MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Sanju Samson : ఖేల్ ఖతం దుకాణం బంద్.. ఏషియన్ గేమ్స్ 2026 నుండి సంజూ శాంసన్ ఔట్

Sanju Samson : ఖేల్ ఖతం దుకాణం బంద్.. ఏషియన్ గేమ్స్ 2026 నుండి సంజూ శాంసన్ ఔట్

Asian Games 2026 : టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్ కెరీర్ ఇక ముగిసినట్లేనా..? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ పండితులు. ఇక అతడు టీమిండియాలో ఆడే అవకాశాలు తక్కువేనట. ఇలా ఎందుకు అంటున్నారో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 21 2026, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంజూ శాంసన్ పని అయిపోయనట్లే...
Image Credit : ANI

సంజూ శాంసన్ పని అయిపోయనట్లే...

Asian Games 2026 : ఐసిసి టీ20 వరల్డ్ కప్ ఇంకా ముగియనేలేదు.. అప్పుడే ఈ ఏడాది చివర్లో జరిగే ఏషియన్ గేమ్స్ 2026 పై చర్చ మొదలయ్యింది. గత ఆసియా క్రీడల్లో మాదిరిగానే ఈసారి కూడా స్వర్ణ పతకాలతో సత్తా చాటాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే ఈ క్రీడాసమరానికి చాలా సమయం ఉన్నా టీమిండియా మెన్స్, ఉమెన్స్ జట్లపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యువ క్రికెటర్ సంజూ శాంసన్ కు మరోసారి భంగపాటు తప్పేలా లేదని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏషియన్ గేమ్స్ టీంలో సంజూ చోటు గల్లంతు..
Image Credit : Getty

ఏషియన్ గేమ్స్ టీంలో సంజూ చోటు గల్లంతు..

ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుండి అక్టోబర్ 4 వరకు జపాన్ లో ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. గత ఏషియన్ గేమ్స్ లో స్వర్ణ పతకాలు సాధించిన నేపథ్యంలో ఈసారి కూడా టీమిండియాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే బలమైన జట్లను పంపేందుకు బిసిసిఐ సిద్దమయ్యింది.

ఇప్పటికే బిసిసిఐ ఆసియా క్రీడలు 2026 కోసం పురుషులు, మహిళల జట్ల ప్రాబబుల్స్ లిస్ట్‌ను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఈ జాబితాలో యువ క్రికెటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదనే ప్రచారం సాగుతోంది.

బీసీసీఐ అనధికారికంగా ఎంపిక చేసిన జట్టులో సంజూ లేడు. టీ20 ప్రపంచకప్ ఆడిన జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుని కూడా నిరాశపరిచిన సంజూకు, ఇకపై భారత జట్టులోకి రావడం కష్టమే. న్యూజిలాండ్‌పై పేలవ ప్రదర్శనే అతనికి జట్టులో స్థానం లేకుండా చేసింది.

Related Articles

Related image1
Sanju Samsons: ఆ టీమిండియా స్టార్ కు 'ఇగో' ఎక్కువ
Related image2
T20 World Cup నుంచి సంజూ శాంసన్ అవుట్? ఇషాన్ కిషన్ వచ్చేశాడురోయ్ !
35
ఏషియన్ గేమ్స్ 2026 లో స్వర్ణమే లక్ష్యం..
Image Credit : Getty

ఏషియన్ గేమ్స్ 2026 లో స్వర్ణమే లక్ష్యం..

2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా బిసిసిఐ అడుగులు వేస్తోంది. అందుకోసమే ఈసారి ఏషియన్ గేమ్స్‌ను భారత్ చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు సమర్పించిన తాత్కాలిక జాబితా ప్రకారం పురుషుల జట్టుకు సూర్యకుమార్ యాదవ్, మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తారు.

గతంలో ద్వితీయ శ్రేణి జట్లను పంపినట్లు కాకుండా ఈసారి ప్రధాన జట్టునే ఏషియన్ గేమ్స్ లో ఆడించాలని బిసిసిఐ భావిస్తోంది. అంతర్జాతీయ షెడ్యూల్‌లో ఎలాంటి అడ్డంకులు లేనందున కీలక ఆటగాళ్లందరూ జట్టులో ఉంటారు.

2023 హాంగ్‌జౌ ఏషియన్ గేమ్స్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ స్వర్ణం గెలుచుకుంది. ఈసారి కూడా టైటిల్ నిలబెట్టుకోవడమే లక్ష్యం. మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్లలో భారత్‌కు స్వర్ణం అందించడం తన ప్రధాన లక్ష్యాలలో ఒకటని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గతంలోనే స్పష్టం చేశారు.

45
సంజూ వద్దు... అభిషేక్ ముద్దు
Image Credit : Getty

సంజూ వద్దు... అభిషేక్ ముద్దు

బీసీసీఐ అనధికారికంగా ఎంపిక చేసిన జట్టులో సంజూ లేడు. టీ20 ప్రపంచకప్ ఆడిన జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుని కూడా నిరాశపరిచిన సంజూకు, ఇకపై భారత జట్టులోకి రావడం కష్టమే. న్యూజిలాండ్‌పై పేలవ ప్రదర్శనే అతనికి జట్టులో స్థానం లేకుండా చేసింది.

ప్రపంచకప్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. అయితే రాబోయే ఇంగ్లండ్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. వరల్డ్ కప్ లో వరుసగా విఫలం అవుతున్నా అభిషేక్ శర్మవైపే బిసిసిఐ మొగ్గు చూపింది.. దీంతో సంజూను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

55
బీసీసీఐ ఫైనలైజ్ చేసిన ప్రాబబుల్స్ జట్లు ఇవే...
Image Credit : X/wplt20

బీసీసీఐ ఫైనలైజ్ చేసిన ప్రాబబుల్స్ జట్లు ఇవే...

ఇండియన్ మెన్స్ టీం :

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రింకూ సింగ్.

ఇండియన్ ఉమెన్స్ టీం :

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రేణుకా ఠాకూర్, స్నేహ్ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Sanju Samsons: ఆ టీమిండియా స్టార్ కు 'ఇగో' ఎక్కువ
Recommended image2
T20 World Cup నుంచి సంజూ శాంసన్ అవుట్? ఇషాన్ కిషన్ వచ్చేశాడురోయ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved