అగార్కర్, గంభీర్‌ల శాపం.! 2 ఏళ్లకు టీమిండియాలోకి తిరిగొచ్చిన ధోని శిష్యుడు..
Rahul: శుభ్‌మాన్ గిల్ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను బీసీసీఐ నియమించింది. సుదీర్ఘ విరామం తర్వాత వికెట్ కీపర్ రిషబ్ పంత్, అలాగే యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి జట్టులోకి వచ్చారు.

వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్
శుభ్‌మాన్ గిల్ గాయం కావడంతో టీమిండియా వన్డే కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు తెరదించుతూ బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. దక్షిణాఫ్రికాతో జరగబోయే కీలకమైన మూడు వన్డేల సిరీస్‌కు భారత సెలెక్టర్లు కొత్త కెప్టెన్‌ను ప్రకటించారు. సెలెక్టర్లు అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్‌కు పగ్గాలు అప్పగించారు. ఈ నిర్ణయంతో మళ్లీ రోహిత్ శర్మకే కెప్టెన్సీ దక్కుతుందనే ఊహాగానాలకు చెక్ పడింది.
టీమ్ మ్యాన్‌గా రాహుల్..
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బృందం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. డిసెంబర్ 3 నుంచి సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టు కోసం ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధపడే టీమ్ మ్యాన్‌గా అతడికి మంచి పేరుంది. ఓపెనర్ నుంచి ఏడో స్థానం వరకు ఎక్కడ అవసరమైతే అక్కడ ఆడుతూ జట్టుకు అండగా నిలిచే రాహుల్‌కు కెప్టెన్సీ కట్టబెట్టారు. గతంలో 15 వన్డేల్లో నాయకత్వం వహించిన అనుభవం రాహుల్‌కు ఉంది. అందులో తొమ్మిది విజయాలు సాధించాడు. సారథిగా కూడా బ్యాట్‌తో రాణించి 302 పరుగులు చేశాడు.
రిషబ్ రీ-ఎంట్రీ..
సుమారు ఏడాది క్రితం చివరి వన్డే ఆడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులో చేరాడు. మరోవైపు ఇండియా-ఎ తరఫున శతకంతో అదరగొట్టిన యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా, యువ కిరటాలు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మలకు చోటు దక్కింది.
పేస్, ఆల్‌రౌండర్ల విభాగం పటిష్టం..
ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ ఉన్నారు. వికెట్ కీపర్లుగా కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు, రిషబ్ పంత్, ధృవ్ జురెల్ ఎంపికయ్యారు. పేస్ బౌలింగ్ విభాగంలో ఈసారి మహమ్మద్ షమీకి నిరాశ ఎదురైంది. పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణలకు స్థానం లభించింది.
ఆ ఇద్దరికి రెస్ట్..
టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని బుమ్రా, సిరాజ్‌లకు రెస్ట్ ఇవ్వగా, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ సిరీస్ భారత జట్టుకు రాబోయే అంతర్జాతీయ మ్యాచ్‌ల సన్నాహకాలకు కీలకంగా మారనుంది.
