MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • IND vs SA తొలి వన్డే: రాంచీ పిచ్ రిపోర్టు ఇదే.. కోహ్లీ, రోహిత్ పైనే ఫోకస్

IND vs SA తొలి వన్డే: రాంచీ పిచ్ రిపోర్టు ఇదే.. కోహ్లీ, రోహిత్ పైనే ఫోకస్

Ranchi Pitch Report : భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డేకు రాంచీలోని JSCA స్టేడియం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ పిచ్ సాధారణంగా నెమ్మదిగా ఉండి, తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌కు ఛాన్స్ ఉంది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 29 2025, 11:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇండియా vs సౌతాఫ్రికా: తొలి వన్డేకు రాంచీ సిద్ధం
Image Credit : Getty

ఇండియా vs సౌతాఫ్రికా: తొలి వన్డేకు రాంచీ సిద్ధం

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్ కోసం రాంచీలోని JSCA స్టేడియం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తాజాగా ముగిసిన టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా చేతిలో 2-0 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా, ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్‌లో పటిష్టమైన ఆరంభాన్ని ఇవ్వాలని చూస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కేఎల్ రాహుల్ కెప్టెన్సీ లో భారత్
Image Credit : Getty

కేఎల్ రాహుల్ కెప్టెన్సీ లో భారత్

రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. దీంతో కేఎల్ రాహుల్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. గిల్ కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో గాయపడి, గువాహటిలో జరిగిన రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. అలాగే, ఆస్ట్రేలియా సిరీస్‌లో గాయపడిన వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు.

అయితే, భారత జట్టుకు భారీ ఊరటనిచ్చే విషయం ఏంటంటే, దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వీళ్లిద్దరూ ఆడనున్న తొలి వన్డే సిరీస్ ఇదే. ఈ ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. దీంతో వారి దృష్టి అంతా 2027 వన్డే వరల్డ్ కప్ పైనే ఉంది. రాబోయే వన్డే సిరీస్‌లలో మంచి ప్రదర్శన చేసి ప్రపంచకప్‌లో తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు.

Related Articles

Related image1
ఐపీఎల్ కు ఆర్సీబీ మాజీ స్టార్ ప్లేయర్ వీడ్కోలు.. పాకిస్తానే కారణం
Related image2
రిషబ్ పంత్ రీఎంట్రీ ఉంటుందా? కేఎల్ రాహుల్ బిగ్ స్టేట్‌మెంట్
36
రాంచీ JSCA పిచ్ రిపోర్ట్ : బ్యాటింగా? బౌలింగా? పిచ్ ఎలా ఉండనుంది?
Image Credit : Getty

రాంచీ JSCA పిచ్ రిపోర్ట్ : బ్యాటింగా? బౌలింగా? పిచ్ ఎలా ఉండనుంది?

రాంచీలోని JSCA అంతర్జాతీయ స్టేడియం పిచ్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుందని చెబుతారు. అంటే ఇక్కడ హై-స్కోరింగ్ గేమ్స్ చూసే అవకాశం తక్కువగా ఉంది. ఈ మైదానంలో పరుగుల వర్షం కురుస్తుందా లేక బౌలర్లు వికెట్ల పండుగ చేసుకుంటారా అనే చర్చ సాగుతోంది. అయితే, పిచ్ రికార్డులు గమనిస్తే, రాంచీ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 235గా ఉంది. అంటే లో స్కోరింగ్ మ్యాచ్ ను ఇక్కడ చూడవచ్చు.

అంటే బ్యాట్, బంతి మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఆరంభంలో పిచ్ పేస్, బౌన్స్ అందించడం ద్వారా ఫాస్ట్ బౌలర్లకు కొద్దిగా అనుకూలిస్తుంది. కొత్త బంతితో బ్యాట్స్‌మెన్‌లు కూడా పరుగులు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ, మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ, స్పిన్ బౌలర్లు కీలక పాత్ర పోషిస్తారు. స్పిన్నర్లకు ఈ పిచ్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని అంచనా.

46
టాస్, ఛేజింగ్ రికార్డులు ఎలా ఉన్నాయి?
Image Credit : Getty

టాస్, ఛేజింగ్ రికార్డులు ఎలా ఉన్నాయి?

రాంచీ మైదానంలో టాస్ కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడ జరిగిన అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల రికార్డులను పరిశీలిస్తే, ఛేజింగ్ చేసిన జట్లు ఎక్కువ విజయాలు సాధించాయి. JSCA స్టేడియంలో ఇప్పటివరకు 9 వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 5 మ్యాచ్‌లు గెలిచాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దు అయింది.

సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 235 రన్సే అయినప్పటికీ, ఛేజ్ చేయడం ఇక్కడ సులువుగా ఉంటోంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 2 మ్యాచ్‌లు గెలిస్తే, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు 3 మ్యాచ్‌లు గెలిచాయి. టాస్ గెలిచిన జట్టు కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అధికంగా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కూడా వుండే అవకాశం ఉంది. మంచు వల్ల బంతి తడిగా మారి, బౌలింగ్‌కు కష్టంగా మారుతుంది. ఇది ఛేజింగ్ చేసే బ్యాట్స్‌మెన్‌లకు బాగా ఉపయోగపడుతుంది.

56
రాంచీ వాతావరణం అంచనా: వర్షం పడనుందా?
Image Credit : Getty

రాంచీ వాతావరణం అంచనా: వర్షం పడనుందా?

ఉత్తర భారతదేశంలో చలికాలం మొదలైంది. రాంచీలో కూడా వాతావరణం మార్పులు కనిస్తున్నాయి. మ్యాచ్ జరిగే ఆదివారం రోజు కనీస ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పగటిపూట వాతావరణం వెచ్చగా ఉండి, సాయంత్రం వేళ చల్లగా మారనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం పడే అవకాశం దాదాపు లేదు. గంటకు 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీనితో క్రికెట్ అభిమానులు ఎటువంటి అంతరాయం లేకుండా మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు.

66
రోహిత్-కోహ్లీ గణాంకాలు ఎలా ఉన్నాయి?
Image Credit : X/BCCI

రోహిత్-కోహ్లీ గణాంకాలు ఎలా ఉన్నాయి?

ఈ మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో అందరి దృష్టి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పైనే ఉంది. సౌతాఫ్రికా పై ఈ ఇద్దరి ప్రదర్శన అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా పై 31 వన్డే మ్యాచ్‌లలో 65.39 సగటుతో 1,504 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ సౌతాఫ్రికా పై 26 వన్డే మ్యాచ్‌లలో 33.58 సగటుతో 806 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

భారత్, సౌతాఫ్రికాల మధ్య ఇప్పటివరకు 94 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో సౌతాఫ్రికా 51 మ్యాచ్‌లు గెలిచింది. భారత్ 40 మ్యాచ్‌లలో విజయం సాధించింది.

భారత్ vs సౌతాఫ్రికా వన్డే సిరీస్ జట్లు

భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్.

సౌతాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, డెవాల్డ్ బ్రెవిస్, నాండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, మార్కో జాన్సెన్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, ఒట్నీల్ బార్ట్‌మాన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, కేశవ్ మహారాజ్, లుంగీ ఎన్గిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలాన్ సుబ్రాయన్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రికెట్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
ఐపీఎల్ కు ఆర్సీబీ మాజీ స్టార్ ప్లేయర్ వీడ్కోలు.. పాకిస్తానే కారణం
Recommended image2
రిషబ్ పంత్ రీఎంట్రీ ఉంటుందా? కేఎల్ రాహుల్ బిగ్ స్టేట్‌మెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved