MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • మైదానంలోకి మహీ.? ఈ ఐపీఎలే.. లాస్టా.! మళ్లీ రచ్చ మొదలు

మైదానంలోకి మహీ.? ఈ ఐపీఎలే.. లాస్టా.! మళ్లీ రచ్చ మొదలు

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 19వ సీజన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 44 ఏళ్ల వయసులోనూ ధోని నెట్స్‌లో శ్రమిస్తున్న దృశ్యాలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.  

2 Min read
Author : Pavithra D
Published : Jan 29 2026, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రెండు నెలల్లో ఐపీఎల్
Image Credit : CSK\Twitter

రెండు నెలల్లో ఐపీఎల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ ప్రతిష్టాత్మక లీగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మైదానంలో చెమటోడుస్తున్న ధోని
Image Credit : X/@IPL, CSK

మైదానంలో చెమటోడుస్తున్న ధోని

44 ఏళ్ల వయసులోనూ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో చెమటోడుస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (జేఎస్సీఏ) అధికారికంగా విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్యాడ్లు కట్టుకొని నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తూ కనిపిస్తున్నారు. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఆయన సన్నాహాలు మొదలుపెట్టినట్లు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.

Related Articles

Related image1
Dhoni: రాంచీలో బైక్‌పై దర్శనమిచ్చిన ధోనీ.. ఫోటో వైరల్
Related image2
MS Dhoni : రాంచీకి వెళ్తా, బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తా.. IPL 2025 తర్వాత ధోని ప్లాన్ ఏంటో తెలుసా?
35
ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్
Image Credit : X/@Diptiranjan_7

ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్

వీడియోలో ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ, బౌలర్లపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, తలా తన సన్నద్ధతను మాత్రం ముందే ప్రారంభించారు. జార్ఖండ్ క్రికెట్ బోర్డ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. "చూడండి ఎవరు తిరిగి వచ్చారో" అని పేర్కొంది. అంతేకాకుండా, వీడియోలో మరో క్యాప్షన్ కూడా ఉంది, అదేమిటంటే "జేఎస్సీఏ గర్వకారణం మహేంద్ర సింగ్ ధోని" అని రాసుకొచ్చింది.

45
ధోని కసరత్తు..
Image Credit : X/@sujeetsuman1991

ధోని కసరత్తు..

ఈ ప్రాక్టీస్ సెషన్‌కు ముందు ధోని, జేఎస్సీఏ అధికారి, క్రికెటర్ సౌరభ్ తివారీతో మాట్లాడుతుండటం కూడా గమనించవచ్చు. ప్రస్తుతం అన్ని జట్లు ఐపీఎల్ కు ముందు జరగనున్న టీ20 ప్రపంచ కప్ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నాయి. ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో తమ ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతారు.

55
ధోని తిరిగి మైదానంలోకి..
Image Credit : X/@IPL

ధోని తిరిగి మైదానంలోకి..

ఈ క్రమంలో ధోని ప్రాక్టీస్ వీడియో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ధోని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడం, తనదైన శైలిలో ప్రాక్టీస్ ప్రారంభించడం ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. అయితే, ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా లేదా అనేది ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 26న ప్రారంభమై మే 31 వరకు కొనసాగుతుంది. ఈ సీజన్‌లో ధోని ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Recommended image2
IND vs SL: వర్షం పడే సరికే పని ఫినిష్.. గాలే టెస్టులో శ్రీలంకను భారత్ ఎలా దెబ్బకొట్టింది?
Recommended image3
Hockey World Cup: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. రెండో రౌండ్‌కు టీమిండియా
Related Stories
Recommended image1
Dhoni: రాంచీలో బైక్‌పై దర్శనమిచ్చిన ధోనీ.. ఫోటో వైరల్
Recommended image2
MS Dhoni : రాంచీకి వెళ్తా, బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తా.. IPL 2025 తర్వాత ధోని ప్లాన్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved