ఖోఖో ప్రపంచ కప్ 2025: సౌతాఫ్రికా చిత్తు.. ఫైనల్ కు చేరిన భారత మహిళ జట్టు
Kho World Cup 2025: ఖోఖో ప్రపంచ కప్ 2025 లో భారత మహిళల జట్టు దుమ్మురేపుతోంది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో సౌతాఫ్రికాను చిత్తుచేసి ఫైనల్ చేరుకుంది.

Kho Kho World Cup 2025: ఖోఖో ప్రపంచ కప్ 2025 లో భారత్ అదరగొడుతోంది. అద్భుతమైన ఆటతో ప్రత్యర్థి జట్లకు షాకిస్తూ ఇప్పటికు ఒక్క ఓటమి కూడా లేకుండా తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు అద్భుతమైన ఆటతో అదరగొడుతోంది. తొలి ఖోఖో ప్రపంచ కప్ 2025లో మహిళ జట్టు చరిత్ర సృష్టిస్తూ ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ కు చేరుకుంది.
శనివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఖో ఖో ప్రపంచ కప్ 2025లో మహిళల భారత మహిళ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో సౌతాఫ్రికాను చిత్తుచేసింది.
చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు
ఖో ఖో ప్రపంచ కప్ 2025 లో ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలోని భారత మహిళల జట్టు అద్భుతమైన ఆటతో అదరగొడుతోంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా భారత జట్టు లీగ్ దశను పూర్తి చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళ జట్టు సూపర్ విక్టరీ అందుకుంది. ఈ విజయంతో టీమిండియా మహిళల జట్టు సెమీఫైనల్‌కు తమ స్థానాన్ని బుక్ చేసుకుంది.
Image Credits: Twitter/All India Radio News
శనివారం సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో మన ప్లేయర్లు అదరగొట్టారు. తొలి నుంచి అధిపత్యం ప్రదర్శించారు. ఏ సమయంలోనూ సౌతాఫ్రికాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఆరంభం నుంచే సౌతాఫ్రికా జట్టుకు భారత మహిళలు చెమటలు పట్టించారు.
సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ 50 పాయింట్ల తేడాతో గెలిచింది. సౌతాఫ్రికా తమ రెండు టర్న్ లలో కలిపి 16 పాయింట్లు సాధించగా, భారత మహిళలు 66 పాయింట్లు సాధించారు. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన నిర్మాల భాటీ బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును, వైష్ణవి భజరంగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు. ఈ విజయంతో భారత జట్టు ఫైనల్ లో నేపాల్ తో తలపడనుంది.