MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • టీమిండియా టెస్టుల్లో డౌన్‌ఫాల్… గంభీర్ నిర్ణయాలే కారణమా? ముంచేశాడు !

టీమిండియా టెస్టుల్లో డౌన్‌ఫాల్… గంభీర్ నిర్ణయాలే కారణమా? ముంచేశాడు !

Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత్‌కు టెస్టుల్లో వరుస వైట్‌వాష్‌లు ఎదురయ్యాయి. టీమిండియా టెస్టు స్థాయి మరింత దిగజారుతున్న  నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 26 2025, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గంభీర్ హయాంలో టీమిండియాకు వరుస దెబ్బలు
Image Credit : Getty

గంభీర్ హయాంలో టీమిండియాకు వరుస దెబ్బలు

టీమిండియా మరో వైట్ వాష్ కు గురైంది. చెత్త ఆటతీరుతో సౌతాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో ఘోరంగా ఓడిపోయింది. దీంతో భారత జట్టు, కోచింగ్ విభాగం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత టెస్టు జట్టు మరింత ఘోరంగా విఫలమవుతోంది.

యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వడం, సీనియర్లను పక్కకు జరపడం, ఆల్‌రౌండర్లపై ఎక్కువ నమ్మకం.. ఇలాంటి నిర్ణయాలు ఒకదానిపై మరొకటి మోయలేని భారంగా మారాయి. కేవలం ఏడాది వ్యవధిలో రెండు పెద్ద జట్ల చేతిలో వైట్‌వాష్ అవడం భారత టెస్టు చరిత్రలో అరుదైన సంఘటనగా నిలిచింది. గతేడాది న్యూజిలాండ్ చేతిలో ఓటమికి గురైన భారత్, ఈసారి సౌతాఫ్రికా చేతిలో 2-0తో చిత్తుగా ఓడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సీనియర్లు దూరం కావడంతో భారత్ కు తీవ్ర నష్టం
Image Credit : X/BCCI

సీనియర్లు దూరం కావడంతో భారత్ కు తీవ్ర నష్టం

టెస్టు క్రికెట్‌లో భారత్ ఆధిపత్యానికి పునాది వేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ ముగ్గురు ఒకే ఏడాది భారత జట్టుకు వీడ్కోలు చెప్పారు. న్యూజిలాండ్ సిరీస్ వైట్‌వాష్ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించగా, ఆస్ట్రేలియా సిరీస్‌లోని పరాభవం తరువాత రోహిత్, కోహ్లి కూడా టెస్టులకు గుడ్‌బై చెప్పారు. 

వీరంతా స్వచ్ఛందంగా తప్పుకున్నారనే ప్రచారం ఉన్నప్పటికీ, జట్టులోని వాతావరణం, సెలక్షన్ ఒత్తిడులు, అకస్మాత్తుగా వచ్చిన మార్పులతోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారనే చర్చ సాగింది. ఇప్పుడు ఇవన్నీ మళ్లీ గంభీర్ ను టార్గెట్ గా చూపుతున్నాయి. ఈ ముగ్గురు వెళ్లిపోవడం భారత టెస్టు జట్టులో అనుభవాన్ని పూర్తిగా దూరం చేసింది.

34
వరుస వైఫల్యాలతో కోచ్ నిర్ణయాలపై ప్రశ్నలు
Image Credit : Getty

వరుస వైఫల్యాలతో కోచ్ నిర్ణయాలపై ప్రశ్నలు

సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో భారత్ ప్రదర్శన పూర్తిగా నిరుత్సాహ పరిచింది. కొల్‌కతా టెస్టులో 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత్, గువాహటి టెస్టులో 400కుపైగా పరుగుల తేడాతో పరాభవం పాలయ్యింది. ఇది కేవలం ఓటమి కాదు.. టెస్టు జట్టులో ఉన్న లోపాలను బహిర్గతం చేసిన సందర్భంగా నిలిచింది. 

టాప్ ఆర్డర్‌లో స్థిరమైన బ్యాటర్ లేకపోవడం, బౌలింగ్ ఎటాక్‌లో సమతౌల్యం లేకపోవడం, ప్రతీ మ్యాచ్‌లో కొత్త కాంబినేషన్ ప్రయత్నించడం.. ఇవి అన్నీ జట్టును మరింత దెబ్బకొట్టాయి. దీనికి తోడు జట్టు ఎంపిక పై కూడా విమర్శలు వస్తున్నాయి.

44
మాజీల ఘాటు వ్యాఖ్యలు
Image Credit : X/BCCI

మాజీల ఘాటు వ్యాఖ్యలు

మాజీ ఆటగాళ్లు టీమిండియా ఆట తీరుపై నిరాశను వ్యక్తం చేస్తూ గంభీర్‌ పై విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణం కోచ్ నిర్ణయాలే అంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు.

వరుస వైట్‌వాష్‌లు, వరుస టెస్టు సిరీస్ వైఫల్యాలు, సీనియర్ల తప్పుకోవడం, జట్టులోని అంతర్గత సమస్యలు.. ఇన్నీ కూడి ఇప్పుడు బీసీసీఐ దృష్టి కోచ్ గంభీర్ వైపు మళ్లింది. సోషల్ మీడియాలో ఇదే గంభీర్‌కు చివరి టెస్టు అనే చర్చ మొదలైంది.

 గత 15 నెలల్లో వన్డేలు, టెస్టుల్లో భారత్ ఎదుర్కొన్న పరాజయాలు, అనేక వివాదాస్పద సెలక్షన్ నిర్ణయాలతో ఏర్పడిన ఈ పరిస్థితులను మార్చడానికి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్, మాజీ ప్లేయర్లు పేర్కొంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Video: విధి ఎంత విచిత్రమైందో.. ఒకప్పుడు స్టార్ క్రికెటర్, ప్రస్తుతం దారుణ పరిస్థితి
Recommended image2
Asian Games 2026 : ఆసియా క్రీడల్లో అదరగొట్టిన అమ్మాయిలు... భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్
Recommended image3
Asian Games 2026: ఆసియా గేమ్స్ లో కబడ్డీలో తిరుగులేని భారత్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన పురుషులు, మహిళల జట్లు
Related Stories
Recommended image1
టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల: ఒకే గ్రూప్ లో భారత్-పాక్.. మ్యాచ్ ఎప్పుడు?
Recommended image2
బీసీసీఐ చేతుల్లోనే నా భవిష్యత్తు.. గౌతమ్ గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved