IND vs AUS: చెత్త బ్యాటింగ్.. టీమిండియా ఓటమికి 5 కారణాలు ఇవే
IND vs AUS: మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20లో భారత జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. దీంతో టీమిండియా 125 రన్స్‌కే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా సులభంగా లక్ష్యాన్ని చేధించి 4 వికెట్ల తేడాతో గెలిచింది. భారత జట్టు ఓటమికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం.

మెల్‌బోర్న్‌లో భారత్‌కు ఘోర పరాజయం
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియాకు మరోసారి నిరాశ ఎదురైంది. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన తర్వాత అభిమానులు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీ20 సిరీస్ గెలుపు ఆశలు పెట్టుకున్నారు. కానీ రెండో T20లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా భారత జట్టును చిత్తుచేసింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన తర్వాత ఇది సిరీస్‌లో కీలకమైన పోరుగా మారింది.
టాస్ గెలిచి ఆస్ట్రేలియా.. భారత్ కు నిరాశ
ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. ఈ నిర్ణయం పూర్తిగా ఫలించింది. జోష్ హేజిల్‌వుడ్, నాథన్ ఎలిస్‌ల వేగం ముందు భారత టాప్ ఆర్డర్ కూలిపోయింది. శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ముగ్గురినీ హేజిల్‌వుడ్ త్వరగానే ఔట్ చేశాడు. నాథన్ ఎలిస్ సంజూ శాంసన్, అభిషేక్ శర్మ కీలక వికెట్లు తీశాడు. మొదటి ఎనిమిది ఓవర్లలోనే భారత్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో భారత జట్టు ఆస్ట్రేలియా ముందు పెద్ద టార్గెట్ ను ఉంచలేకపోయింది.
అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం
మొత్తం బ్యాటింగ్ లైనప్ కూలిపోయినప్పటికీ అభిషేక్ శర్మ మరో ఎండ్ లో నిలబడి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లో 68 పరుగులు చేసి 8 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. కొంతసేపు శర్మకు హర్షిత్ రాణా తోడయ్యాడు. హర్షిత్ 33 బంతుల్లో 35 పరుగులు చేశాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో భారత స్కోరు 125కు చేరింది. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ ప్రత్యేకంగా రాణించలేకపోయారు.
మార్ష్ దెబ్బతో ఆసీస్ ఈజీ విక్టరీ
125 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించడంలో ఆస్ట్రేలియా పెద్దగా ఇబ్బంది పడలేదు. కెప్టెన్ మిచెల్ మార్ష్ 26 బంతుల్లో 46 పరుగులు చేసి ఆసీస్ శుభారంభం అందించాడు. ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ కొద్దిసేపు క్రీజులో ఉన్నా ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలో నడిపించారు. 15 ఓవర్లలోనే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేరి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భారత బౌలర్ల కృషి వృథా
జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2 వికెట్లు తీశారు. కానీ తక్కువ స్కోరు కారణంగా వారి బౌలింగ్ ప్రభావం చూపలేదు. మెల్‌బోర్న్ పిచ్ బౌన్స్ ఉన్నప్పటికీ భారత బౌలర్లు రన్స్ నియంత్రించడంలో విఫలమయ్యారు.
ఆసీస్ తో తర్వాతి మ్యాచ్ కీలకం
వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమ్ ఇండియా ఇప్పుడు టీ20 సిరీస్‌ను కాపాడుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లను గెలవాల్సి ఉంది. ఒక మ్యాచ్ ఓడినా సిరీస్ ఆస్ట్రేలియా దక్కించుకుంటుంది లేదా డ్రా అవుతుంది. మూడవ టీ20 మ్యాచ్ నవంబర్ 2న జరగనుంది.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత జట్టు ఓటమికి కారణాలు ఇవే
- భారత బ్యాటింగ్ మొదటి భాగంలోనే పడిపోవడం ఓటమికి ప్రధాన కారణం. మొదటి 8 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, గిల్ వంటి కీలక బ్యాటర్లను ఔటు చేసాడు.
- అభిషేక్ శర్మ 68 పరుగులు చేశాడు. అయితే, ఇతర ప్లేయర్లు అతనికి సరైన తోడ్పాటు ఇవ్వలేక పోయారు. చివరకు 125 పరుగులే చేసింది. కాపాడుకోవడానికి ఇది పెద్ద టార్గెట్ కాదు.
- ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (46 పందులు), ట్రావిస్ హెడ్ మంచి ఆరంభంతో ఆసీస్ కు ఛేజ్ మరింత ఈజీగా మారింది.
- భారత బౌలర్లు ప్రయత్నించినా తక్కువ పరుగుల టార్గెట్ తో కంగారు టీమ్ పై ప్రెజర్ తీసుకురాలేకపోయారు.
- వాతావరణం కొంత భాగం క్లౌడీ, ఓవర్సాస్ పేసర్లకు అనుకూలంగా ఉండటం కూడా భారత్ బ్యాటర్లపై ప్రభావం చూపింది.
భారత జట్టు ప్రారంభ బ్యాటింగ్ విఫలం, బౌలింగ్ లో ప్రభావం చూపకపోవడం, తక్కువ పరుగుల లక్ష్యాన్ని రక్షించలేకపోవడం వంటి కారణాలతో ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి భారత్ తప్పించుకోలేకపోయింది.