Fact Check: షమీ-సానియా దుబాయ్ ట్రిప్, ఫోటోలు వైరల్.. ఇందులో నిజమెంత?
Shami and Sania Mirza: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ షమీల ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. గతంలో వీరు వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి.
ఇద్దరు భారత స్టార్ క్రిడాకారులకు చెందిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారే టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ, మాజీ టెన్నిస్ స్టార్, హైదరాబాద్ ప్లేయర్ సానియా మీర్జా. తమ భాగస్వాములతో వీడాకులు తీసుకున్న వీరు.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గతంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే, దాని గురించి వీరు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సైలెంట్ అయిపోయింది.
సానియా మీర్జా, మహ్మద్ షమీ ఇద్దరూ ప్రముఖ క్రీడాకారులు. భారత తరఫున అంతర్జాతీయ వేదికపై అద్భుతమైన విజయాలు సాధించారు. క్రీడలతో పాటు వారి వ్యక్తిగత జీవితాలు గమనిస్తే ఒకేలా సాగినట్టు కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు వీరు కలిసి ఉన్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు దర్శనమిచ్చాయి. ఇవి నిజమైన ఫోటోలేనా?
సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుని, చాలా సంవత్సరాలు కలిసి ఉన్నారు. వారికి ఒక బిడ్డ కూడా ఉంది.
మహ్మద్ షమీ కూడా వ్యక్తిగత జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నారు. భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణలపై పోలీసు విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు వారిద్దరూ వేరుగా ఉంటున్నారు.
గత సంవత్సరం షమీ, హసీన్ జహాన్ విడిపోయారు. ఈ సంవత్సరం టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారు.
విడాకులు తీసుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. అయితే, షమీ, సానియాలు పెళ్లి వార్తలను ఖండించారు. అందులో వాస్తవం లేదని తెలిపారు. అవన్ని తప్పుడు కథనాలుగా పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం సానియా, షమీలు కలిసి ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. వారు పెళ్లి చేసుకున్నారని పేర్కొంటూ వైరల్ అవుతున్నాయి.
సానియా, షమీలు పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి. వీరిద్దరూ దుబాయ్‌లో క్రిస్మస్ జరుపుకుంటున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఫోటోలన్ని కూడా నిజమైనవి కావని తెలుస్తోంది. ఈ ఫోటోలను ఏఐ జెనరేటెడ్ ఇమేజెస్ అని మీడియా సంస్థలు నిర్ధారించాయి.
టెక్నాలజీ సాయంతో కొందరు కావాలనే ఇలా షమీ, సానియాల ఫోటోలను తయారు చేశారు. ఇవన్నీ AI జెనరేటెడ్ ఇమేజెస్. అయినప్పటికీ సోషల్ మీడియాలో షేర్ అయిన ఫోటోలకు కొందరు శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం.
ఇవన్నీ AI ఇమేజెస్ అని తెలిసినా, వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని, వారి జోడీ బాగుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో వాస్తవం లేనప్పటికీ సానియా. షమీ దుబాయ్ లో కలిసారనే వార్తలు, పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
షమీ తన భార్య హసీన్ జహాన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తనకు ఎవరిపైనా ఆసక్తి లేదని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఇలా ఏఐ జెనరేటెట్ ఫోటోలతో జరిగే ప్రమాదాలను ఈ విషయం ఎత్తి చూపుతోంది. టెక్నాలజీ దుర్వినియోగం కారణంగా బాధితులు అయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశం పెద్దగానే ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.