MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • PV Sindhu Luxury Home : మోడ్రన్ లుక్, ట్రెడిషనల్ టచ్ తో అచ్చం ఇంద్రభవనమే.. పీవీ సింధు ఇల్లు చూశారా?

PV Sindhu Luxury Home : మోడ్రన్ లుక్, ట్రెడిషనల్ టచ్ తో అచ్చం ఇంద్రభవనమే.. పీవీ సింధు ఇల్లు చూశారా?

ఒక మంచి ఇల్లు అంటే కేవలం లగ్జరీ ఫెసిలిటీస్ ఉండటమే కాదు అందులో ప్రశాంతత, తీపి గుర్తులు ఉండాలి. ఇంట్లో ఉండే వాళ్ల వ్యక్తిత్వం ప్రతి మూలలో కనిపించాలి. మన తెలుగమ్మాయి పీవీ సింధు బెంగళూరులో ఉంటున్న ఇల్లు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.

3 Min read
Author : Arun Kumar P
Published : Oct 26 2026, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పివి సింధు ఇంటిని చూశారా?
Image Credit : instagram/ pv sindhu

పివి సింధు ఇంటిని చూశారా?

బాలీవుడ్ డైరెక్టర్ ఫరా ఖాన్ తన యూట్యూబ్ సిరీస్ కోసం రీసెంట్ గా బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మొదటిసారి సింధు భర్తతో కలిసి నివాసం ఉంటున్న ఇంటి వీడియో బయటకు వచ్చింది. మోడ్రన్ లుక్, ట్రెడిషనల్ టచ్ తో ఈ ఇల్లు ఇంద్రభవనంలా ఉంది.

ఒలింపిక్ గేమ్స్ లో రెండుసార్లు పతకాలు సాధించి యావత్ దేశాన్ని గర్వించేలా చేసింది మన తెలుగు బ్యాడ్మింటర్ ప్లేయర్ పీవీ సింధు. ఇలా అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు ఎన్నో గర్వకారణమైన విజయాలను అందించారామె. ఇలా కేవలం ఆటతో అద్భుతాలు చేయడమే కాదు తన పర్సనల్ లైఫ్ ను కూడా ఆమె అందంగా తీర్చిదిద్దుకున్నారు.

ప్రస్తుతం పివి సింధు హైదరాబాద్ లో కాకుండా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. పెళ్లి తర్వాత భర్త వెంకట దత్త సాయితో కలిసి అక్కడే ఉంటున్నారు. వీరి వివాహం 2024 డిసెంబర్ 22న ఉదయపూర్ లో జరిగింది. మరి పివి సింధు-దత్త సాయి నివాసముంటున్న లగ్జరీ హౌస్ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సింధు ఇంట అందమైన ఇంటీరియర్
Image Credit : Instagram/ pv sindhu

సింధు ఇంట అందమైన ఇంటీరియర్

సింధు ఇంటికి వెళ్లగానే ఒక పెద్ద చెక్క తలుపు అతిథులకు స్వాగతం పలుకుతుంది. దాన్ని దాటుకుని ఇంట్లోకి అడుగుపెట్టగానే అందమైన పెయింటింగ్స్, ఇండోర్ ప్లాంట్స్, అలంకరించిన హాల్ మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంటి గోడపై బ్లాక్ అండ్ వైట్ ఫోటోల కలెక్షన్ ఉంది. సింధు బ్యాడ్మింటన్ కెరీర్ లోని ముఖ్యమైన క్షణాలతో పాటు ఆమె పెళ్లి ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్లేస్ చూస్తుంటే సింధు జీవితంలోని ముఖ్యమైన జ్ఞాపకాలను తెలిపే ఒక చిన్న మ్యూజియంలా అనిపిస్తుంది. ఇంట్లోని చిన్న చిన్న అలంకరణలు కూడా అక్కడి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాయి.

35
బోహో స్టైల్ లివింగ్ రూమ్
Image Credit : Instagram/ pv sindhu

బోహో స్టైల్ లివింగ్ రూమ్

ఇంటి హాల్ నుంచి లోపలికి వెళ్తే విశాలమైన లివింగ్ రూమ్ కనిపిస్తుంది. నేల నుంచి పైకప్పు వరకు ఉన్న పెద్ద కిటికీల ద్వారా ఇంట్లోకి న్యాచురల్ లైట్ వస్తుంది. ఈ గదిలో పాస్టెల్ కలర్స్ ప్రధాన ఆకర్షణ. లేత ఆకుపచ్చ రంగు సోఫాలు, ఎంబ్రాయిడరీ డిజైన్ ఉన్న కుషన్లు గదికి అందమైన లుక్ ఇస్తాయి. ఎక్కువ వస్తువులతో గదిని నింపేయకుండా, కొన్ని ప్రత్యేకమైన వస్తువులకే సింధు ప్రాధాన్యం ఇచ్చారు. డిఫరెంట్ డిజైన్ ఉన్న పొడవైన ల్యాంప్ గదికి వెచ్చని వెలుతురును ఇవ్వడమే కాకుండా దాని అందాన్ని మరింత పెంచుతుంది.

45
మహాభారతం థీమ్ తో చెస్ బోర్డ్
Image Credit : Instagram/ pv sindhu

మహాభారతం థీమ్ తో చెస్ బోర్డ్

సింధు ఇంట్లో ఉన్న అత్యంత ప్రత్యేకమైన వస్తువు మహాభారత కథను గుర్తుచేసే చెస్ బోర్డ్. గ్లాస్, మార్బుల్ తో డిజైన్ చేసిన ఈ చెస్ బోర్డ్ లో పాండవులు, కౌరవులను సూచించే పావులు ఉన్నాయి. రెండు అంతస్తుల డిజైన్ లో ఉన్న ఈ బోర్డ్ పై మహాభారత ఘట్టాలను చెక్కారు. మోడ్రన్ డిజైన్ తో ఉన్న ఇంట్లో ఈ ట్రెడిషనల్ ఆర్ట్ వర్క్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇంటి అలంకరణకు ఇండియన్ కల్చర్ టచ్ ఇవ్వడంతో పాటు, ఇంటికి వచ్చే అతిథుల దృష్టిని ఇది ఆకర్షిస్తుంది. ఇల్లు అంటే కేవలం అందంగా కనిపించే ప్రదేశం మాత్రమే కాదు, ఇంట్లో ఉండే వాళ్ల అభిరుచిని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ప్లేస్ అనడానికి ఈ చెస్ బోర్డ్ బెస్ట్ ఎగ్జాంపుల్.

55
చెక్క డైనింగ్ టేబుల్, మాడ్యులర్ కిచెన్
Image Credit : Instagram/ pv sindhu

చెక్క డైనింగ్ టేబుల్, మాడ్యులర్ కిచెన్

లివింగ్ రూమ్ పక్కనే డైనింగ్ ఏరియా ఉంది. ఇక్కడ డార్క్ కలర్ చెక్క డైనింగ్ టేబుల్, దానికి మ్యాచ్ అయ్యే కుర్చీలు ఉన్నాయి. కుర్చీల లేత గోధుమ రంగు కుషన్లు డార్క్ వుడ్ కలర్ కు మంచి కాంట్రాస్ట్ లుక్ ఇస్తాయి. డైనింగ్ ఏరియా పక్కనే మాడ్యులర్ కిచెన్ ఉంది. దీని కౌంటర్ పై వైట్ మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. చెక్క డిజైన్, లేత రంగుల కలయిక ఇంటిలోని ఈ భాగానికి సింపుల్, మోడ్రన్ లుక్ ను ఇస్తుంది.

స్విమ్మింగ్ పూల్ పక్కనే గార్డెన్

సింధు ఇంటికి మరో ఆకర్షణ స్విమ్మింగ్ పూల్. పచ్చని గార్డెన్. డైనింగ్ ఏరియా నుంచి పల్చటి కర్టెన్ల ద్వారా బయట ఉన్న స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ను చూడొచ్చు. దీనివల్ల ఇంట్లో కూర్చున్నా బయటి పచ్చని వాతావరణం కంటికి కనిపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ పక్కన బూడిద రంగు సోఫాలు, సెంటర్ టేబుల్ తో కూడిన రిలాక్సింగ్ ఏరియా ఉంది. ఖాళీ సమయంలో కూర్చోవడానికి లేదా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్.

ఇంట్లోని గ్లాస్, మార్బుల్, పాలిష్ చేసిన ఫర్నిచర్ మధ్య మొక్కల పచ్చదనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇండోర్, అవుట్ డోర్ మధ్య ఇది ఒక అందమైన కనెక్షన్ ను ఏర్పరుస్తుంది. మొత్తానికి పీవీ సింధు ఇల్లు మోడ్రన్ డిజైన్, ట్రెడిషనల్ ఆర్ట్, పర్సనల్ మెమరీస్, పచ్చదనం కలయికగా చెప్పొచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హర్మన్‌ప్రీత్, దీప్తి శతకాలతో భారత్ ఘన విజయం.. జింబాబ్వేపై 121 పరుగుల తేడాతో గెలుపు
Recommended image2
హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ సెంచ‌రీల‌ మోత.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం
Recommended image3
ముంబై ఇండియ‌న్స్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ప్లేయ‌ర్‌ నుంచి హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు, ఎవ‌రంటే.?
Related Stories
Recommended image1
Now Playing
PV Sindhu Visits Tirumala: భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు | Asianet News Telugu
Recommended image2
PV Sindhu: వాళ్లు నన్ను కూడా వదల్లేదు : వేధింపులపై సింధు ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved