MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • FIFA Prize Money : గెలిచిన స్పెయిన్ కు రూ.492 కోట్లా..! ఓడిన ఈ మూడు జట్లకేమో రూ.807 కోట్లా..!

FIFA Prize Money : గెలిచిన స్పెయిన్ కు రూ.492 కోట్లా..! ఓడిన ఈ మూడు జట్లకేమో రూ.807 కోట్లా..!

ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2026 లో విజేతగా నిలిచిన స్పెయిన్, రన్నరప్ గా నిలిచిన అర్జెంటినా జట్లు వందలకోట్ల ప్రైజ్ మనీ పొందాయి. మరి మూడోస్థానంలో నిలిచిన ఇంగ్లాండ్, నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్ జట్లు ఎంత ప్రైజ్ మనీ అందుకున్నాయో తెలుసా?

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 20 2026, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ
Image Credit : X/AbdulMoizEjaz1

ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ

FIFA World Cup 2026 Prize Money : ఫిఫా వరల్డ్ కప్ 2026 ఛాంపియన్ గా స్పెయిన్ నిలిచింది. ఫైనల్లో అర్జెంటినాను ఓడించి 16 ఏళ్ల తర్వాత ఫుట్ బాల్ ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఇలా క్రీడా ప్రియులను అలరించడమే కాదు భారీ ప్రైజ్ మనీ అందుకుంది స్పెయిన్... రన్నరప్ గా నిలిచిన అర్జెంటినా కూడా వందల కోట్లు అందుకుంది.

అయితే విన్నర్, రన్నరప్ గా నిలిచిన ఈ రెండు జట్లే కాదు ఈ వరల్డ్ కప్ లో పాల్గొన్న ప్రతి జట్టు ప్రైజ్ మనీ అందుతుంది… ఇక సెమీ ఫైనల్ వరకు చేరిన జట్లకయితే విన్నర్ స్థాయిలో వందల కోట్ల ప్రైజ్ మనీ అందుతుంది. ఇలా ఈ ఫిఫా వరల్డ్ కప్ లో మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్, నాలుగో స్థానంలో నిలిచిన ప్రాన్స్ ఎంతెంత ప్రైజ్ మనీ అందుకున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇంగ్లాండ్ ఫుట్ బాల్ టీమ్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Image Credit : Getty

ఇంగ్లాండ్ ఫుట్ బాల్ టీమ్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

ఫిపా వరల్డ్ కప్ 2026 లో ఇంగ్లాండ్ ఫుట్ బాల్ టీమ్ అద్భుత ప్రదర్శన చేసింది... దూకుడుగా ఆడుతూ ఒక్కో జట్టును ఓడిస్తూ సెమీస్ కు చేరుకుంది. అయితే కీలకమైన సెమీస్ లో అర్జెంటినా చేతిలో ఓటమిని చవిచూసింది... దీంతో ఆ టీం వరల్డ్ కప్ జర్నీ ముగిసింది. ఇలా మెగా టోర్నీ నుండి వెనుదిరగాల్సి వచ్చింది.

అయితే ఈ వరల్డ్ కప్ లో మూడోస్థానం కోసం ప్రాన్స్ తో తలపడ్డ ఇంగ్లాండ్ మరో విజయం నమోదు చేసుకుంది. ఇలా ఫిఫా వరల్డ్ కప్ లో ఇంగ్లీష్ ఫుట్ బాల్ టీం 6-4 తేడాతో ఫ్రాన్స్ ను ఓడించి అభిమానులను అలరించడమే కాదు భారీ ఫ్రైజ్ మనీ పొందింది. ఈ వరల్డ్ కప్ లో థర్డ్ ర్యాంక్ సాధించిన ఇంగ్లాండ్ విజేత స్పెయిన్, రన్నరప్ అర్జెంటినా తరహాలోనే వందలు కోట్లు పొందింది... ఇండియన్ కరెన్సీలో 250 కోట్ల రూపాయలు దక్కించుకుంది.

Related Articles

Related image1
FIFA World Cup 2026: అర్జెంటీనా ఖేల్ ఖతం.. 16 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ కొట్టిన స్పెయిన్
Related image2
FIFA World Cup 2026 Awards List: రోడ్రికి గోల్డెన్ బాల్.. ఎంబాప్పేకు గోల్డెన్ బూట్.. ఫిఫా వరల్డ్ కప్ 2026 అవార్డుల విన్నర్స్ వీరే
35
ఫ్రాన్స్ ఫుట్ బాల్ టీం ప్రైజ్ మనీ ఎంత?
Image Credit : Getty

ఫ్రాన్స్ ఫుట్ బాల్ టీం ప్రైజ్ మనీ ఎంత?

ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడించే స్పెయిన్ ఫైనల్ కు చేరింది. లీగ్ దశలో అద్భుతంగా ఆడి క్వార్టర్ ఫైనల్ కు, అక్కడా అద్భుత ప్రదర్శన చేసి సెమీ ఫైనల్ కి చేరిన ఫ్రాన్స్ కీలక సమయంలో తడబడింది. స్పెయిన్ చేతిలో ఓడటమే కాదు మూడో స్థానం కోసం జరిగిన పోరులోనూ ఇంగ్లాండ్ చేతిలో ఓడింది... దీంతో ఫ్రాన్స్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే సెమీ ఫైనల్ కు చేరిన ఫ్రాన్స్ భారీ ఫ్రైజ్ మనీని పొందింది. ఈ ఫిఫా వరల్డ్ కప్ లో నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రాన్స్ 230 కోట్ల రూపాయల బహుమతిని సొంతం చేసుకుంది. దీంతో పాటు ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాప్పే అత్యధిక గోల్స్ సాధించి గోల్టెన్ బూట్ అవార్డు కైవసం చేసుకున్నాడు.

45
ఫిఫా వరల్డ్ ఛాంపియన్‌, రన్నరప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Image Credit : ChatGPT

ఫిఫా వరల్డ్ ఛాంపియన్‌, రన్నరప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

నెలరోజులకు పైగా (39 రోజులు) సాగిన ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు తెరపడింది. ఫైనల్‌లో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ ఛాంపియన్‌గా నిలిచింది. 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ మళ్లీ ఫిఫా ట్రోఫీని కైవసం చేసుకుంది. 2010లో నెదర్లాండ్స్‌ను ఓడించి కప్ గెలిచిన స్పెయిన్, ఇప్పుడు అర్జెంటీనాపై విజయం సాధించింది.

ఇతర క్రీడలతో పోలిస్తే ఫిఫా ప్రపంచకప్ విజేతకు అత్యధిక మొత్తాన్ని బహుమతిగా ఇస్తుంది. ఈసారి ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ జట్టు 492 కోట్ల రూపాయలకు పైగా బహుమతిని గెలుచుకుంది. స్పెయిన్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన అర్జెంటినా 327 కోట్ల రూపాయలకు పైగా దక్కించుకుంది.

55
ఫిఫా వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ ఎంత?
Image Credit : X

ఫిఫా వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ ఎంత?

ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో ఛాంపియన్, రన్నరప్‌తో పాటు సెమీఫైనల్, లీగ్ దశలో పాల్గొన్న జట్లకు కూడా ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 871 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఏకంగా 8400 కోట్ల రూపాయలు. గత ప్రపంచకప్‌తో పోలిస్తే ఫిఫా ఈసారి ప్రైజ్ మనీని భారీగా పెంచింది.

క్వార్టర్ ఫైనల్ వరకు చేరి ఓడిన జట్లకు అంటే 5 నుండి 8వ స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా భారీ ప్రైజ్ మనీ దక్కింది. ఒక్కో టీం కు రూ.20 మిలియన్ డాలర్ల చొప్పున అందించారు. ఇక ఈ వరల్డ్ కప్ లో పాల్గొన్న మొత్తం 48 జట్లు కూడా ప్రైజ్ మనీ అందుకున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
FIFA ప్రపంచ కప్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ferran Torres: మెస్సీ కలని ముంచేసిన కుర్రాడు.. ఎవరీ ఫెర్రాన్ టోర్రెస్? ఇండియాతో ఉన్న స్పెషల్ కనెక్షన్ ఏంటి?
Recommended image2
Lamine Yamal Net Worth: మెస్సీకి షాకిచ్చిన లామిన్ యామల్ నెట్ వర్త్ తెలిస్తే మైండ్ బ్లాకే !
Recommended image3
FIFA World Cup 2026 Awards List: రోడ్రికి గోల్డెన్ బాల్.. ఎంబాప్పేకు గోల్డెన్ బూట్.. ఫిఫా వరల్డ్ కప్ 2026 అవార్డుల విన్నర్స్ వీరే
Related Stories
Recommended image1
FIFA World Cup 2026: అర్జెంటీనా ఖేల్ ఖతం.. 16 ఏళ్ల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ కొట్టిన స్పెయిన్
Recommended image2
FIFA World Cup 2026 Awards List: రోడ్రికి గోల్డెన్ బాల్.. ఎంబాప్పేకు గోల్డెన్ బూట్.. ఫిఫా వరల్డ్ కప్ 2026 అవార్డుల విన్నర్స్ వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved