MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL 2026: సర్పంచ్ సాబ్ 'పవర్‌ఫుల్ పంజాబ్'.. రాసిపెట్టుకో..! ఈ ఇయర్ అయ్యర్‌దే

IPL 2026: సర్పంచ్ సాబ్ 'పవర్‌ఫుల్ పంజాబ్'.. రాసిపెట్టుకో..! ఈ ఇయర్ అయ్యర్‌దే

IPL 2026: గత ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్. ఈసారి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. జట్టు బలాబలాలు, కీలక ఆటగాళ్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 25 2026, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ 2026 పంజాబ్ కింగ్స్ అనాలిసిస్
Image Credit : Pinterest

ఐపీఎల్ 2026 పంజాబ్ కింగ్స్ అనాలిసిస్

ఐపీఎల్ చరిత్రలో అత్యంత అండర్ పెర్ఫార్మింగ్ టీమ్‌గా పేరున్న పంజాబ్ కింగ్స్, గత ఏడాది శ్రేయస్ అయ్యర్ రాకతో తన రూపురేఖలను మార్చుకుంది. 2025 సీజన్‌లో కేవలం 6 పరుగుల తేడాతో టైటిల్‌ను చేజార్చుకున్న పంజాబ్, ఈసారి మరింత కసితో సిద్ధమైంది.

25
జట్టు కూర్పు, బలాలు:
Image Credit : Pinterest

జట్టు కూర్పు, బలాలు:

పంజాబ్ కింగ్స్ ఈసారి పెద్దగా మార్పులు చేయకుండా గత ఏడాది విజయవంతమైన కోర్ టీమ్‌నే కొనసాగిస్తోంది.

స్ట్రాంగ్ ఇండియన్ కోర్: ప్రభు సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, నిహాల్ వడేరా, శశాంక్ సింగ్‌లతో కూడిన భారతీయ బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది.

ఆల్ రౌండర్ల లిస్ట్: మార్కో యాన్సన్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్ లాంటి అంతర్జాతీయ స్టార్లతో పాటు ముషీర్ ఖాన్ లాంటి యువ ఆటగాళ్లు జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నారు.

బౌలింగ్ అటాక్: అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్ వంటి అనుభవం ఉన్న బౌలర్లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.

Related Articles

Related image1
RCB : టాటా కాదు.. అంబానీ కాదు.. ఆర్సీబీని కొన్నది ఎవరు? IPL హిస్టరీలోనే భారీ డీల్
Related image2
IPL 2026: ఐపీఎల్‌లో కొత్త రూల్.. ఇదే జరిగితే ఇక ఫైన్‌తో పాటు నిషేధం కూడా..
35
ఎక్స్-ఫ్యాక్టర్ - శ్రేయస్ అయ్యర్
Image Credit : Getty

ఎక్స్-ఫ్యాక్టర్ - శ్రేయస్ అయ్యర్

ఈ టీమ్‌కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అతిపెద్ద ఎక్స్-ఫ్యాక్టర్. ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ జట్లను విజయవంతంగా నడిపించిన అనుభవం అతనికి ఉంది. పంజాబ్‌ను తన మొదటి సీజన్‌లోనే ఫైనల్ దాకా తీసుకెళ్లిన శ్రేయస్, ఈసారి బ్యాటింగ్‌లోనూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ తరహాలో ఒక ఎండ్‌లో నిలబడి ఇన్నింగ్స్‌ను నిర్మించగలిగితే పంజాబ్ విజయావకాశాలు మెరుగుపడతాయి .

45
లోపాలు:
Image Credit : ANI

లోపాలు:

జట్టులో అనుభవం ఉన్న వికెట్ కీపర్లు తక్కువగా ఉన్నారు. కేవలం ప్రభు సిమ్రాన్, విష్ణు వినోద్ మాత్రమే అందుబాటులో ఉన్నారు . ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ లేని అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ సంఖ్య జట్టులో ఎక్కువగా ఉండటం కొంత ఆందోళన కలిగించే అంశం.

55
తన చిరకాల కల..
Image Credit : ANI

తన చిరకాల కల..

రికీ పాంటింగ్ లాంటి దిగ్గజ కోచ్ మార్గదర్శకత్వంలో, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈసారి కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలుస్తున్న పంజాబ్, తన చిరకాల కల అయిన ఐపీఎల్ ట్రోఫీని ఈసారి అందుకుంటుందో లేదో చూడాలి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026: ఐపీఎల్‌లో కొత్త రూల్.. ఇదే జరిగితే ఇక ఫైన్‌తో పాటు నిషేధం కూడా..
Recommended image2
RCB : టాటా కాదు.. అంబానీ కాదు.. ఆర్సీబీని కొన్నది ఎవరు? IPL హిస్టరీలోనే భారీ డీల్
Recommended image3
IPL షాకింగ్: ఆర్సీబీ కంటే ముందే రికార్డు కొట్టిన రాజస్థాన్ రాయల్స్.. ఏకంగా వేల కోట్లకు అమ్మకం!
Related Stories
Recommended image1
RCB : టాటా కాదు.. అంబానీ కాదు.. ఆర్సీబీని కొన్నది ఎవరు? IPL హిస్టరీలోనే భారీ డీల్
Recommended image2
IPL 2026: ఐపీఎల్‌లో కొత్త రూల్.. ఇదే జరిగితే ఇక ఫైన్‌తో పాటు నిషేధం కూడా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved