MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • నువ్వు మహారాజువయ్యా.! ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు.. వరల్డ్‌కప్ ముద్దాడాడు

నువ్వు మహారాజువయ్యా.! ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు.. వరల్డ్‌కప్ ముద్దాడాడు

Amol Muzumdar: ఈ కోచ్‌కు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన అనుభవం లేదు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని మాత్రం కలలు కన్నాడు. కానీ ఆ కలలు సాకారం కాలేదు. అయితే ఇప్పుడు ప్రపంచకప్‌ను గెలిచాడు. 

2 Min read
Pavithra D
Published : Nov 03 2025, 07:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫైనల్‌లో విజయభేరి..
Image Credit : BCCI\Twitter

ఫైనల్‌లో విజయభేరి..

నవీ ముంబై వేదికగా జరిగిన మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో టీమిండియా విజయభేరి మోగించింది. సఫారీ జట్టుపై టీమిండియా జయకేతనం ఎగురవేసింది. కలల కప్‌‌ను ముద్దాడింది ముద్దాడిన హర్మన్‌ ప్రీత్ సేన.

25
వెల్లువెత్తిన సంబరాలు..
Image Credit : BCCI\Twitter

వెల్లువెత్తిన సంబరాలు..

టీమిండియా విజయంతో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్, విజయవాడలో అభిమానులు భారీగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ అద్భుత విజయంపై దేశ వ్యాప్తంగా ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. మహిళా జట్టుకు ప్రధాని మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ గెలుపు దేశంలోని భవిష్యత్ ఛాంపియన్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు.

Related Articles

Related image1
Cricket: తల్లిదండ్రులు భారత్‌ను వదిలారు.. కొడుకు పాక్‌ను పేకాటాడేశాడు.. ఈ ప్లేయర్ ఎవరంటే?
Related image2
Cricket: 13 సిక్సర్లు, 10 ఫోర్లతో చిచ్చరపిడుగు విస్పోటనం.. దెబ్బకు డివిలియర్స్ రికార్డుకే ఎసరొచ్చిందిగా
35
కోచ్ కీలకపాత్ర..
Image Credit : BCCI\Twitter

కోచ్ కీలకపాత్ర..

అమోల్ ముజుందర్.. భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఈ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఫ్యాన్స్‌కు అసలు ఈయన ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలన్న ఈయన కల నెరవేరలేదు గానీ.. కోచ్‌గా బాధ్యతలు చేపట్టి.. ప్రపంచకప్ ముద్దాడారు. టీమిండియా మహిళల వెన్నుతట్టి.. సలహాలు, సూచనలు ఇస్తూ.. భారత మహిళలు ట్రోఫీ అందుకోవడంలో ముజుందర్ కీలక పాత్ర పోషించారు. ట్రోఫీ నెగ్గిన తర్వాత కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ సింగ్.. కోచ్ పాదాలకు నమస్కరించిన ఫోటో కూడా మీరు చూసే ఉంటారు.

45
ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు..
Image Credit : BCCI\Twitter

ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు..

అమోల్ ముజుందర్ గురించి మీకో విషయం చెప్పాలి. ఈయన ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. ఈ ముంబై బోర్న్ డొమెస్టిక్ స్టార్‌కు.. టీమిండియా తరపున ఒక్క ఇంటర్నేషనల్ ఆడే అవకాశం రాలేదు. అందుకేనేమో టీమిండియాకు ప్రాతినిద్యం వహించాలన్న ఆయన కలను ఈ విధంగా సాకారం చేసుకున్నారు. ట్రోఫీ అందుకున్నా ఆయన మాట్లాడుతూ.. 'క్రెడిట్ అంతా మహిళలదే. ఓటములలోనూ కుంగిపోకుండా.. వాళ్ల లక్ష్యాన్ని సాధించారు' అని అన్నారు.

55
 ముజుందర్ కెరీర్..
Image Credit : BCCI\Twitter

ముజుందర్ కెరీర్..

ముజుందర్ తన డొమెస్టిక్ కెరీర్‌లో ఆంధ్ర, అస్సాం, ఇండియా ఏ, ముంబై, ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెవన్ జట్ల తరపున ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 171 మ్యాచ్‌లు ఆడి 11,167 పరుగులు చేయగా.. లిస్టు-ఏ క్రికెట్‌లో 113 మ్యాచ్‌లకు 3286 పరుగులు చేశారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
మహిళల క్రికెట్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved