MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IPL 2026: రెండు మ్యాచ్‌లు 2 మోసాలు.. SRHను ఓడించేందుకు కుట్ర జరుగుతోందా.!

IPL 2026: రెండు మ్యాచ్‌లు 2 మోసాలు.. SRHను ఓడించేందుకు కుట్ర జరుగుతోందా.!

SRH: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లలో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. క్లాసెన్, అభిషేక్ శర్మ క్యాచ్ ల విషయంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయాలు, అభిమానుల ఆగ్రహంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

1 Min read
Author : Pavithra D
Published : Apr 03 2026, 07:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అంపైర్ల షాక్
Image Credit : SRH\Instagram

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అంపైర్ల షాక్

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. కేకేఆర్(KKR)పై 65 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి బోణీ కొట్టింది. అయితే, జట్టు విజయాల కంటే గత రెండు మ్యాచ్‌ల్లో అంపైర్లు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ల విషయంలో అంపైర్లు వ్యవహరించిన తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

25
హెన్రీచ్ క్లాసెన్ క్యాచ్ వివాదం
Image Credit : Getty

హెన్రీచ్ క్లాసెన్ క్యాచ్ వివాదం

ఆర్‌సీబీ(RCB)తో జరిగిన మ్యాచ్‌లో హెన్రీచ్ క్లాసెన్ కొట్టిన షాట్‌ను బౌండరీ వద్ద ఫిల్ సాల్ట్ క్యాచ్ పట్టాడు. అయితే ఆ సమయంలో అతడి కాలు బౌండరీ రోప్‌ను తాకినట్లు స్పష్టంగా అనిపించినా, అంపైర్ అవుట్ గా ప్రకటించారు. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అంపైర్ మరికొంత సమయం తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Related Articles

Related image1
IPL 2026: అందుకే ఓపెనర్‌గా వచ్చా.. ఓటమిపై మా ఓనర్ తిట్టలేదు.. కానీ.! రిషబ్ పంత్
Related image2
IPL 2026: CSKపై పిచ్చికొట్టుడు.. బుడ్డోడు వైభవ్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్.!
35
అభిషేక్ శర్మ అవుట్ పై అసంతృప్తి
Image Credit : X/SunRisers

అభిషేక్ శర్మ అవుట్ పై అసంతృప్తి

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ క్యాచ్ కూడా వివాదానికి కారణమైంది. వరుణ్ చక్రవర్తి పట్టిన క్యాచ్ టీవీ రిప్లేలో నేలకు తాకినట్లు కనిపించినా, టీవీ అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించాడు. రిప్లేలో బంతి చేతుల్లోకి వెళ్లే ముందు బౌన్స్ అయినట్లు కనిపించినప్పటికీ, అంపైర్ వేళ్లు బంతి కింద ఉన్నాయనే సాకుతో అవుట్ ఇచ్చారు.

45
కుట్ర జరుగుతోందా?
Image Credit : SRH Insta

కుట్ర జరుగుతోందా?

కీలక సమయంలో మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్లను అవుట్ చేయడంపై ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. సన్‌రైజర్స్‌ను ఓడించేందుకు అంపైర్లు కుట్ర చేస్తున్నారా అని వారు ప్రశ్నిస్తున్నారు. అంపైర్లకు స్పష్టత లేనప్పుడు నిర్ణయం బ్యాటర్లకు అనుకూలంగా ఉండాలనే నిబంధన ఉన్నా, ఈ రెండు సందర్భాల్లో అది పాటించలేదని వారు ఆరోపిస్తున్నారు.

55
టెక్నాలజీపై ప్రశ్నలు
Image Credit : SRH\Instagram

టెక్నాలజీపై ప్రశ్నలు

నిర్ణయాల విషయంలో టీవీ అంపైర్లు మరింత సమయం కేటాయించాలని, నాణ్యమైన కెమెరాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్లాసెన్, అభిషేక్ శర్మ వంటి కీలక ఆటగాళ్లు ఆ సమయంలో అవుట్ కావడం జట్టు స్కోరుపై ప్రభావం చూపించిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Tendulkar : అర్జున్ టెండూల్కర్ కి ఇష్టమైన క్రికెటర్ ఎవరు..? సచిన్ కాకుండా...
Recommended image2
Cameron Green: కేకేఆర్ కొంపముంచిన రనౌట్.. 25 కోట్ల ప్లేయర్‌ను తిట్టిపోసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్
Recommended image3
SRH vs KKR: ఆరెంజ్ ఆర్మీ ఊచకోత.. కేకేఆర్ కోటను షేక్ చేశారు !
Related Stories
Recommended image1
IPL 2026: అందుకే ఓపెనర్‌గా వచ్చా.. ఓటమిపై మా ఓనర్ తిట్టలేదు.. కానీ.! రిషబ్ పంత్
Recommended image2
IPL 2026: CSKపై పిచ్చికొట్టుడు.. బుడ్డోడు వైభవ్‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved