MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Sanju Samson : వాంఖడేలో సంజూ సునామీ సెంచరీ.. ఒకే ఇన్నింగ్స్‌తో 5 రికార్డులు బద్దలు

Sanju Samson : వాంఖడేలో సంజూ సునామీ సెంచరీ.. ఒకే ఇన్నింగ్స్‌తో 5 రికార్డులు బద్దలు

Sanju Samson : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌పై సంజూ శాంసన్ అద్భుత సెంచరీతో చెలరేగి, చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ స్కోరు అందించడంతో పాటు ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 23 2026, 10:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ముంబై ఇండియన్స్‌పై సంజూ శాంసన్ విశ్వరూపం
Image Credit : ANI

ముంబై ఇండియన్స్‌పై సంజూ శాంసన్ విశ్వరూపం

సంజూ శాంసన్ సునామీ సృష్టించాడు. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో 33వ ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో సంజూ అద్భుతమైన సెంచరీ సాధించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టులో ఓపెనర్‌గా వచ్చిన శాంసన్, ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

కేవలం 54 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు చేసి తన కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి నమోదు చేశాడు. శాంసన్ మెరుపు సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్ ద్వారా సంజూ శాంసన్ పలు అరుదైన రికార్డులను సాధించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ముంబైపై సెంచరీ కొట్టిన తొలి సీఎస్‌కే బ్యాటర్
Image Credit : x@IPL

ముంబైపై సెంచరీ కొట్టిన తొలి సీఎస్‌కే బ్యాటర్

ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై సెంచరీ సాధించడం ఏ బ్యాటర్ కైనా సవాలే. అయితే, సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌తో ఒక అద్భుతమైన ఘనతను అందుకున్నాడు. ముంబై ఇండియన్స్‌పై ఐపీఎల్‌లో సెంచరీ బాదిన మొట్టమొదటి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్‌గా సంజూ రికార్డు సృష్టించాడు. గతంలో ఎందరో దిగ్గజాలు సీఎస్‌కే తరపున ఆడినా, ముంబై లాంటి బలమైన జట్టుపై ఈ ఘనత సాధించడం శాంసన్‌కే సాధ్యమైంది.

Related Articles

Related image1
Suryakumar Yadav: నిమిషాల లెక్కన ప్రపంచ రికార్డు.. టీ20ల్లో ఆ భారత బ్యాటర్ విధ్వంసం.. ఎవరో తెలుసా?
Related image2
T20ల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీ వీరులు వీరే.. కోహ్లీని దాటేసిన అభిషేక్ శర్మ
36
ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు
Image Credit : x@IPL

ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు

ఈ 2026 ఐపీఎల్ సీజన్‌లో సంజూ శాంసన్ భీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో చేసిన 101* పరుగులు ఈ సీజన్‌లో అతనికి రెండో సెంచరీ. తద్వారా, ఒకే ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున రెండు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా శాంసన్ నిలిచాడు. ఇంతకుముందు 2018లో షేన్ వాట్సన్ మాత్రమే సీఎస్‌కే తరపున ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు సాధించాడు. ఇప్పుడు శాంసన్ ఆ దిగ్గజం సరసన చేరాడు.

46
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారతీయుల జాబితాలో సంజూ
Image Credit : x@IPL

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు బాదిన భారతీయుల జాబితాలో సంజూ

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో సంజూ శాంసన్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈ తాజా సెంచరీతో కలిపి ఐపీఎల్‌లో శాంసన్ మొత్తం 5 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. దీంతో అతను కేఎల్ రాహుల్ (5 సెంచరీలు)తో సమానంగా నిలిచాడు. ప్రస్తుతం అతని కంటే ముందు విరాట్ కోహ్లీ (8) మాత్రమే ఉన్నాడు. జోస్ బట్లర్ (7), క్రిస్ గేల్ (6) వంటి దిగ్గజాల తర్వాతి స్థానాల్లో శాంసన్ కొనసాగుతున్నాడు.

56
టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయుడిగా రోహిత్ సరసన సంజూ
Image Credit : ANI

టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయుడిగా రోహిత్ సరసన సంజూ

ఓవరాల్ టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో సంజూ శాంసన్ తన 8వ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఘనతతో అతను టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (8 సెంచరీలు) సరసన చేరాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ చెరో 9 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా, శాంసన్ ఇప్పుడు మూడవ స్థానానికి ఎగబాకాడు.

66
సీఎస్‌కే తరపున మల్టిపుల్ సెంచరీలు కొట్టిన సంజూ శాంసన్
Image Credit : ANI

సీఎస్‌కే తరపున మల్టిపుల్ సెంచరీలు కొట్టిన సంజూ శాంసన్

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తరపున ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన అతికొద్ది మంది ఆటగాళ్ల క్లబ్‌లో సంజూ చేరిపోయాడు. మురళీ విజయ్ (2), షేన్ వాట్సన్ (2), రుతురాజ్ గైక్వాడ్ (2) తర్వాత సీఎస్‌కే జెర్సీలో రెండు సెంచరీలు సాధించిన నాలుగో ప్లేయర్‌గా సంజూ శాంసన్ ఘనత సాధించాడు. ముఖ్యంగా పేసర్లను చెడుగుడు ఆడుకుంటూ 40 బంతుల్లో 83 పరుగులు చేయడం విశేషం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image3
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Related Stories
Recommended image1
Suryakumar Yadav: నిమిషాల లెక్కన ప్రపంచ రికార్డు.. టీ20ల్లో ఆ భారత బ్యాటర్ విధ్వంసం.. ఎవరో తెలుసా?
Recommended image2
T20ల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీ వీరులు వీరే.. కోహ్లీని దాటేసిన అభిషేక్ శర్మ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved