MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • IPL 2026 : జడేజా కాదు జైస్వాల్ కాదు.. రాజస్థాన్ పగ్గాలు కొత్త స్టార్ కు ! అసలు ఏం జరిగిందంటే?

IPL 2026 : జడేజా కాదు జైస్వాల్ కాదు.. రాజస్థాన్ పగ్గాలు కొత్త స్టార్ కు ! అసలు ఏం జరిగిందంటే?

Rajasthan Royals : ఐపీఎల్ 2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌ను నియమించింది. సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లడంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 13 2026, 08:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆ ఇద్దరు స్టార్లు కాదు.. రాజస్థాన్ రాయల్స్ కొత్త సారథిగా రియాన్ పరాగ్
Image Credit : X/AnandSRH

ఆ ఇద్దరు స్టార్లు కాదు.. రాజస్థాన్ రాయల్స్ కొత్త సారథిగా రియాన్ పరాగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభానికి ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ, క్రికెట్ వర్గాల్లో అప్పుడే వేడి మొదలైంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు నాయకత్వ మార్పుపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలకు ఇప్పుడు తెరపడింది. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తమ కొత్త కెప్టెన్‌గా యువ ఆటగాడు రియాన్ పరాగ్‌ను అధికారికంగా ఎంపిక చేసింది. స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ జట్టును వీడటంతో, మేనేజ్‌మెంట్ పరాగ్ వైపు మొగ్గు చూపింది. ఈ నిర్ణయం ఐపీఎల్ అభిమానుల్లో పెను సంచలనంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంజూ శాంసన్ ట్రేడ్.. చెన్నైకి వెళ్తున్న స్టార్ ప్లేయర్
Image Credit : Getty

సంజూ శాంసన్ ట్రేడ్.. చెన్నైకి వెళ్తున్న స్టార్ ప్లేయర్

రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఈ భారీ మార్పుకు ప్రధాన కారణం సంజూ శాంసన్ జట్టును వీడటమే. ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో భాగంగా భారీ డీల్ కుదిరింది. సంజూ శాంసన్ రాబోయే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడనున్నారు. ఈ ట్రేడ్ ఒప్పందంలో భాగంగా, సంజూ శాంసన్‌కు బదులుగా రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ వచ్చి చేరారు. కీలక ఆటగాడు, కెప్టెన్ వెళ్ళిపోవడంతో, జట్టును నడిపించే బాధ్యత ఎవరికి ఇవ్వాలనే దానిపై రాజస్థాన్ మేనేజ్‌మెంట్ తీవ్రంగా ఆలోచించి చివరకు రియాన్ పరాగ్ పేరును ఖరారు చేసింది.

35
గతంలోనూ కెప్టెన్‌గా పరాగ్ అనుభవం
Image Credit : ANI

గతంలోనూ కెప్టెన్‌గా పరాగ్ అనుభవం

రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ కొత్తేమీ కాదు. 2025 ఐపీఎల్ సీజన్‌లో ఆయన తాత్కాలికంగా జట్టును నడిపించాడు. గతేడాది సీజన్ ప్రారంభ మ్యాచ్‌లలో రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా దూరమవ్వగా, ఆ సమయంలో పరాగ్ సారథ్య బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆ సమయంలో ఆయన నాయకత్వంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పరాగ్ కెప్టెన్సీలో రాజస్థాన్ ఆడిన 8 మ్యాచ్‌లలో కేవలం 2 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. అయినప్పటికీ, పరాగ్ బ్యాటింగ్‌లో చూపిస్తున్న ప్రతిభ, జట్టులో ఆయనకున్న ప్రాముఖ్యతను గుర్తించిన మేనేజ్‌మెంట్, ఈసారి పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలను ఆయనకు అప్పగించింది.

45
రియాన్ పరాగ్ ఐపీఎల్ కెరీర్ గణాంకాలు ఇవే
Image Credit : ANI

రియాన్ పరాగ్ ఐపీఎల్ కెరీర్ గణాంకాలు ఇవే

అస్సాంకు చెందిన ఈ యువ ఆటగాడు 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేశారు. అప్పటి నుండి రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉంటూ అనేక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడారు. తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 84 మ్యాచ్‌లు ఆడిన పరాగ్, 26.98 సగటుతో 1566 పరుగులు సాధించారు. ఇందులో ఆయన స్ట్రైక్ రేట్ 141.89 గా ఉండటం విశేషం. ఇప్పటివరకు మొత్తం 7 అర్ధసెంచరీలు సాధించిన పరాగ్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చేసిన 95 పరుగులు ఆయన వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు. తక్కువ సమయంలోనే జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా, ఫినిషర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

55
2007 నుండి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ల ప్రస్థానం ఇదే
Image Credit : Getty

2007 నుండి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ల ప్రస్థానం ఇదే

ఐపీఎల్ ప్రారంభం నుండి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు పలువురు దిగ్గజ ఆటగాళ్లు నాయకత్వం వహించారు. ఆ జాబితాను ఒకసారి పరిశీలిస్తే..

• షేన్ వార్న్: 2008లో తొలి సీజన్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌ను విజేతగా నిలిపిన ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్.

• రాహుల్ ద్రవిడ్: వార్న్ తర్వాత భారత క్రికెట్ గోడ రాహుల్ ద్రవిడ్ జట్టు పగ్గాలు చేపట్టారు.

• షేన్ వాట్సన్: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ వాట్సన్ కూడా జట్టును నడిపించారు.

• అజింక్యా రహానే: భారత బ్యాటర్ రహానే కొంతకాలం సారథిగా వ్యవహరించారు.

• స్టీవ్ స్మిత్: మరో ఆస్ట్రేలియా స్టార్ స్మిత్ నేతృత్వంలో జట్టు బరిలోకి దిగింది.

• సంజూ శాంసన్: గత కొన్ని సీజన్లుగా శాంసన్ జట్టును సమర్థంగా నడిపించి, ఫైనల్స్ వరకు తీసుకెళ్లారు.

• రియాన్ పరాగ్ (2026): ఇప్పుడు ఈ వారసత్వాన్ని రియాన్ పరాగ్ కొనసాగించనున్నారు.

రాబోయే 2026 సీజన్‌లో పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రీడలు
క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IND vs PAK : భారత్ vs పాకిస్థాన్‌ బిగ్ ఫైట్.. T20 వరల్డ్ కప్ లో ఎవరిది పై చేయి?
Recommended image2
IND vs PAK : ఒకేసారి ఇద్దరు భారత ఓపెనర్లకు గాయాలు.. గంభీర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved