MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • Dhoni Injury : ధోనికి మళ్లీ గాయం... ఇక ఐపిఎల్ కు గుడ్ బై చెప్పినట్లేనా..?

Dhoni Injury : ధోనికి మళ్లీ గాయం... ఇక ఐపిఎల్ కు గుడ్ బై చెప్పినట్లేనా..?

వరుస గాయాలతో సతమతం అవుతున్న స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ దూరమైనట్లేనా…? చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఏమంటున్నారంటే..

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 27 2026, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ధోనికి ఏమయ్యింది..?
Image Credit : Insta/M S Dhoni

ధోనికి ఏమయ్యింది..?

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సపోర్టర్స్ మాత్రమే కాదు క్రికెట్ ను అభిమానించే ప్రతి ఇండియన్ కోరుకునేది ఒక్కటే... స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ధనాధన్ షాట్లు బాదుతుంటే చూడాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైరైనా ఐపిఎల్ లో అతడి ఆటను చూడాలని ఎదురుచూస్తున్నారు... కానీ ఇప్పటివరకు ధోని మైదానంలోకి దిగలేదు. దీంతో ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో అతడు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే గాయంతో నెల రోజులుగా ఆటకు దూరంగా ఉన్న ధోనీ… ప్రాక్టీస్ సమయంలో మరోసారి గాయపడినట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ధోని మెరుపులు ఇక చూడలేమా..?
Image Credit : Getty

ధోని మెరుపులు ఇక చూడలేమా..?

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఎంఎస్ ధోని ఆడతాడని అభిమానులు భావించారు... చివర్లో వచ్చినా మెరుపులు చూడవచ్చని భావించారు. కానీ మార్చి 28న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు ముందే అతడి పిక్క కండరాల గాయమైంది. అప్పటి నుంచి దాదాపు నెల రోజులుగా అతను ఏ మ్యాచ్‌లోనూ ఆడలేదు. సిఎస్కే తరఫున ధోనీ 8 మ్యాచ్‌లకు దూరం కావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

Related Articles

Related image1
IPL : ధోని టీమ్ కు భారంగా స్టార్ ఓపెనర్.. సీఎస్‌కే కొత్త కెప్టెన్‌గా సంజూ?
Related image2
MS Dhoni: బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించే ధోనికి అదంటే చచ్చెంత భ‌యం.. మిస్ట‌ర్ కూల్ ఆస‌క్తిక విష‌యాలు
35
ధోని కోసం అభిమానుల ఎదురుచూపులు..
Image Credit : ANI

ధోని కోసం అభిమానుల ఎదురుచూపులు..

ఇటీవల వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ధోనీ బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు... దీంతో ఈ మ్యాచ్ ఆడతాడని అభిమానులు ఆశించారు. కానీ ధోని మైదానంలోకి దిగలేదు. ఆ తర్వాత చెపాక్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతను ఆడలేదు. ఆ మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇది ఈ సీజన్‌లో CSKకి ఐదో ఓటమి.

45
ధోని గాయంపై చెన్నై కోచ్ ఏమన్నారంటే..
Image Credit : ANI

ధోని గాయంపై చెన్నై కోచ్ ఏమన్నారంటే..

అయితే ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎంఎస్ ధోనీ రీఎంట్రీ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఇటీవల వార్మప్ ప్రాక్టీస్ సెషన్‌లో అతని గాయం మళ్లీ తిరగబెట్టిందట. దీంతో అతను ఎప్పుడు జట్టులోకి వస్తాడనే దానిపై అనిశ్చితి పెరిగింది. 

గుజరాత్ టైటాన్స్‌తో ఓటమి తర్వాత చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. 'వార్మప్ సమయంలో ధోనీకి అప్పటికే గాయమైన పిక్క కండరాలు మళ్లీ బెణికాయి. దీంతో అతను కోలుకోవడానికి మేము అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుంది. గాయం తీవ్రం కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటాం' అని చెప్పారు. ఈ సీజన్ తొలి అర్ధభాగంలో ధోనీ లేకపోవడం CSK జట్టు బ్యాలెన్స్‌పై పెద్ద ప్రభావం చూపింది. కీలక సమయాల్లో జట్టులో అనుభవం లోపించడం స్పష్టంగా కనిపించింది.

55
ధోని ఆడతాడా.. లేదా..?
Image Credit : ANI

ధోని ఆడతాడా.. లేదా..?

ధోనీ పరిస్థితిపై ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. 'అతని గాయంలో మెరుగుదల ఉంది. కానీ ఇంకా పూర్తిగా సిద్ధంగా లేడు. మెడికల్ టీమ్ అతన్ని నిశితంగా గమనిస్తోంది. అతను ఎప్పుడు తిరిగొస్తాడనేదానిపై కచ్చితమైన టైమ్‌లైన్ లేదు' అన్నారు.

 గత ఐపీఎల్ సీజన్‌లో ఎంఎస్ ధోనీ మోకాలి నొప్పితోనే వికెట్ కీపింగ్, బ్యాటింగ్ చేశాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన ధోనీ, 14 మ్యాచ్‌ల్లో 24.50 సగటు, 135.17 స్ట్రైక్ రేట్‌తో 196 పరుగులు చేశాడు. కానీ ఈసారి ధోని మెరుపు బ్యాటింగ్ మిస్సవుతున్నారు అభిమానులు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఎం.ఎస్. ధోని
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
IPL : ధోని టీమ్ కు భారంగా స్టార్ ఓపెనర్.. సీఎస్‌కే కొత్త కెప్టెన్‌గా సంజూ?
Recommended image2
MS Dhoni: బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించే ధోనికి అదంటే చచ్చెంత భ‌యం.. మిస్ట‌ర్ కూల్ ఆస‌క్తిక విష‌యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved