MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • IPL 2026: గెలవాల్సిన మ్యాచ్.! అంతా అయిపోయిందనుకునేసరికి తప్పు జరిగింది.. ఢిల్లీ కెప్టెన్

IPL 2026: గెలవాల్సిన మ్యాచ్.! అంతా అయిపోయిందనుకునేసరికి తప్పు జరిగింది.. ఢిల్లీ కెప్టెన్

IPL 2026: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఒక్క పరుగు తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టులో కేఎల్ రాహుల్ 92 పరుగులతో మెరిసినప్పటికీ.. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 09 2026, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఢిల్లీని ఊరించిన విజయం
Image Credit : Pinterest

ఢిల్లీని ఊరించిన విజయం

ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో ఉత్కంఠభరిత పోరు క్రికెట్ అభిమానులను అలరించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి బంతి వరకు విజయం ఎటువైపు మొగ్గుతుందో తెలియని పరిస్థితుల్లో, గుజరాత్ టైటాన్స్ జట్టు ఒక్క పరుగు తేడాతో విజేతగా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లక్ష్య చేదనలో ఢిల్లీ పోరాటం
Image Credit : Getty

లక్ష్య చేదనలో ఢిల్లీ పోరాటం

గుజరాత్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, పతుమ్ నిశాంక అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. రాహుల్ 92 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడగా, నిశాంక 41 పరుగులు చేశాడు. అయితే, జట్టు స్కోరు 100 దాటిన తర్వాత మిడిల్ ఆర్డర్ తడబడటంతో ఢిల్లీ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇది మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.

Related Articles

Related image1
IPL 2026: ఐపీఎల్ వల్లే నా కెరీర్ నాశనమైంది.. ఢిల్లీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..
Related image2
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు చేరే టాప్ 4 జట్లు ఇవే.! CSK, KKR, SRHలకు గట్టి షాక్..
35
మిల్లర్ ఒంటరి పోరాటం
Image Credit : Pinterest

మిల్లర్ ఒంటరి పోరాటం

చేతికి గాయమైనప్పటికీ డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చి ధనాధన్ షాట్లతో ఢిల్లీని విజయానికి చేరువ చేశాడు. చివరి ఓవర్‌లో ప్రసిద్ధ్ కృష్ణ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సమీకరణం చివరి బంతికి రెండు పరుగులుగా మారింది.

45
బట్లర్ మ్యాజిక్
Image Credit : Getty

బట్లర్ మ్యాజిక్

ఆ బంతికి మిల్లర్ షాట్ ఆడలేకపోయినా, పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అత్యంత వేగంగా స్పందించి బంతిని నేరుగా వికెట్లకు కొట్టడంతో కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. దీంతో గుజరాత్ ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది.

55
ఓటమిపై అక్షర్ పటేల్ స్పందన:
Image Credit : ANI

ఓటమిపై అక్షర్ పటేల్ స్పందన:

మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ తమ ఓటమిపై ఆవేదన వ్యక్తం చేశాడు. మిడిల్ ఓవర్లలో(9వ ఓవర్ నుంచి) వరుసగా వికెట్లు కోల్పోవడం వల్లనే ఒత్తిడి పెరిగిందని, లేదంటే ఈ మ్యాచ్‌ను ముందే ముగించే అవకాశం ఉండేదని అన్నాడు. కేఎల్ రాహుల్, మిల్లర్ ప్రదర్శనను అభినందించాడు. చివరి బంతుల్లో ఎప్పుడూ ఫలితం మనకు అనుకూలంగా ఉండదని, తెలివిగా ఆడి ఉండాల్సిందని అక్షర్ పేర్కొన్నాడు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
IPL 2026: ఐపీఎల్ వల్లే నా కెరీర్ నాశనమైంది.. ఢిల్లీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..
Recommended image2
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు చేరే టాప్ 4 జట్లు ఇవే.! CSK, KKR, SRHలకు గట్టి షాక్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved