Kohli Vs Rohit : హిట్ మ్యాన్ కంటే మాస్ హిట్టింగ్.. ధనాధన్ క్రికెట్లోనూ కోహ్లీనే కింగ్..!
Virat Kohli Vs Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీలలో ఎవరు తోపు అంటే చెప్పడం కష్టం. అయితే కొన్ని గణాంకాలను బట్టి ఎవరిపై ఎవరు పైచేయి కలిగివున్నారో చెప్పవచ్చు. మరి ఐపిఎల్ లో హిట్టింగ్ బాస్ ఎవరో తెలుసా?

రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ
Rohit Sharma Vs Rohit Sharma : ఇండియన్ క్రికెట్లో మరో సచిన్ టెండూల్కర్ రాడనుకున్నారు.. కానీ విరాట్ కోహ్లీ వచ్చాడు. మహేంద్ర సింగ్ ధోని లాంటి హిట్టర్ రాడనుకున్నారు... రోహిత్ శర్మ వచ్చాడు. ఈ ఇద్దరు ప్రస్తుతం టీమిండియాలో తోపు క్రికెటర్లు... ఒకరు పరుగుల వరద పారిస్తుంటే మరొకరు హిట్టింగ్ తో అభిమానులను కట్టిపడేస్తున్నాడు. మరి ఈ ఇద్దరు క్రికెటర్లలో ఎవరు గొప్ప అనే చర్చ అభిమానుల్లో తరచూ జరుగుతుంటుంది... ఫ్యాన్ వార్ సాగుతుంటుంది.
అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ గొప్ప క్రికెటర్లే... తమ బ్యాటుతో అద్భుతాలు చేయగల సమర్థులే. కానీ కొన్ని విషయాల్లో రోహిత్, మరికొన్ని విషయాల్లో కోహ్లీ ఒకరిపై ఒకరు పైచేయి కలిగి ఉన్నారు... వీరి రికార్డులు, గణాంకాలను పరిశీలస్తే ఎవరు ఎందులో తోపో అర్థమవుతుంది. కాబట్టి ఓసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఈ ఇద్దరి గణాంకాలను పరిశీలిద్దాం.
ఐపిఎల్ లో ఎవరు తోపు... కోహ్లీనా, రోహితా?
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా అద్భుతమైన రికార్డులు సృష్టించారు. ఐపీఎల్‌లో ఇద్దరి హవా ఇప్పటికీ కొనసాగుతోంది. సిక్సర్ల విషయంలో ఇద్దరూ బాస్‌లుగా నిలిచారు.
విరాట్ కోహ్లీ సిక్సర్లు కొట్టడంలోనూ కాస్త వెనకబడ్డాడు. అతను ఐపీఎల్‌లో 291 సిక్సర్లు, 771 ఫోర్లు బాదాడు. 300 సిక్సర్ల మార్కుకు కేవలం 9 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. అయితే రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఇప్పటికే 302 సిక్సర్లు, 640 ఫోర్లు బాదాడు.
ఈ గణాంకాలు చూస్తుంటే సిక్సర్లలో రోహిత్... ఫోర్లలో విరాట్ ముందున్నారు. మొత్తంగా చూసుకుంటే సిక్సర్ల విషయంలో రోహిత్, కోహ్లీ మధ్య తేడా కేవలం 11 మాత్రమే... అదే ఫోర్ల విషయంలో వీరిమధ్య 100 కు పైగా తేడా ఉంది. దీన్నిబట్టి ఐపిఎల్ లో రోహిత్ కంటే కోహ్లీ హిట్టింగ్ లో ముందున్నాడని స్పష్టమవుతోంది.
కోహ్లీ ఐపిఎల్ కెరీర్
టీమిండియా కింగ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు. 2008 మొదటి సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ తన జట్టు కోసం ఎన్నో గొప్ప రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్‌లో 267 మ్యాచ్‌లు ఆడి 8669 పరుగులు చేశాడు. అతని సగటు 39.65, స్ట్రైక్ రేట్ 132.85. కోహ్లీ 8 సెంచరీలు, 63 అర్ధసెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 113.
రోహిత్ శర్మ ఐపిఎల్ కెరీర్
టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. ఆరంభం నుంచే ఈ లీగ్‌లో ఆడుతున్నాడు. మొదట రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్నా, తర్వాత ముంబై జట్టులోకి వచ్చి తన హవా చూపిస్తున్నాడు. మొత్తం 272 ఐపీఎల్ మ్యాచ్‌లలో 7046 పరుగులు చేశాడు. అతని సగటు 29.73, స్ట్రైక్ రేట్ 132.09. ఈ లీగ్‌లో 2 సెంచరీలు, 47 అర్ధసెంచరీలు బాదాడు. అత్యధిక స్కోరు 109.
ఐపిఎల్ లో రోహిత్ పై కోహ్లీదే పైచేయి
ఈ ఇద్దరి ఐపిఎల్ కెరీర్ ను పోల్చిచూస్తే ఒక్క సిక్సర్ల విషయంలోనే రోహిత్ ముందున్నాడు. వ్యక్తిగత పరుగులు, యావరేజ్, సెంచరీలు, హాఫ్ సెంచరీలు, ఫోర్ల విషయంలోనూ రోహిత్ పై కోహ్లిదే పైచేయి. చివరకు హిట్ మ్యాన్ ఐపిఎల్ స్ట్రైక్ రేట్ 132.69 అయితే రోహిత్ స్ట్రైక్ రేట్ 132.09 మాత్రమే. ఈ గణాంకాలను బట్టి ఐపిఎల్ లో రోహిత్ కంటే కోహ్లీ హిట్టింగ్ లో ముందున్నాడని స్పష్టమవుతోంది.

