MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs PAK : పాకిస్థాన్‌ను ఊచకోత కోసిన ఇషాన్ కిషన్.. ఊరమాస్ బ్యాటింగ్ భయ్యా

IND vs PAK : పాకిస్థాన్‌ను ఊచకోత కోసిన ఇషాన్ కిషన్.. ఊరమాస్ బ్యాటింగ్ భయ్యా

IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్‌తో జరుగుతున్న హై వోల్టేజీ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి భారత్‌కు భారీ స్కోరు దిశగా బాటలు వేశాడు. పాక్ బౌలర్లను దంచికొట్టాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 15 2026, 07:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
IND vs PAK : ఇషాన్ దార్ బ్యాటింగ్.. పాకిస్థాన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్ కిషన్
Image Credit : Getty

IND vs PAK : ఇషాన్ దార్ బ్యాటింగ్.. పాకిస్థాన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్ కిషన్

శ్రీలంకలోని కొలంబోలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-A మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, పాక్ బౌలర్ల అంచనాలను తలకిందులు చేస్తూ భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే బాదుడు మొదలుపెట్టాడు. తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

25
తొలి ఓవర్‌లోనే షాక్.. అభిషేక్ శర్మ డకౌట్
Image Credit : AFP

తొలి ఓవర్‌లోనే షాక్.. అభిషేక్ శర్మ డకౌట్

ఇన్నింగ్స్ ఆరంభంలోనే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే సల్మాన్ ఆఘా బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి అబిషేక్ పెవిలియన్ చేరాడు. ఎదుర్కొన్న 4 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ అయ్యాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ సున్నాకే పరిమితం కావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. కేవలం 1 పరుగు వద్దే భారత్ తొలి వికెట్ కోల్పోవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

Related Articles

Related image1
IND vs PAK : పాక్‌తో ఆటే కానీ.. షేక్ హ్యాండ్ లేదు.. సూర్య దెబ్బ !
35
ఇషాన్ మెరుపు దాడి.. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
Image Credit : Instagram/indiancricketteam

ఇషాన్ మెరుపు దాడి.. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

తొలి వికెట్ త్వరగా పడినా ఇషాన్ కిషన్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతూనే పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. షాహీన్ అఫ్రిది వేసిన ఓవర్‌లో ఒక సిక్సర్, ఒక ఫోర్ బాది 15 పరుగులు పిండుకున్నాడు. అనంతరం అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

7⃣7⃣ Runs
4⃣0⃣ Deliveries
🔟 Fours
3⃣ Sixes

What an incredible knock from Ishan Kishan! 🙌 💪

Updates ▶️ https://t.co/IgYYH0TeR9#TeamIndia | #T20WorldCup | #MenInBluepic.twitter.com/P4rtxCNkdb

— BCCI (@BCCI) February 15, 2026

45
పవర్ ప్లేలో భారత్ ఆధిపత్యం
Image Credit : Instagram/indiancricketteam

పవర్ ప్లేలో భారత్ ఆధిపత్యం

తొలి వికెట్ కోల్పోయినప్పటికీ, ఇషాన్ కిషన్ దూకుడు కారణంగా భారత్ పవర్ ప్లే ముగిసే సమయానికి 52/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇషాన్ కిషన్‌కు తోడుగా తిలక్ వర్మ కూడా సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 40 బంతుల్లోనే 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా ఇషాన్ స్ట్రైక్ రేట్ 197.14గా ఉండటం అతని ఇన్నింగ్స్ తీవ్రతను తెలియజేస్తోంది.

55
స్పిన్నర్లను ఉతికి ఆరేసిన కిషన్
Image Credit : Instagram/indiancricketteam

స్పిన్నర్లను ఉతికి ఆరేసిన కిషన్

పాకిస్థాన్ స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ వేసిన ఓవర్లలో ఇషాన్ మరింత ప్రమాదకరంగా మారాడు. అబ్రార్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతులను నేరుగా బౌలర్ తల మీదుగా ఫోర్లు కొట్టి తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నాడు. షాదాబ్ ఖాన్ వేసిన మొదటి 4 బంతుల్లోనే 14 పరుగులు వచ్చాయి. ప్రస్తుతానికి భారత్ 8.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ (10*), సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : పాక్‌తో ఆటే కానీ.. షేక్ హ్యాండ్ లేదు.. సూర్య దెబ్బ !
Recommended image2
IND vs PAK మ్యాచ్‌కు ముందే ముదిరిన వివాదం.. పాక్ స్పిన్నర్ గుట్టు రట్టు !
Recommended image3
IND vs PAK : రికార్డుల వేటలో భారత్.. పరువు కోసం పాక్ ! ఇదేంది భయ్యా ఇలా మొదలెట్టారు !
Related Stories
Recommended image1
IND vs PAK : పాక్‌తో ఆటే కానీ.. షేక్ హ్యాండ్ లేదు.. సూర్య దెబ్బ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved