- Home
- Sports
- Mohammed Siraj : హైదరాబాద్ లో వర్షం, ఇంగ్లాండ్ లో సిరాజ్ మియా వికెట్ల వర్షం... 5 మ్యాచులు, 1113 బంతులు, 23 వికెట్లు
Mohammed Siraj : హైదరాబాద్ లో వర్షం, ఇంగ్లాండ్ లో సిరాజ్ మియా వికెట్ల వర్షం... 5 మ్యాచులు, 1113 బంతులు, 23 వికెట్లు
Mohammed Siraj : ఇంగ్లాండ్ పర్యటనలో మన హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు.ఓవైపు తన స్వస్థలం హైదరాబాద్ లో వర్షం పడుతుంటే మరోవైపు ఇంగ్లాండ్ లో వికెట్ల వర్షం కురిపించాడు. ఎన్ని వికెట్లు పడగొట్టాడో తెలుసా?

అదరగొట్టిన టీమిండియా యువసేన
India vs England : ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా యువ జట్టు అదరగొట్టింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత శుభ్ మన్ గిల్ నాయకత్వంలో ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిన యువకుల టీం అద్భుతాలు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఇంగ్లీష్ టీమ్ తో టెస్ట్ సీరిస్ ప్రారంభించిన గిల్ సేన ఆట క్రికెట్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. మరీముఖ్యంగా హైదరబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఈ టెస్ట్ సీరిస్ లో మెరిసి హీరోగా మారాడు… చివరకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తో 'సూపర్ మ్యాన్' అనిపించుకుని ప్రశంసలు పొందాడు ఈ హైదరబాదీ ఆటగాడు.
Test cricket… absolute goosebumps.
Series 2–2, Performance 10/10!
SUPERMEN from INDIA! What a Win. 💙🇮🇳🏏 pic.twitter.com/ORm1EVcbRH— Sachin Tendulkar (@sachin_rt) August 4, 2025
KNOW
సిరాజ్ మియా... ఇదేం మాయ
ఓవల్ టెస్ట్ లో అయితే సిరాజ్ బంతితో మాయ చేసాడు... ఈ ఒక్క టెస్ట్ లోని 9 వికెట్లు పగగొట్టాడు. ఇండియా, ఇంగ్లాడ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సీరిస్ రిజల్ట్ ను నిర్ణయించే కీలక మ్యాచ్ లో సిరాజ్ అద్భుతం చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టిన ఇతడు సెకండ్ ఇన్నింగ్స్ మరో 5 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. మొత్తం 20 వికెట్లలో దాదాపు సగం వికెట్లు సిరాజ్ ఒక్కడే పడగొట్టాడు.
It's all over at the Oval 🤩
FIFER for Mohd. Siraj 🔥🔥
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE
#TeamIndia | #ENGvINDpic.twitter.com/ffnoILtyiM— BCCI (@BCCI) August 4, 2025
సిరాజ్ అరుదైన రికార్డ్
అండర్సన్-టెండూల్కర్ టెస్ట్ సీరిస్ లో సిరాజ్ ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. ఈ ఐదు టెస్టుల సీరిస్ లో సిరాజ్ మొత్తం 1000 కి పైగా బంతులు వేశాడు. అయితే ఒకే సీరిస్ లో 1000 బంతులేసిన రికార్డ్ మహ్మద్ షమీ, జస్ప్రీత్ సింగ్ బుమ్రా, ఇషాంత్ శర్మ, జవగల్ శ్రీనాథ్, కపిల్ దేవ్ పేరిట ఉంది... కానీ గత నాలుగేళ్లలో ఈ ఘనత ఏ టీమిండియా క్రికెటర్ సాధించలేదు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరస్ ద్వారా సిరాజ్ ఈ రికార్డ్ నెలకొల్పాడు.
సిరాజ్ ఐదు టెస్టుల్లో కలిపి 185.3 ఓవర్లు వేశాడు.. అంటే 1113 బంతులు వేశాడన్నమాట. మొత్తం 32.43 యావరేజ్ తో 746 పరుగులిచ్చిన ఇతడు 23 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండుసార్లు ఐదువికెట్లు, ఓసారి 4 వికెట్ల ఫీట్ సాధించాడు.ఈ టెస్ట్ సీరిస్ లో అత్యధిక వికెట్ల రికార్డు కూడా సిరాజ్ దే.
ఓవల్ మ్యాచ్ లోనే మొదటి ఇన్నింగ్స్ లో 4, సెకండ్ ఇన్నింగ్ లో 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ఓటమిని శాసించాడు సిరాజ్. ఇలా టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించి హైదరబాదీలే కాదు యావత్ తెలుగు ప్రజలు గర్వపడేలా చేశాడు సిరాజ్.
The delight after taking a match-winning FIFER for your team 😁
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE#TeamIndia | #ENGvIND | @mdsirajofficialpic.twitter.com/kmTBvtOlaz— BCCI (@BCCI) August 4, 2025
ఓవల్ టెస్ట్ సాగిందిలా
ఓవల్ టెస్ట్ కు ముందు టీమిండియా 2-1 తో వెనకబడింది... అంటే అండర్సన్ - టెండూల్కర్ టెస్ట్ సీరిస్ ను కోల్పోకుండా ఉండాలంటే చివరిమ్యాచ్ తప్పకుండా గెలవాలి. ఇలాంటి కీలకమైన మ్యాచ్ లో టీమిండియా ఆరంభంలో తడబడింది... మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 224 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే టీమిండియా బౌలర్లు అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో కేవలం 247 పరుగులకే కట్టడి చేయగలిగారు.
For his relentless bowling display and scalping nine wickets, Mohd. Siraj bags the Player of the Match award in the 5th Test 👏👏
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE#TeamIndia | #ENGvIND | @mdsirajofficialpic.twitter.com/GyUl6dZWWp— BCCI (@BCCI) August 4, 2025
మ్యాచ్ ను మలుపుతిప్పిన సిరాజ్
రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో టీమిండియా 396 పరుగుల స్కోరు సాధించి ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్లు జోరూట్, హ్యారీ బ్రూక్ సెంచరీలతో అదరగొట్టినా చివర్లో సిరాజ్ మాయచేసి వరుసగా వికెట్లు పడగొట్టాడు. దీంతో కేవలం 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది... అండర్సన్-టెడూల్కర్ సీరిస్ 2-2 తో సమం చేసి డ్రాగా ముగించింది. చివరి మ్యాచ్ లో టీమిండియా విజయంలో కీలకంగా వ్యవహరించి సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.
The delight after taking a match-winning FIFER for your team 😁
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE#TeamIndia | #ENGvIND | @mdsirajofficialpic.twitter.com/kmTBvtOlaz— BCCI (@BCCI) August 4, 2025