MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Kapil Dev vs Sunil Gavaskar: కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ మధ్య 25 ఏళ్ల పగ.. అసలు ఏం జరిగింది?

Kapil Dev vs Sunil Gavaskar: కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ మధ్య 25 ఏళ్ల పగ.. అసలు ఏం జరిగింది?

Kapil Dev vs Sunil Gavaskar: భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ మధ్య 25 ఏళ్ల పాటు సాగిన కోల్డ్ వార్ ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్. 1983 వరల్డ్ కప్ నుంచి మొదలైన ఈ వివాదం ఎలా ముగిసింది? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 27 2026, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారత క్రికెట్ చరిత్రలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ
Image Credit : chatgpt

భారత క్రికెట్ చరిత్రలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ

అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య జరిగిన కోల్డ్ వార్ గురించి అందరికీ తెలుసు. అక్కడ ప్రత్యక్ష యుద్ధం జరగలేదు. కానీ, తామే గొప్ప అనే ఆధిపత్య పోరు సాగింది. సరిగ్గా ఇలాంటి కోల్డ్ వార్ భారత క్రికెట్‌లో కూడా జరిగింది. భారత క్రికెట్ రంగాన్ని శాసించిన ఇద్దరు గొప్ప ప్లేయర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్.

వీరిద్దరి మధ్య దాదాపు పాతికేళ్ల పాటు ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. ఒకరినొకరు ఎదురుపడి తిట్టుకోలేదు. కానీ, అవకాశం వచ్చినప్పుడు ఒకరినొకరు టీమ్ నుంచి పక్కన పెట్టేసుకున్నారు. సరిగ్గా 25 సంవత్సరాల పాటు ఈ కోల్డ్ వార్ కొనసాగింది. అయితే ప్రతి పోరాటానికి ఒక అంతం ఉంటుంది. అలాగే వీరిద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్ కూడా 25 ఏళ్ల తర్వాత ముగిసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
1983 వరల్డ్ కప్ నుంచి మొదలైన వివాదం
Image Credit : x/Om Prakash Bakoria

1983 వరల్డ్ కప్ నుంచి మొదలైన వివాదం

ఈ వివాదానికి అసలు బీజం 1983 వన్డే వరల్డ్ కప్ సమయంలో పడింది. ఆ టోర్నమెంట్‌లో భారత జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. టోర్నమెంట్ ఆరంభంలో టీమిండియా కొన్ని మ్యాచ్‌లలో ఓడిపోయింది. అదే సమయంలో దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అంచనాలను అందుకోలేకపోయారు. ఆ వరల్డ్ కప్‌లో ఆరు ఇన్నింగ్స్‌లాడిన గవాస్కర్ కేవలం 64 పరుగులు మాత్రమే చేయగలిగారు.

దేశం గర్వించదగ్గ మ్యాచ్ విన్నర్ ఇలా విఫలమవ్వడం జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెట్టింది. అప్పట్లో వెస్టిండీస్‌తో భారత్ తలపడాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు జట్టు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుంది. ఆ మీటింగ్‌లో కెప్టెన్ కపిల్ దేవ్.. గవాస్కర్ మొఖం మీదే నేరుగా మాట్లాడారు. ఇలాగైతే కుదరదని, మీరు పరుగులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కపిల్ మాటలతో గవాస్కర్ తీవ్రంగా మనస్తాపం చెందారని, హర్ట్ అయ్యారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వచ్చిన మ్యాచ్ నుంచి గవాస్కర్‌ను ప్లేయింగ్ లెవెన్ నుంచి తప్పించారు. అయితే, సీనియర్ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ గాయపడటంతో గవాస్కర్ మళ్లీ జట్టులోకి వచ్చారు. ఇక్కడి నుంచే ఇద్దరి మధ్య మనస్పర్థలు ప్రారంభమయ్యాయి.

35
గవాస్కర్ వేటు.. ఈడెన్ గార్డెన్స్‌లో రచ్చ
Image Credit : Getty

గవాస్కర్ వేటు.. ఈడెన్ గార్డెన్స్‌లో రచ్చ

తనను జట్టు నుంచి తప్పించిన అవమానాన్ని గవాస్కర్ మర్చిపోలేదు. సరిగ్గా ఏడాది తర్వాత 1984లో ఆయన దానికి రివెంజ్ తీర్చుకున్నారు. ఆ సమయంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది.

ఆ టెస్ట్ సిరీస్‌కు సునీల్ గవాస్కర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కెప్టెన్సీలోనే కపిల్ దేవ్, సందీప్ పాటిల్‌ను తుది జట్టు నుంచి డ్రాప్ చేశారు. ఈ నిర్ణయం భారత క్రికెట్‌లో పెద్ద కలకలమే రేపింది. స్టేడియంలో అభిమానులు 'నో కపిల్ - నో టెస్ట్ మ్యాచ్' అంటూ పెద్ద ఎత్తున బ్యానర్లు పట్టుకుని నిరసనకు దిగారు. ఎంత రచ్చ జరిగినా ఆ మ్యాచ్‌లో భారత జట్టే విజయం సాధించింది. అయితే, తనపై వచ్చిన విమర్శలపై గవాస్కర్ స్పందిస్తూ.. ఆ ఇద్దరినీ డ్రాప్ చేసింది తాను కాదని, సెలెక్టర్ల నిర్ణయమేనని వివరణ ఇచ్చారు.

45
పాతికేళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోని దిగ్గజాలు
Image Credit : Social Media

పాతికేళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోని దిగ్గజాలు

కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ మధ్య మనస్పర్థలు ఏ స్థాయికి వెళ్లాయంటే.. ఇద్దరూ ఏకంగా 25 సంవత్సరాల పాటు పరస్పరం మాట్లాడుకోలేదు. మైదానంలో ఎదురుపడినా ఎవరి దారి వారు చూసుకున్నారు.

ఒకరినొకరు పలకరించుకునే సాహసం కూడా చేయలేదు. భారత క్రికెట్ చరిత్రలో రెండు దిగ్గజాలు ఇలా సుదీర్ఘకాలం మాట్లాడకపోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎంతో మంది సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఇద్దరూ తమ పట్టు వీడలేదు. పదేళ్లు, ఇరవై ఏళ్లు గడిచినా వారి మధ్య ఉన్న మంచు కరగలేదు.

55
ఒక పార్టీలో ముగిసిన 25 ఏళ్ల శత్రుత్వం
Image Credit : Getty

ఒక పార్టీలో ముగిసిన 25 ఏళ్ల శత్రుత్వం

ఎట్టకేలకు ఈ సుదీర్ఘ కోల్డ్ వార్‌కు 25 ఏళ్ల తర్వాత తెరపడింది. 1983లో భారత్ తొలిసారి ప్రపంచకప్ గెలిచి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు ఆనాటి వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్ అంతా హాజరయ్యింది. అదే వేడుకకు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ కూడా వచ్చారు.

అక్కడ మిగతా ఆటగాళ్లు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు చొరవ తీసుకున్నారు. తోటి ఆటగాళ్ల సూచనతో ఇద్దరూ తమ పాత మనస్పర్థలను, శత్రుత్వాన్ని పక్కన పెట్టారు. ఆ పార్టీలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, సుదీర్ఘ మౌనానికి ముగింపు పలికారు. అలా 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs NZ: ఉతికి ఆరేస్తున్న టీమిండియా బ్యాట‌ర్లు.. జ‌స్ట్ 30 బంతుల్లోనే 100 ప‌రుగులు
Recommended image2
Triple Century in T20: టీ20లో ట్రిపుల్ సెంచరీ.. 30 సిక్సర్లు, 27 ఫోర్లతో రికార్డుల మోత మోగించిన యంగ్ ప్లేయర్
Recommended image3
PV Sindhu Luxury Home : మోడ్రన్ లుక్, ట్రెడిషనల్ టచ్ తో అచ్చం ఇంద్రభవనమే.. పీవీ సింధు ఇల్లు చూశారా?
Related Stories
Recommended image1
Triple Century in T20: టీ20లో ట్రిపుల్ సెంచరీ.. 30 సిక్సర్లు, 27 ఫోర్లతో రికార్డుల మోత మోగించిన యంగ్ ప్లేయర్
Recommended image2
Insurance: కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved