MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • T20 World Cup : టీమిండియా సూపర్ ఎంట్రీ.. పాయింట్ల పట్టికలో టాప్.. తర్వాతి మ్యాచ్ లు ఇవే

T20 World Cup : టీమిండియా సూపర్ ఎంట్రీ.. పాయింట్ల పట్టికలో టాప్.. తర్వాతి మ్యాచ్ లు ఇవే

T20 World Cup 2026: కోలంబోలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించి సూపర్ 8కు చేరింది. పాక్ ఓటమితో అమెరికా కంటే వెనుకబడి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 16 2026, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సూపర్ 8 రేసులో దూసుకుపోయిన భారత్.. పాక్‌కు తప్పని తిప్పలు
Image Credit : ANI

సూపర్-8 రేసులో దూసుకుపోయిన భారత్.. పాక్‌కు తప్పని తిప్పలు

కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన హై-వోల్టేజ్ పోరులో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసి, టీ20 వరల్డ్ కప్ 2026లో అధికారికంగా సూపర్-8 దశకు చేరుకుంది. ఈ టోర్నీలో వరుసగా మూడు విజయాలు నమోదు చేసిన టీమిండియా.. ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. మరోవైపు, ఈ ఓటమి పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం పాక్ జట్టు గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అమెరికా కంటే వెనుకబడి మూడో స్థానానికి పడిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
భారత్ విజయకేతనం.. గ్రూప్ ఏ టాప్
Image Credit : ANI

భారత్ విజయకేతనం.. గ్రూప్ ఏ టాప్

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో రాణించిన భారత్, అనంతరం బౌలింగ్‌లో పాక్ బ్యాటర్లను కట్టడి చేసి భారీ విజయాన్ని అందుకుంది. 3 మ్యాచుల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించిన భారత్, +3.05 నెట్ రన్ రేట్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజయంతో టీమ్ ఇండియా నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుంది. భారత్ కంటే ముందు సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇప్పటికే సూపర్-8కు చేరుకున్నాయి.

Related Articles

Related image1
IND vs PAK : పాకిస్థాన్‌ను పాతాళానికి తొక్కిన భారత్.. గెలుపు వీరులు వీరే
Related image2
India vs Pakistan: ఇషాన్ కిషన్ విధ్వంసం.. లెజెండరీల 5 రికార్డులు బ్రేక్
37
పాకిస్థాన్ సమీకరణాలు: గెలిస్తేనే ముందడుగు
Image Credit : ANI

పాకిస్థాన్ సమీకరణాలు: గెలిస్తేనే ముందడుగు

పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు చావో రేవో అన్నట్లుగా మారింది. గ్రూప్-ఏలో అమెరికా 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌కు కూడా 4 పాయింట్లే ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ విషయంలో అమెరికా (+0.787) మెరుగ్గా ఉంది. పాక్ రన్ రేట్ ప్రస్తుతం -0.403గా ఉంది. అమెరికా తన లీగ్ మ్యాచులన్నీ పూర్తి చేసుకుంది. ఇప్పుడు పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 18న నమీబియాతో తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో పాక్ ఓడిపోతే టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ఒకవేళ గెలిచినా, మెరుగైన రన్ రేట్ సాధించడం వారికి అనివార్యం.

47
సూపర్-8కు చేరిన వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా
Image Credit : ANI

సూపర్-8కు చేరిన వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా

టోర్నీలో మిగతా గ్రూపుల పరిస్థితి చూస్తే, గ్రూప్-సి నుండి వెస్టిండీస్ సూపర్-8కు అర్హత సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా విండీస్ ఈ ఘనత సాధించింది. అంతకుముందు శనివారం న్యూజిలాండ్‌ను ఓడించిన సౌత్ ఆఫ్రికా, గ్రూప్-డి నుండి వరుసగా మూడు విజయాలతో సూపర్-8 బెర్తును ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.

57
గ్రూప్-బి లో నెలకొన్న ఉత్కంఠ
Image Credit : ANI

గ్రూప్-బి లో నెలకొన్న ఉత్కంఠ

గ్రూప్-బి లో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో అనూహ్యంగా ఓడిపోవడం ఈ గ్రూపును ఓపెన్ చేసింది. ప్రస్తుతం శ్రీలంక 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, జింబాబ్వే కూడా సమాన పాయింట్లతో గట్టి పోటీ ఇస్తోంది. ఆస్ట్రేలియా ఒక్క విజయం మాత్రమే సాధించి మూడో స్థానంలో ఉండటంతో, వారి తదుపరి మ్యాచులు అత్యంత కీలకం కానున్నాయి. సహ ఆతిథ్య జట్టు శ్రీలంకకు ఇది సానుకూల అంశంగా మారింది.

67
గ్రూప్-డి లో వెనుకంజలో ఆఫ్ఘనిస్థాన్
Image Credit : AFP

గ్రూప్-డి లో వెనుకంజలో ఆఫ్ఘనిస్థాన్

మరోవైపు గ్రూప్-డి లో 2024 సెమీఫైనలిస్ట్ ఆఫ్ఘనిస్థాన్‌కు నిరాశ ఎదురైంది. వరుసగా న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోవడంతో ఆఫ్ఘన్ జట్టు సూపర్-8 రేసు నుండి అధికారికంగా నిష్క్రమించింది. సౌత్ ఆఫ్రికా ఈ గ్రూప్ నుండి అగ్రస్థానంలో నిలవగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. మొత్తానికి 20 జట్ల ఈ ప్రపంచకప్‌లో తొలి రౌండ్ ముగిసే సమయానికి మరిన్ని ఆసక్తికర పోరులు జరగనున్నాయి.

77
పాయింట్ల పట్టిక వివరాలు.. భారత్ సూపర్ 8లో ఎవరితో తలపడనుంది?
Image Credit : Getty

పాయింట్ల పట్టిక వివరాలు.. భారత్ సూపర్ 8లో ఎవరితో తలపడనుంది?

గ్రూప్ ఏ పాయింట్ల పట్టిక

1. భారత్ (Q): 3 మ్యాచ్‌లు, 6 పాయింట్లు, రన్ రేట్: 3.05

2. అమెరికా: 4 మ్యాచ్‌లు, 4 పాయింట్లు, రన్ రేట్: +0.787

3. పాకిస్థాన్: 3 మ్యాచ్‌లు, 4 పాయింట్లు, రన్ రేట్: -0.403

టీ20 వరల్డ్ కప్ 2026 నిబంధనల ప్రకారం, సూపర్-8 దశలో జట్లను ముందుగానే నిర్ణయించిన సీడింగ్ ఆధారంగా రెండు గ్రూపులుగా విభజించారు. పాకిస్థాన్‌పై గెలిచి గ్రూప్-ఏ నుండి సూపర్-8కు అర్హత సాధించిన భారత్ (X1 సీడింగ్), గ్రూప్-1లో ఉంటుంది.

ఈ గ్రూపులో భారత్ తలపడబోయే ప్రత్యర్థుల వివరాలు గమనిస్తే..

గ్రూప్-1లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లు ఉండే అవకాశం ఉంది. అంటే ఈ కింది జట్లు భారత్ తో తలపడే అవకాశం ఉంది..

1. సౌతాఫ్రికా (X4)

2. ఆస్ట్రేలియా (X2)

3. వెస్టిండీస్ (X3)

4. ఒకవేళ సీడింగ్ పొందిన జట్లు (ఉదాహరణకు ఆస్ట్రేలియా) సూపర్-8కు క్వాలిఫై అవ్వకపోతే, వారి స్థానంలో ఆ గ్రూప్ నుండి క్వాలిఫై అయిన మరో జట్టు (ఉదాహరణకు జింబాబ్వే) భారత్‌తో తలపడుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
IND vs PAK : పాకిస్థాన్‌ను పాతాళానికి తొక్కిన భారత్.. గెలుపు వీరులు వీరే
Recommended image2
India vs Pakistan: ఇషాన్ కిషన్ విధ్వంసం.. లెజెండరీల 5 రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved