MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • బౌలర్లు దండం పెట్టాల్సిందే ! 6 సార్లు 300+ పరుగులు.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

బౌలర్లు దండం పెట్టాల్సిందే ! 6 సార్లు 300+ పరుగులు.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

Triple Centuries: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 6 ట్రిఫుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్ సర్ డాన్ బ్రాడ్‌మాన్. అసాధ్యమైన ఈ రికార్డు, బ్రాడ్‌మాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 15 2026, 08:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రికెట్ చరిత్రలో సూపర్ రికార్డు.. ఏకైక బ్యాటర్ అతడే
Image Credit : Gemini

క్రికెట్ చరిత్రలో సూపర్ రికార్డు.. ఏకైక బ్యాటర్ అతడే

క్రికెట్ మైదానంలో వంద పరుగులు చేయడం ఒక ఎత్తయితే, రెండు వందలు లేదా మూడు వందల పరుగులు చేయడం మరో ఎత్తు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో కనీసం రెండు ట్రిఫుల్ సెంచరీలు సాధించిన వారిలో బ్రియాన్ లారా, క్రిస్ గేల్, వీరేందర్ సెహ్వాగ్ వంటి అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. అయితే, ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, అక్కడ ఒకే ఒక పేరు మాత్రం టాప్ లో ఉంటుంది. ఆ పేరే 'సర్ డాన్ బ్రాడ్‌మాన్'. ఆరు ట్రిఫుల్ సెంచరీలతో ఆయన సృష్టించిన రికార్డు నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
250 ఏళ్ల చరిత్రలో అసామాన్యమైన రికార్డు ఇది
Image Credit : ChatGPT

250 ఏళ్ల చరిత్రలో అసామాన్యమైన రికార్డు ఇది

ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్ర సుమారు 250 ఏళ్ల నాటిది. అధికారిక గణాంకాల ప్రకారం, జూన్ 1772లో హాంప్‌షైర్, ఇంగ్లాండ్ ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్ మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌గా గుర్తిస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వేల సంఖ్యలో మ్యాచ్‌లు జరిగాయి, ఎందరో దిగ్గజాలు అద్భుతమైన ఆటతో అదరగొట్టారు. కానీ, తన కెరీర్‌లో ఏకంగా 6 సార్లు 300 మార్కును దాటిన ఆటగాడిగా బ్రాడ్‌మాన్ ప్రపంచ రికార్డు మాత్రం చెక్కుచెదరకుండా ఉంటుంది.

Related Articles

Related image1
SRH vs RR: ఇషాన్ కిషన్ మాస్ బ్యాటింగ్.. కావ్య పాప రియాక్షన్ చూశారా? వీడియో వైరల్
Related image2
IPL 2026 : వరుస ఓటములు.. ముంబై ఇండియన్స్‌కు ఏమైంది? అసలు కారణాలివే
35
క్రీజులో అడుగుపెడితే బౌలర్లకు చుక్కలే
Image Credit : Getty

క్రీజులో అడుగుపెడితే బౌలర్లకు చుక్కలే

ఆస్ట్రేలియాకు చెందిన సర్ డాన్ బ్రాడ్‌మాన్ 1928 నుండి 1948 మధ్య కాలంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించారు. ఆయన బ్యాటింగ్ శైలి ఎంత సునామీలా ఉండేదంటే, ఒక్కసారి క్రీజులో సెట్ అయితే అవుట్ చేయడం ప్రత్యర్థి జట్టుకు పెద్ద సవాలే. గంటల తరబడి బ్యాటింగ్ చేస్తూ బౌలర్లను అలసిపోయేలా చేసేవారు. బౌలర్లు విసిగిపోయి కరుణించు సామీ అనేలా వుండేదని అప్పటి క్రికెట్ చూసిన ప్లేయర్లు చెబుతుంటారు. అందుకే బ్రాడ్ మన్ ను అందరి ప్లేయర్ల కంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి.

45
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక ట్రిఫులు సెంచరీల జాబితాలో టాప్
Image Credit : our own

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక ట్రిఫులు సెంచరీల జాబితాలో టాప్

బ్రాడ్‌మాన్ తర్వాత స్థానాల్లో ఉన్న ఆటగాళ్లను గమనిస్తే, ఆయన సాధించిన ఘనత ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇంగ్లాండ్‌కు చెందిన వాలీ హమ్మండ్, ఆస్ట్రేలియాకు చెందిన బిల్ పాన్స్‌ఫోర్డ్ తలో 4 ట్రిఫుల్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు.

1. డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా): 6 ట్రిఫుల్ సెంచరీలు

2. వాలీ హమ్మండ్ (ఇంగ్లాండ్): 4

3. బిల్ పాన్స్‌ఫోర్డ్ (ఆస్ట్రేలియా): 4

4. బ్రియాన్ లారా (వెస్టిండీస్): 3

5. గ్రేమ్ హిక్ (ఇంగ్లాండ్): 3

6. మైఖేల్ హస్సీ (ఆస్ట్రేలియా): 3

7. ఛతేశ్వర్ పుజారా (భారత్): 3

8. విలియం గ్రేస్ (ఇంగ్లాండ్): 3

55
234 మ్యాచ్‌లు.. 117 సెంచరీలు
Image Credit : Getty

234 మ్యాచ్‌లు.. 117 సెంచరీలు

సర్ డాన్ బ్రాడ్‌మాన్ ఆగస్టు 27, 1908న ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో జన్మించారు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఆయన కేవలం 234 మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఏకంగా 28,067 పరుగులు సాధించారు. ఇందులో విశేషం ఏమిటంటే, ఆయన సగటు 95.14గా ఉండటం. తన కెరీర్‌లో 117 సెంచరీలు, 69 అర్ధ సెంచరీలు సాధించారు. ఆయన అత్యధిక స్కోరు అజేయంగా 453 పరుగులు. 1927లో ప్రారంభమైన ఆయన క్రికెట్ ప్రయాణం 1949 వరకు కొనసాగింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Related Stories
Recommended image1
SRH vs RR: ఇషాన్ కిషన్ మాస్ బ్యాటింగ్.. కావ్య పాప రియాక్షన్ చూశారా? వీడియో వైరల్
Recommended image2
IPL 2026 : వరుస ఓటములు.. ముంబై ఇండియన్స్‌కు ఏమైంది? అసలు కారణాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved