇంగ్లాండ్‌తో ఆడనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Related Stories
Recommended image1
Pakistan : పాకిస్థాన్ క్రికెటర్లకు బిగ్ షాక్ !
Recommended image2
IND vs ENG : ముంబైలో భారత్-ఇంగ్లాండ్ వార్.. ఈసారి సెమీస్ గెలిచేది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved