MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • ఐపీఎల్ 2026 ముందు రింకూ సింగ్‌కు యోగి సర్కారు బంపర్ ఆఫర్

ఐపీఎల్ 2026 ముందు రింకూ సింగ్‌కు యోగి సర్కారు బంపర్ ఆఫర్

Rinku Singh : ఐపీఎల్ 2026కు ముందు రింకూ సింగ్‌కు యోగి ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ క్రీడా అధికారిగా రింకూ నియమితులయ్యారు. భారీ జీతంలో ప్రభుత్వం ఉద్యోగం వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 26 2026, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపీఎల్ 2026కు ముందే రింకూ సింగ్ రేంజ్ మారిపోయింది
Image Credit : X/@jpgautam12696

ఐపీఎల్ 2026కు ముందే రింకూ సింగ్ రేంజ్ మారిపోయింది

కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ అదృష్టం మామూలుగా లేదు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రింకూకు ఒక అద్భుతమైన కానుకను అందించింది. టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగిన రింకూ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ గా నియమించింది. క్రీడారంగంలో ఆయన సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవప్రదమైన బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

26
రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా రింకూ సింగ్ బాధ్యతలు
Image Credit : X

రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా రింకూ సింగ్ బాధ్యతలు

యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత గౌరవాలలో ఈ పోస్ట్ ఒకటి. రింకూ నియామకంపై ఆయన కోచ్ స్పందిస్తూ.. "యూపీ ప్రభుత్వం రింకూకు ఉద్యోగం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నిర్ణయం రాష్ట్రంలోని యువ క్రికెటర్లకు గొప్ప ప్రేరణనిస్తుంది. వారు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తుంది. ఆఫీసర్‌గా రింకూ క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేస్తాడని మాకు ఎన్నో అంచనాలు ఉన్నాయి" అని ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో అన్నారు.

Related Articles

Related image1
IPL లో 357 సిక్సర్లు, 6 సెంచరీలతో విధ్వంసం.. కానీ అన్ లక్కీ ప్లేయర్
Related image2
IPL లో ఫాస్టెస్ట్ సెంచరీలు కొట్టిన భారతీయులు వీరే.. నంబర్ 1 ఎవరో తెలుసా?
36
రింకూ సింగ్ జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు ఇవే
Image Credit : Getty

రింకూ సింగ్ జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు ఇవే

రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా రింకూ సింగ్ పొందే జీతభత్యాల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ హోదాలో రింకూకు నెలకు డీఏ తో కలిపి దాదాపు రూ. 80,000 వరకు జీతం లభించే అవకాశం ఉంది. దీని ప్రకారం ఏడాదికి ఆయన సుమారు రూ. 9.6 లక్షల వరకు ఆదాయం పొందుతారు. కేవలం జీతం మాత్రమే కాకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించిన అగ్రశ్రేణి క్రీడాకారులకు ఇటువంటి కీలక పోస్టులను కేటాయిస్తుంది.

46
కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్ కొత్త బాధ్యతలు
Image Credit : Getty

కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్ కొత్త బాధ్యతలు

మరోవైపు ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం రింకూ సింగ్‌పై భారీ నమ్మకాన్ని ఉంచింది. ఈ సీజన్‌కు రింకూ సింగ్‌ను కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. గత కొన్ని సీజన్లుగా కేకేఆర్ విజయాల్లో రింకూ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఫినిషర్‌గా తన ముద్ర వేసుకున్నారు. 2026 టీ20 ప్రపంచ కప్‌ విజేతగా నిలిచిన భారత జట్టులో కూడా రింకూ సింగ్ సభ్యుడిగా ఉండటం విశేషం.

56
రింకూ సింగ్ కు భారీ ఆదాయం
Image Credit : PTI

రింకూ సింగ్ కు భారీ ఆదాయం

క్రికెట్ ద్వారా రింకూ సింగ్ సంపాదన ప్రస్తుతం పెద్దమొత్తంలోనే ఉంది. ఐపీఎల్ 2026 రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ రింకూను రూ. 13 కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకుంది. దీంతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్ట్‌లో రింకూ సింగ్ గ్రేడ్-సి విభాగంలో ఉన్నారు. దీని ద్వారా ఆయన ఏడాదికి రూ. 1 కోటి కాంట్రాక్ట్ ఫీజును అందుకుంటున్నారు. ఇప్పుడు యూపీ ప్రభుత్వ ఉద్యోగంతో ఆయన ఆదాయానికి మరింత భద్రత లభించినట్లయింది.

66
యువతకు స్ఫూర్తిగా రింకూ
Image Credit : ANI

యువతకు స్ఫూర్తిగా రింకూ

సామాన్య కుటుంబం నుండి వచ్చి, చాలా కష్టపడి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన రింకూ సింగ్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. గల్లీ క్రికెట్ నుండి ఐపీఎల్ స్టార్‌గా, ఇప్పుడు ప్రభుత్వ అధికారిగా ఆయన సాధించిన ప్రగతి అమోఘం. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ఇటు కేకేఆర్ వైస్ కెప్టెన్సీ, అటు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో రింకూ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. రాబోయే సీజన్‌లో రింకూ తన బ్యాట్‌తో మరిన్ని సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 : ఇద్దరు టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లకే ఇప్పుడతడు కెప్టెన్.. ఇంతటి తోపు ఎవరో తెలుసా..?
Recommended image2
IPL 2026: అయ్యబాబోయ్.. ముంబై.! టీమిండియా తోపులందరూ జట్టులోనే.. ఆరో కప్పు లోడింగ్.?
Recommended image3
IPL 2026: డాడీస్ జట్టులోకి పోటుగాడు వచ్చాడోచ్.. ఈసారి చెన్నై ఛాంపియన్‌గా నిలుస్తుందా.?
Related Stories
Recommended image1
IPL లో 357 సిక్సర్లు, 6 సెంచరీలతో విధ్వంసం.. కానీ అన్ లక్కీ ప్లేయర్
Recommended image2
IPL లో ఫాస్టెస్ట్ సెంచరీలు కొట్టిన భారతీయులు వీరే.. నంబర్ 1 ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved