టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్..! దెబ్బకు రూ. 250 కోట్లు హుష్ కాకి..
Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ భారత్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో పాల్గోకూడదని నిర్ణయించింది. ఐసీసీ హెచ్చరికలను కూడా బీసీబీ పట్టించుకోలేదు. ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్‌కు సుమారు 240 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం..

వరల్డ్ కప్ ఆడటం ఒక కల
ప్రతి క్రికెటర్‌కు వరల్డ్ కప్ ఆడటం ఒక కల. మెగా ఈవెంట్‌లో సత్తా చాటి దేశం ఖ్యాతిని పెంచాలని ఆశిస్తారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్లు లేకుండానే రాబోయే టీ20 వరల్డ్ కప్ జరిగేలా ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని ఇప్పటికే తన నిర్ణయాన్ని ప్రకటించింది.
బీసీబీ పట్టించుకోలేదు..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇచ్చిన అల్టిమేటమ్‌ను కూడా బీసీబీ పట్టించుకోలేదు. భారత్‌లో ఆడండి, లేదంటే మరో జట్టుకు అవకాశం ఇస్తామని ఐసీసీ స్పష్టం చేసినా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ మొండి పట్టుదలకు పోయింది. షెడ్యూల్‌ను మార్చేది లేదని ఐసీసీ తేల్చి చెప్పింది.
టీ20 వరల్డ్ కప్‌కు..
తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం లేదని, టీ20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడిన తర్వాత శ్రీలంకలో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశమే ఉండదని ఐసీసీ పేర్కొంది. దీంతో టీ20 వరల్డ్ కప్‌కు బంగ్లాదేశ్ జట్టు దూరమైనట్టే అని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బంగ్లాదేశ్ క్రికెటర్లకు పెద్ద దెబ్బ
బీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెటర్లకు పెద్ద దెబ్బ అని, వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని వారు కోల్పోతున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ వ్యవహారంలో బంగ్లాదేశ్ క్రికెటర్ల ప్రమేయం ఏమీ లేదని, అక్కడి ప్రభుత్వ నిర్ణయాల ప్రకారమే బీసీబీ సైతం నడుచుకుందని నిపుణులు చెప్పుకొస్తున్నారు.
దాదాపు 240 కోట్ల రూపాయల వరకు..
భారత్‌లో వరల్డ్ కప్‌కు దూరంగా ఉండటం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్‌కు భారీగా నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 240 కోట్ల రూపాయల వరకు నష్టపోయే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ తప్పుకుంటే ఐసీసీకి పెద్దగా నష్టమేమీ ఉండదనే చర్చ కూడా ఉంది.

