Year Ender 2024: మను భాకర్ డబుల్ ధమాకా - దీపా కర్మాకర్ వీడ్కోలు - పీవీ సింధు పెళ్లి-2024 భారత క్రీడా విశేషాలు
Year Ender 2024: 2024 క్రీడా ప్రపంచంలో అతి ముఖ్యమైన ఘట్టం పారిస్ ఒలింపిక్స్. ఈ ఒలింపిక్స్‌కు భారతదేశం అతిపెద్ద బృందాన్ని పంపింది. అయితే, భారత్ ఆశించిన విజయం దక్కలేదు మాను భాకర్ సత్తా చాటారు.
ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్ మను భాకర్
ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించారు. వ్యక్తిగత ఈవెంట్‌లో పతకం సాధించిన తర్వాత, సరబ్ జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకున్నారు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా నిలిచారు.
రజతంలో సరిపెట్టిన నీరజ్ చోప్రా
పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ స్వర్ణం గెలుచుకున్నారు. ఆయనను అధిగమించలేకపోవడంతో నీరజ్ చోప్రా రజత పతకంతో సరిపెట్టుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.
వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత పురుష హాకీ జట్టు
ఒకప్పుడు ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్‌దే పైచేయి ఉండేది. అయితే, కొంత కాలంగా మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకోవడం కోసం పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే టోక్యో ఒలింపిక్స్ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లో కూడా క్యాంస్యం గెలుచుకుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లింగ్ లో మెడల్ కోల్పోయిన వినేష్ ఫోగట్
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరుకుని పతకం ఖాయం చేసుకున్న వినేష్ ఫోగట్, ఫైనల్‌కు ముందు కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో అనర్హురాలయ్యారు. ఫైనల్ ఫైట్ కు ముందు మెడల్ ను కోల్పోయారు.
పోటీ జిమ్నాస్టిక్స్ నుంచి దీపా కర్మాకర్ రిటైర్మెంట్
2024 అక్టోబర్‌లో భారతదేశంలో అత్యంత విజయవంతమైన మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు ఆమె కోచింగ్ అవతారంలో ముందుకు సాగుతున్నాడు.
సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నమెంట్ గెలిచిన పీవీ సింధు పెళ్లి
భారీ అంచనాలు ఉన్న సమయంలో పారిస్ ఒలింపిక్స్ లో నిరాశపరిచిన తెలుగు తేజం పీవీ సింధు..సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నమెంట్ గెలిచిన తర్వాత మరో శుభవార్త చెప్పింది. 2024 చివర్లో భారతదేశంలో అత్యంత విజయవంతమైన మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఉన్న సింధు తాను పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించారు.
ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడైన రెజ్లర్ అమన్ సెహ్రావత్
పారిస్ ఒలింపిక్స్‌లో కుస్తీలో అమన్ సెహ్రావత్ పతకం గెలుచుకున్నారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో స్వల్ప తేడాతో మెడల్ కోల్పోయిన లక్ష్య సేన్
పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశంలోని అత్యుత్తమ పురుష బ్యాడ్మింటన్ క్రీడాకారులలో ఒకరైన లక్ష్య సేన్ నాల్గవ స్థానంలో నిలిచారు. అద్భుతంగా పోరాడినా, స్వల్ప తేడాతో పతకం చేజారింది.
పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో 1 రజతం, 5 కాంస్యాలు గెలిచిన భారత అథ్లెట్లు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఎవరూ స్వర్ణం గెలవలేకపోయినా, 1 రజతం, 5 కాంస్య పతకాలు సాధించారు. ఏ ఒలింపిక్స్‌లోనూ భారతీయులు ఇంతకు ముందు ఇన్ని పతకాలు గెలవలేదు.
చైనాను ఓడించి హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత పురుష, మహిళా జట్లు
ఫైనల్లో చైనాను ఓడించి భారత పురుష, మహిళా హాకీ జట్లు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాయి.