MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • జెమీమా రోడ్రిగ్స్: కేవలం ఒక ప్లేయర్ కాదు.. ఎంతో మందికి ప్రేరణ

జెమీమా రోడ్రిగ్స్: కేవలం ఒక ప్లేయర్ కాదు.. ఎంతో మందికి ప్రేరణ

Jemimah Rodrigues: 2022 ప్రపంచ కప్‌లో చోటు కోల్పోయిన తర్వాత జెమీమా రోడ్రిగ్స్ మానసిక సవాళ్లను అధిగమించి తిరిగి రాణించింది. పడిలేచిన కెరటంలా ఎంతో మందికి ప్రేరణాత్మక కథగా నిలిచింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 31 2025, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జెమీమా రోడ్రిగ్స్: అప్పుడు పక్కన పెడితే.. ఇప్పుడు కప్పుకు చేరువ చేసింది !
Image Credit : Getty

జెమీమా రోడ్రిగ్స్: అప్పుడు పక్కన పెడితే.. ఇప్పుడు కప్పుకు చేరువ చేసింది !

ప్రతి క్రీడాకారుడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు కనిపిస్తుంటాయి. భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కూడా అలాంటి ప్రయాణంలోనే ముందుకు సాగింది. కానీ, ఆ ప్రయాణంలో ఎంతో ప్రత్యేకం. ఇప్పుడు కోట్లాది మంది నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె జీవితంలో ఎన్నో కఠినమైన పరీక్షలు, నిరాశలు, ఆత్మవిశ్వాసం కోల్పోవడం అన్నీ చోటు చేసుకున్నప్పటికీ, ఆమె తిరిగి రాణించిన తీరు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఒకప్పుడు టీమ్ నుంచి పక్కన పెడితే.. ఇప్పుడు కప్పుకు చేరువ చేసింది జెమీమా రోడ్రిగ్స్ !

25
జెమీమా రోడ్రిగ్స్: బాల్యంలో కఠోర శ్రమ
Image Credit : jemimahrodrigues/Instagram

జెమీమా రోడ్రిగ్స్: బాల్యంలో కఠోర శ్రమ

జెమీమా రోడ్రిగ్స్ చిన్న వయస్సు నుండే కఠోర శ్రమతో తన ప్రయాణం సాగించారు. ముంబైలో పుట్టి పెరిగిన ఆమె ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి, సోదరులతో కలిసి ముంబై లోకల్ రైలులో ప్రయాణించి ప్రాక్టీస్‌కు వెళ్ళేది.

పురుషుల మధ్య శిక్షణ పొందిన జెమీమా కేవలం 8 ఏళ్ల వయస్సులోనే 24, 28 ఏళ్ల ఆటగాళ్లతో పోటీ పడింది. శారీరకంగా చిన్నదైన ఆమెకు కండబలం పెద్దగా లేకపోవడం వల్ల టెక్నిక్, టైమింగ్‌పైనే ఆధారపడింది. ఇదే ఆమెను ప్రత్యేకమైన ప్లేయర్ గా మార్చింది.

Related Articles

Related image1
ఈ చిన్నారి చిచ్చర పిడుగు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడంతా ఈమె గురించే చర్చ
Related image2
భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్లాక్ బాండ్లు ఎందుకు ధరించారు?
35
జెమీమా రోడ్రిగ్స్: 2022 ప్రపంచ కప్ నుండి అవుట్
Image Credit : jemimahrodrigues/Instagram

జెమీమా రోడ్రిగ్స్: 2022 ప్రపంచ కప్ నుండి అవుట్

2022 మహిళల వన్డే ప్రపంచ కప్ స్క్వాడ్‌ నుండి తన పేరును తొలగించడం జెమీమా రోడ్రిగ్స్ కెరీర్‌లోని అత్యంత బాధాకరమైన క్షణం. ఆమె కలల వేదికగా భావించిన ప్రపంచ కప్ ఆడే అవకాశం కోల్పోయింది.

ఆ సమయంలో తాను ఆశ వదులుకోవాలని అనుకున్నానని, దేశం కోసం మరోసారి ఆడగలనో లేదో అన్న సందేహం కలిగిందని ఆమె తెలిపింది. తల్లిదండ్రుల ముందు ధైర్యంగా కనిపించేందుకు ప్రయత్నించినా, లోలోపల తీవ్ర నిరాశతో తల్లడిల్లింది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. ప్రాక్టీస్‌కు వెళ్లాలంటే కూడా భయం వేసిన క్షణాలను అనుభవించారు.

ఒక రోజు వంటగదిలో టీ చేస్తుండగా, ఆమె తల్లి "జెమ్, నేను నీ తల్లిని. నీకు ఇప్పుడెలా ఉందో నాకు తెలుసు" అని అన్న మాటలతో ఆమె కన్నీరు పెట్టుకుందని తెలిపారు. ఆ క్షణం ఆమె జీవితాన్ని మార్చిన మలుపుగా మారింది. అప్పటి నుంచి మళ్లీ తిరిగి ట్రాక్ లోకి వచ్చింది.

45
జెమీమా రోడ్రిగ్స్: మానసికంగా బలంగా రీఎంట్రీ
Image Credit : jemimahrodrigues/Instagram

జెమీమా రోడ్రిగ్స్: మానసికంగా బలంగా రీఎంట్రీ

జెమీమా రోడ్రిగ్స్ తన మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి కృషి చేసింది. ఒక వారం విరామం తీసుకుని, కొత్త ఉత్సాహంతో తిరిగి శిక్షణ ప్రారంభించింది. ప్రతి వారం బాగా ప్రాక్టీస్ చేసినందుకు, ఆమె తనకు తాను చిన్న బహుమతులు ఇచ్చుకునేది.. అంటే ఒక కాఫీ, చీట్ మీల్ లేదా షాపింగ్ లాంటి సాధారణ ఆనందాలు ఇందులో ఉన్నాయి.

ఆ సమయం ఆమెకు తన ఆటను, తన ఆలోచనలను మరింతగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది. “ఒక్కోసారి బాగా లేకపోవడం కూడా పెద్ద సమస్య కాదు.. ఏం పర్వాలేదు” అని అంగీకరించడం ఆమెను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లింది.

55
జెమీమా రోడ్రిగ్స్: ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన క్షణం
Image Credit : Getty

జెమీమా రోడ్రిగ్స్: ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన క్షణం

తన ప్రయాణం గురించి జెమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, విజయం లభించినప్పుడు మాత్రమే గొప్పగా భావిస్తారు. కానీ నిజమైన పరీక్ష, మనకు అనుకూలంగా లేని సమయంలో మనం ఎలా నిలబడతామన్నదే. పడిపోయిన తర్వాత లేవడం నేర్చుకోవడం అత్యంత ముఖ్యమైనది” అని అన్నారు.

ఈ ఆత్మవిశ్వాసం ఆమెను మళ్లీ భారత జట్టులో స్థానం సంపాదించేలా చేసింది. కష్టపడి, అంకితభావంతో పనిచేస్తే ఫలితం తప్పక లభిస్తుందనేది ఆమె జీవితం ఇచ్చిన గొప్ప పాఠం ఇది. జెమీమా రోడ్రిగ్స్ కథ కేవలం క్రీడాకారిణి విజయగాథ మాత్రమే కాదు.. అది ప్రతి కష్టంలోనూ నిలబడి, కొత్తగా ప్రారంభించే ధైర్యానికి ప్రతీక అని చెప్పవచ్చు. తన ఆటను ప్రేమించిన ఆమె, మళ్లీ మైదానంలో అడుగుపెట్టి, “విఫలం అంతం కాదు, కొత్త ప్రారంభం మాత్రమే” అని నిరూపించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
మహిళల క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : కోచ్ హింట్ ఇచ్చేశాడు.. కేరళ కింగ్ రీఎంట్రీ.. ఎవరెవరు అవుట్?
Recommended image2
జింబాబ్వే పై గెలవాలంటే భారత్ ఈ 3 మార్పులు చేయాల్సిందే.. లేదంటే సెమీస్ కష్టమే
Recommended image3
ICC Rankings : హ్యాట్రిక్ డకౌట్స్.. అయినా టీ20 క్రికెట్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ అభిషేక్ దే
Related Stories
Recommended image1
ఈ చిన్నారి చిచ్చర పిడుగు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడంతా ఈమె గురించే చర్చ
Recommended image2
భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్లాక్ బాండ్లు ఎందుకు ధరించారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved