MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • IPL : కోహ్లీ కాదు.. చిన్నస్వామికి కొత్త కింగ్ వచ్చేశాడు..!

IPL : కోహ్లీ కాదు.. చిన్నస్వామికి కొత్త కింగ్ వచ్చేశాడు..!

ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు, లక్నో జట్లు తలపడనున్నాయి. అయితే ఇప్పుడు అందరి కళ్లూ కోహ్లీపైనే కాదు మరికొన్ని పరుగులు చేస్తే నంబర్-1 అయ్యే ఆటగాడిపైనా ఉన్నాయి. ఆ ఆటగాడు ఎవరు.. అతడెందుకు నెంబర్1 అవుతాడో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 15 2026, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చిన్నస్వామి కింగ్ ఎవరు..?
Image Credit : Twitter/Royal Challengers Bengaluru

చిన్నస్వామి కింగ్ ఎవరు..?

ఈరోజు ఐపీఎల్ మ్యాచ్‌లో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే కాదు, మరో ఆటగాడిపై కూడా ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఆర్సిబి కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 195 పరుగులు చేసి, టాప్ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈరోజు మరో 30 పరుగులు చేస్తే, అతను ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకుంటాడు. అలా జరిగితే హెన్రిక్ క్లాసెన్‌ను వెనక్కి నెట్టి ఐపీఎల్ 2026లో కొత్త 'కింగ్' అవుతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కోహ్లీ ఆడతాడా..?
Image Credit : ANI

కోహ్లీ ఆడతాడా..?

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై అభిమానుల్లో పెద్ద టెన్షన్ నడుస్తోంది. గత మ్యాచ్‌లో చీలమండ గాయం కారణంగా అతను ఫీల్డింగ్‌కు రాలేదు. ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ ఎడమ మోకాలికి కట్టు (బ్యాండేజ్) కట్టుకుని కనిపించాడు. అతను సరదా మూడ్‌లో రిషబ్ పంత్, కేన్ విలియమ్సన్‌లతో కబుర్లు చెబుతున్నప్పటికీ, అతను ఆడతాడా లేదా అనే విషయంపై సాయంత్రం 7 గంటలకు టాస్ సమయంలోనే క్లారిటీ వస్తుంది.

36
లక్నోపై ఆర్సిబిదే పైచేయి..
Image Credit : ANI

లక్నోపై ఆర్సిబిదే పైచేయి..

ఆర్సిబి, లక్నో మధ్య ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు జరిగాయి. అందులో 4 బెంగళూరు గెలిచింది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. లక్నో గెలిచిన రెండు మ్యాచ్‌లు కూడా బెంగళూరు సొంతగడ్డ చిన్నస్వామిలోనే జరిగాయి. అంటే ఆర్సిబి తమ హోమ్‌గ్రౌండ్‌లో ఇప్పటివరకు లక్నోను ఓడించలేకపోయింది. మరి ఈరోజు ఆ చెత్త రికార్డును డిపెండింగ్ ఛాంపియన్ బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.

46
ఆర్సిబి గెలిస్తే టాప్ లోకి..
Image Credit : Twitter

ఆర్సిబి గెలిస్తే టాప్ లోకి..

బెంగళూరు జట్టు ఈ ఐపిఎల్ లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లలో 3 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈరోజు పాటిదార్ సేన గెలిస్తే వారికి 8 పాయింట్లు వస్తాయి. మెరుగైన రన్ రేట్ కారణంగా రాజస్థాన్ రాయల్స్‌ను వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో నంబర్-1 స్థానానికి చేరుకుంటారు. పాటిదార్, కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఫామ్‌లో ఉండటం ఆర్సిబికి కలిసొచ్చే అంశం. జాకబ్ డఫీ బౌలింగ్ కూడా ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతోంది. అయితే కోహ్లీ గాయం, సొంతగడ్డపై లక్నోతో ఉన్న పేలవ రికార్డు ఆందోళన కలిగిస్తున్నాయి.

56
ఈ మ్యాచ్ లో బౌండరీల వర్షమే...
Image Credit : X

ఈ మ్యాచ్ లో బౌండరీల వర్షమే...

చిన్నస్వామి పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంటుంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన ప్రతి ఇన్నింగ్స్‌లో 200కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఈరోజు కూడా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. సాయంత్రం మంచు (Dew) కురిసే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవచ్చు.

66
RCB vs LSG : ఇరు జట్ల అంచనా ప్లేయింగ్ XI
Image Credit : Twitter

RCB vs LSG : ఇరు జట్ల అంచనా ప్లేయింగ్ XI

RCB Team : ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (C), జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.

LSG Team: ఐడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (C), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, దిగ్వేశ్ రాఠీ, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, అవేష్ ఖాన్, జార్జ్ లిండే.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
బెంగళూరు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image2
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image3
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Related Stories
Recommended image1
Now Playing
IPL నుండి రోహిత్ శర్మ ఔట్...?ఆ గాయం అంత సీరియసా..? Rohit Sharma Injured in IPL 2026 | Asianet Telugu
Recommended image2
IPL 2026 : వరుస ఓటములు.. ముంబై ఇండియన్స్‌కు ఏమైంది? అసలు కారణాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved