MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • ICC: టెస్ట్ క్రికెట్‌లో బిగ్ చేంజ్.. 12 జట్లతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్.. ఐసీసీ సంచలన నిర్ణయం.!

ICC: టెస్ట్ క్రికెట్‌లో బిగ్ చేంజ్.. 12 జట్లతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్.. ఐసీసీ సంచలన నిర్ణయం.!

ICC: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను 12 జట్లకు విస్తరించాలని ఐసీసీ నిర్ణయించింది. ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లను చేర్చడంతో పాటు, సింగిల్ టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లకు కూడా పాయింట్లు కేటాయించేలా కొత్త నిబంధనలు తీసుకురాబోతోంది.  

2 Min read
Author : Pavithra D
Published : Apr 13 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చారిత్రాత్మక నిర్ణయం
Image Credit : BCCI\Twitter

చారిత్రాత్మక నిర్ణయం

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రూపురేఖలను మార్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం కేవలం తొమ్మిది జట్ల మధ్యే సాగుతున్న ఈ పోరాటాన్ని 12 జట్లకు విస్తరించాలని ఐసీసీ యోచిస్తోంది. టీ20 లీగ్ల హవా పెరుగుతున్న తరుణంలో, టెస్ట్ ఫార్మాట్‌ను బతికించుకోవడానికి, చిన్న దేశాలకు అవకాశం కల్పించడానికి ఈ అడుగు వేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రంగంలోకి మరో మూడు కొత్త జట్లు
Image Credit : BCCI\Twitter

రంగంలోకి మరో మూడు కొత్త జట్లు

ప్రస్తుతం ఉన్న తొమ్మిది జట్లకు తోడుగా, పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్నప్పటికీ ఇప్పటివరకు డబ్ల్యూటీసీకి దూరంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లకు ఈ లీగ్‌లో చోటు దక్కనుంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రోజర్ ట్వస్ నేతృత్వంలోని కమిటీ ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ సిఫారసులను వచ్చే మే నెలలో ఐసీసీకి సమర్పించనున్నారు.

35
సింగిల్ టెస్ట్ సిరీస్‌లకు కూడా పాయింట్లు
Image Credit : BCCI\Twitter

సింగిల్ టెస్ట్ సిరీస్‌లకు కూడా పాయింట్లు

ఈ కొత్త విధానంలో మరో కీలక మార్పు ఏమిటంటే, ఇకపై ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఉన్న సిరీస్‌లను కూడా పాయింట్ల పట్టికలో చేర్చనున్నారు. సాధారణంగా కనీసం రెండు టెస్టులు ఉంటేనే పాయింట్లు ఇచ్చే నిబంధన ఉండటంతో, పెద్ద దేశాలు చిన్న జట్లతో ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. కానీ ఇకపై టీమిండియా లేదా ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లు ఐర్లాండ్ లేదా జింబాబ్వేతో ఒక్క టెస్ట్ ఆడినా, ఆ పాయింట్లు ఫైనల్ రేసులో కీలకం కానున్నాయి.

45
టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుకు భరోసా
Image Credit : BCCI\Twitter

టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుకు భరోసా

ఈ మార్పు వల్ల చిన్న దేశాల ఆటగాళ్లకు నాణ్యమైన క్రికెట్ ఆడే అవకాశం లభిస్తుంది. టెస్ట్ క్రికెట్ కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ సమావేశంలో దీనిపై అధికారిక ముద్ర పడితే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది.

55
ఫార్మాట్ పట్ల ఆసక్తి
Image Credit : BCCI\Twitter

ఫార్మాట్ పట్ల ఆసక్తి

క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా కోరుకుంటున్న ఈ మార్పులు అమలులోకి వస్తే, టెస్ట్ ఛాంపియన్‌షిప్ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. చిన్న జట్లు పెద్ద జట్లకు షాక్ ఇచ్చే అవకాశాలు పెరగడమే కాకుండా, ఫార్మాట్ పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
Cricket Movies: ఓటీటీలో దుమ్మురేపుతున్న టాప్ 5 క్రికెట్ సినిమాలు.. అది మాత్రం ఐకానిక్ మూవీ
Recommended image2
India Cricket Fearless Era : అప్పుడు విలన్లు.. ఇప్పుడు హీరోలు ! అసలు మాస్టర్ మైండ్ కథ ఇది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved