MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • టీమిండియాతో ఘోర ఓటమి.. పాక్ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్.!

టీమిండియాతో ఘోర ఓటమి.. పాక్ జట్టు నుంచి ఆ ఇద్దరు అవుట్.!

Pakistan Team: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సీన్ చోటుచేసుకుంది. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 17 2026, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాక్ చిత్తు..
Image Credit : PCB\Twitter

పాక్ చిత్తు..

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను టీమ్ ఇండియా మరోసారి చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు 61 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించి, టోర్నమెంట్‌లో తమ పటిష్టతను నిరూపించుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇషాన్ కీలక పాత్ర
Image Credit : ANI

ఇషాన్ కీలక పాత్ర

భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు ఇషాన్ కిషన్. విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించిన ఇషాన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో అద్భుతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇషాన్ కిషన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే తోడవ్వడంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

35
ఇషాన్ కిషన్ సారీ
Image Credit : X/BCCI

ఇషాన్ కిషన్ సారీ

అయితే, ఈ మ్యాచ్‌లో హై స్కోరింగ్ ప్రదర్శనతో పాటు ఒక ఆసక్తికర సీన్ చోటు చేసుకుంది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తుండగా డబుల్ కోసం పరుగు తీసే క్రమంలో పాక్ వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ ను ఢీకొట్టాడు. వాస్తవానికి ఉస్మాన్ ఖాన్ ది తప్పైనప్పటికీ.. ఇషాన్ కిషన్‌ నవ్వుతూ క్షమాపణలు చెప్పి గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు.

45
ఘోర పరాజయం
Image Credit : Getty

ఘోర పరాజయం

అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయారు. వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ ఒక్కడే 44 పరుగులతో కాస్త పోరాడినా, మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పాకిస్థాన్ 18 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

55
ఆ ఇద్దరిపై వేటు
Image Credit : Getty

ఆ ఇద్దరిపై వేటు

ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ పై పాక్ జట్టు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా సూపర్ 8 సమయానికి జట్టులో నుంచి షాహీన్ షా అఫ్రిది, బాబర్ ఆజామ్‌లను జట్టు నుంచి తప్పిస్తారని టాక్. వారి స్థానాల్లో సల్మాన్ మీర్జా, నసీమ్, ఫకర్, ఖవాజా పేర్లను నమీబియాతో మ్యాచ్ కు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
Cricket Movies: ఓటీటీలో దుమ్మురేపుతున్న టాప్ 5 క్రికెట్ సినిమాలు.. అది మాత్రం ఐకానిక్ మూవీ
Recommended image2
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved