MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • IPL 2026: ఐపీఎల్‌లో కొత్త రూల్.. ఇదే జరిగితే ఇక ఫైన్‌తో పాటు నిషేధం కూడా..

IPL 2026: ఐపీఎల్‌లో కొత్త రూల్.. ఇదే జరిగితే ఇక ఫైన్‌తో పాటు నిషేధం కూడా..

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ కోసం బీసీసీఐ రెండు కీలకమైన కొత్త నిబంధనలను ప్రకటించింది. మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో డ్రెస్ కోడ్ పాటించని ఆటగాళ్లపై భారీ జరిమానాలతో పాటు మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 25 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ 2026 కొత్త రూల్స్
Image Credit : IPL Twitter

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఆటగాళ్ల క్రమశిక్షణ, మ్యాచ్ నిర్వహణకు సంబంధించి రెండు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ నియమాలను ఉల్లంఘించే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మ్యాచ్ రోజు ప్రాక్టీస్‌పై పరిమితులు
Image Credit : X/IPL

మ్యాచ్ రోజు ప్రాక్టీస్‌పై పరిమితులు

కొత్త నిబంధనల ప్రకారం, మ్యాచ్ జరిగే రోజున పిచ్ సిద్ధం చేసిన తర్వాత ఏ జట్టు కూడా మైదానంలో ప్రాక్టీస్ చేయడానికి అనుమతి ఉండదు. మ్యాచ్‌కు ముందు గ్రౌండ్‌లో ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించకూడదని బీసీసీఐ స్పష్టం చేసింది.

35
ప్రజెంటేషన్ సెరిమనీలో డ్రెస్ కోడ్
Image Credit : IPL Twitter

ప్రజెంటేషన్ సెరిమనీలో డ్రెస్ కోడ్

మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆటగాళ్లు స్లీవ్‌లెస్ చొక్కాలు, నిక్కర్లు లేదా స్లిప్పర్లు వేసుకుని రావడంపై బీసీసీఐ నిషేధం విధించింది. 

45
వేసవి తాపం కారణంగా..
Image Credit : IPL Twitter

వేసవి తాపం కారణంగా..

వేసవి తాపం కారణంగా చాలా మంది ప్లేయర్లు మ్యాచ్ ముగిశాక తమ జెర్సీలను మార్చుకుని సౌకర్యవంతంగా ఉండే స్లీవ్‌లెస్ దుస్తుల్లో అవార్డుల కార్యక్రమానికి వస్తుంటారు. అయితే, ఇది క్రీడను, అతిథులను కించపరిచినట్లుగా భావించిన బీసీసీఐ, ఇకపై ఆటగాళ్లు ప్రాపర్ డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశించింది.

55
 శిక్షలు, జరిమానాలు
Image Credit : IPL Twitter

శిక్షలు, జరిమానాలు

ఈ నిబంధనలను ఉల్లంఘించే ఆటగాళ్లకు బిసిసిఐ కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

మొదటి సారి: ఆటగాడికి అధికారికంగా వార్నింగ్ ఇస్తారు.

రెండవ సారి: అదే తప్పు మళ్ళీ చేస్తే, సదరు ఆటగాడి మ్యాచ్ ఫీజులో భారీగా కోత విధిస్తారు.

పదే పదే ఉల్లంఘిస్తే: పెనాల్టీ మొత్తాన్ని రెట్టింపు చేయడమే కాకుండా, ఒక మ్యాచ్ పాటు నిషేధం విధించే అధికారం కూడా బీసీసీఐకి ఉంటుంది.

క్రికెట్ గౌరవాన్ని కాపాడటంతో పాటు, అవార్డులు ఇచ్చేందుకు వచ్చే ముఖ్య అతిథులకు తగిన గౌరవం ఇచ్చే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
RCB : టాటా కాదు.. అంబానీ కాదు.. ఆర్సీబీని కొన్నది ఎవరు? IPL హిస్టరీలోనే భారీ డీల్
Recommended image2
IPL షాకింగ్: ఆర్సీబీ కంటే ముందే రికార్డు కొట్టిన రాజస్థాన్ రాయల్స్.. ఏకంగా వేల కోట్లకు అమ్మకం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved