అందుకే రెండు టీ20లకు అర్ష్‌దీప్ దూరం.. బౌలింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..
Arshdeep Singh: ఆస్ట్రేలియాతో తొలి రెండు టీ20 మ్యాచ్‌లకు అర్ష్ దీప్ సింగ్ ను పక్కన పెట్టడంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పష్టతనిచ్చారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు వివిధ కాంబినేషన్‌లను ప్రయత్నించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని

తొలి రెండు టీ20 మ్యాచ్‌లకు
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచ్‌లకు భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం వెనుక కారణాన్ని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పష్టతనిచ్చారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు వివిధ కాంబినేషన్‌లను ప్రయత్నించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, అర్ష్ దీప్ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడని మోర్కెల్ పేర్కొన్నారు. క్వీన్లాండ్స్‌లో ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోర్నీ ఈ విషయాలను వెల్లడించారు.
అర్ష్ దీప్ ఒక ప్రపంచ స్థాయి బౌలర్
మోర్కెల్ మాట్లాడుతూ, అర్ష్ దీప్ సింగ్ అత్యంత అనుభవం కలిగిన ఆటగాడని, తమ జట్టు కాంబినేషన్‌ల గురించి అతడు సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడని తెలిపారు. అర్ష్ దీప్ ఒక ప్రపంచ స్థాయి బౌలర్ అని, పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అతనికి ప్రత్యేక గుర్తింపు ఉందని గుర్తుచేశారు. జట్టుకు అతని విలువ ఎంతటిదో తమకు పూర్తిగా తెలుసని, అయితే ఈ పర్యటనలో తాము వివిధ కాంబినేషన్‌లను ప్రయత్నిస్తున్నామని మోర్కెల్ వివరించారు. అందుకే అర్ష్ దీప్ సింగ్ ను పక్కన పెట్టాల్సి వచ్చిందని, ఈ పరిస్థితిని అతడు అర్థం చేసుకున్నాడని మోర్నీ పునరుద్ఘాటించారు.
మోర్కెల్ వ్యాఖ్యలు
జట్టు ఎంపిక కేవలం మేనేజ్‌మెంట్‌కే కాకుండా, ఆటగాళ్లకు కూడా ఒక సవాలని మోర్కెల్ పేర్కొన్నారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ ముంగిట ఉన్నామని, అందువల్ల భిన్న కూర్పులను ప్రయత్నిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ఆటగాళ్లకు అవకాశం రాలేదని నిరుత్సాహపడటం సహజమేనని అంగీకరించారు. అయితే, మేనేజ్‌మెంట్ వైపు ఆలోచన మరోలా ఉంటుందని, ఆటగాళ్లను మరింత శ్రమించేలా ప్రోత్సహించడం తమ లక్ష్యమని తెలిపారు. ఎప్పుడు అవకాశం వచ్చినా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేలా వారిని సంసిద్ధం చేస్తామని మోర్కెల్ పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి..
వచ్చే టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు చాలా తక్కువ మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి వస్తోందని, ఈ ఒత్తిడి సమయాల్లో ఆటగాళ్లు ఎలా రాణిస్తారనేది పరీక్షించామని ఆయన వివరించారు. ఆటగాళ్ల సత్తాపై తమకు ఎలాంటి అపనమ్మకం లేదని, మ్యాచ్‌లను ఎలా గెలవాలనే దానిపైనే తాము దృష్టి సారిస్తున్నామని మోర్నీ మోర్కెల్ స్పష్టం చేశారు.
తొలి రెండు టీ20లకు..
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టీ20లకు భారత స్టార్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ ను జట్టు మేనేజ్‌మెంట్ పక్కన కూర్చోబెట్టింది. అంతర్జాతీయ టీ20లో 100కు పైగా వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్‌ను బెంచ్ కే పరిమితం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.