MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ఇదేక్కడి బ్యాటింగ్ సామీ.. కరుణ్ నాయర్ షాకింగ్ కామెంట్స్

ఇదేక్కడి బ్యాటింగ్ సామీ.. కరుణ్ నాయర్ షాకింగ్ కామెంట్స్

Karun Nair : గువాహటి టెస్ట్‌లో భారత్ బ్యాటింగ్ కుప్పకూలింది. స్టార్ బ్యాటర్లు సైతం చేతులెత్తేయడంతో ఓటమి అంచుకు చేరుకుంది. దీంతో కరుణ్ నాయర్ చేసిన ఒక ట్వీట్ నెట్టింట కొత్త చర్చకు దారి తీసింది.

2 Min read
Mahesh Rajamoni
Published : Nov 24 2025, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గువాహటి టెస్ట్: భారత్ బ్యాటింగ్ పతనం నెట్టింట హాట్ టాపిక్
Image Credit : X/BCCI, karun126

గువాహటి టెస్ట్: భారత్ బ్యాటింగ్ పతనం నెట్టింట హాట్ టాపిక్

గువాహటి బర్సపారా స్టేడియంలో జరుగుతున్న భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మూడో రోజు టీమిండియా అనూహ్యంగా కుప్పకూలింది. ఇప్పటికే భారీ స్కోరు చేసిన సఫారీలకు సమాధానం ఇవ్వాల్సిన భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ కు చేరారు. 

దీంతో మ్యాచ్ పూర్తిగా సౌతాఫ్రికా జట్టు చేతిలోకి వెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 489 పరుగులు చేయగా, భారత్ మాత్రం 201 వద్ద ఆలౌట్ అయి 288 పరుగుల వెనుకంజలో పడిపోయింది.

ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని అందించినా, 65 పరుగుల భాగస్వామ్యం తర్వాత భారత బ్యాటర్ల నుంచి మంచి ఇన్నింగ్స్ రాలేదు. జైస్వాల్ 58 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్ పూర్తిగా నిరాశపరిచింది. సాయి సుదర్శన్, పంత్, జడేజా, జురెల్, నితీష్ రెడ్డి.. ఎవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు.

25
కరుణ్ నాయర్ ట్వీట్ వైరల్
Image Credit : Getty

కరుణ్ నాయర్ ట్వీట్ వైరల్

భారత బ్యాటింగ్ కుప్పకూలిన తర్వాత భారత క్రికెటర్ కరుణ్ నాయర్ చేసిన ఒక ట్వీట్ పెద్ద చర్చకు దారి తీసింది. అందులో.. “కొన్ని పరిస్థితులు మనసుకు సుపరిచితమైన అనుభూతి కలిగిస్తాయి… కానీ అక్కడ ఉండకపోవడం బాధను మిగులుస్తుంది” అని పేర్కొన్నాడు.

కరుణ్ ఎవరి పేరూ ప్రస్తావించకపోయినా, ఇది జట్టు ఎంపికలపై అసంతృప్తిగా, ముఖ్యంగా గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ నిర్ణయాలను పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్న ట్వీట్‌గా అభిమానులు భావిస్తున్నారు.

Some conditions carry a feel you know by heart — and the silence of not being out there adds its own sting.

— Karun Nair (@karun126) November 24, 2025

ఈ పోస్ట్ కింద రవిచంద్రన్ అశ్విన్ కూడా నవ్వు ఎమోజీ పెట్టడంతో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.

Adei😂 https://t.co/PiLMwlYoCe

— Ashwin 🇮🇳 (@ashwinravi99) November 24, 2025

Related Articles

Related image1
గంభీర్ ను సాగనంపి.. టీమిండియాను కాపాడండి మహా ప్రభో !
Related image2
స్మృతి మంధాన పెళ్లి పెటాకులేనా? వివాహ వేడుకల ఫొటోలు, వీడియోలు డిలీట్‌
35
కరుణ్ నాయర్ కెరీర్: అవకాశాలు తక్కువ, నిరీక్షణ ఎక్కువ
Image Credit : X/@ImTanujSingh

కరుణ్ నాయర్ కెరీర్: అవకాశాలు తక్కువ, నిరీక్షణ ఎక్కువ

2016లో ఇంగ్లాండ్‌పై చారిత్రక ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ తర్వాతి సంవత్సరాల్లో జట్టులో స్థిరపడలేకపోయాడు.

ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు అవకాశమొచ్చినా, 8 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 205 పరుగులు మాత్రమే చేసి తిరిగి జట్టు నుంచి డ్రాప్ అయ్యాడు.

అయితే, దేశవాళీ క్రికెట్ లో కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడుతున్నాడు. 2025/26 రంజీ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో 602 పరుగులతో సత్తా చాటాడు. 100+ సగటుతో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. ఇలాంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎందుకు పిలవలేదనే ప్రశ్న అభిమానుల్లో వస్తోంది.

45
సఫారీ జోరు.. మార్కో జాన్సెన్, హార్మర్ డబుల్ అటాక్
Image Credit : stockPhoto

సఫారీ జోరు.. మార్కో జాన్సెన్, హార్మర్ డబుల్ అటాక్

భారత్ బ్యాటింగ్‌ను మార్కో జాన్సెన్ స్పెల్ దెబ్బకొట్టింది. ఆరు వికెట్లతో భారత ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. సిమన్ హార్మర్ మూడు వికెట్లు తీసి జాన్సెన్‌కు అద్భుత సహకారం అందించాడు.

దక్షిణాఫ్రికా ఇప్పుడు 314 పరుగుల ఆధిక్యంలో ఉంది, ఇంకా రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తుండడంతో భారత్ ముందు భారీ టార్గెట్ చేరే అవకాశముంది.

55
టీమిండియా బ్యాటింగ్ సంక్షోభం.. భవిష్యత్తు ఆందోళన
Image Credit : X/BCCI

టీమిండియా బ్యాటింగ్ సంక్షోభం.. భవిష్యత్తు ఆందోళన

సీనియర్ స్టార్లు ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత టాప్ ఆర్డర్‌లో స్థిరత్వం దొరకలేదు. పంత్, రాహుల్, జడేజా వంటి సీనియర్లు కూడా అవసరమైనప్పుడు నిలబడలేకపోతున్నారు. జైస్వాల్ వంటి యంగ్ ప్లేయర్లు సెంచరీలు చేసి ప్రభావం చూపుతున్నా, మొత్తం బ్యాటింగ్ యూనిట్‌లో ఆత్మవిశ్వాసం తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, కరుణ్ నాయర్ ట్వీట్ భారత జట్టులో ప్రస్తుత అనిశ్చితిని ప్రతిబింబించినట్లుగా కనిపిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
Latest Videos
Recommended Stories
Recommended image1
గంభీర్ ను సాగనంపి.. టీమిండియాను కాపాడండి మహా ప్రభో !
Recommended image2
స్మృతి మంధాన పెళ్లి పెటాకులేనా? వివాహ వేడుకల ఫొటోలు, వీడియోలు డిలీట్‌
Recommended image3
కెరీర్ మొత్తం 6 సిక్సర్లే.. 12 డబుల్, 2 ట్రిపుల్ సెంచరీలు.. ఎవరా ప్లేయర్?
Related Stories
Recommended image1
గంభీర్ ను సాగనంపి.. టీమిండియాను కాపాడండి మహా ప్రభో !
Recommended image2
స్మృతి మంధాన పెళ్లి పెటాకులేనా? వివాహ వేడుకల ఫొటోలు, వీడియోలు డిలీట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved