MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • నారద మహర్షికి ఇల్లు లేకుండా లోక సంచారిగా ఎందుకు తిరుగుతుంటాడు ... అలా అవడానికి ఎవరి శాపం కారణమో తెలుసా..?

నారద మహర్షికి ఇల్లు లేకుండా లోక సంచారిగా ఎందుకు తిరుగుతుంటాడు ... అలా అవడానికి ఎవరి శాపం కారణమో తెలుసా..?

నారదుడు బ్రహ్మ మానస పుత్రుడిగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. కానీ ఇతనికి కలహానుడని, కలహప్రియుడని కూడా పేర్లున్నాయి. అయితే ఇతను పెట్టే కొట్లాటలు (కలహములన్నీ)అన్నీ ఎవరైతే గర్వంతో ఉంటారో.. వారి గర్వాన్ని అణచివేసి లోకకల్యాణమునకు దారితేసేవి. అదీకాక నారదుడు ఎప్పుడూ ఒక చోట ఉండలేడు. అటూ ఇటూ తిరుగుతూ.. లోక సంచారం చేసేవాడు. ఇంతకీ నారదుడు లోక సంచారి ఎలా అయ్యాడో మీకు తెలుసా.. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 25 2022, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నారాయణ.. నారాయణ.. అంటూ లోకాలన్నింటీ చుట్టీ ఇద్దరి మధ్యన కొట్లాటలు పెట్టి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటారు నారదముని. నారదుని గురించి.. అతని వాక్ చాతుర్యం గురించి తెలుగు సినిమాల్లో మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇంతకీ నారదుడు ఇద్దరి మధ్యన ఎందుకు కొట్లాటలు పెడతాడు. అతనికి ఇదేం సరదారాబు అనుకునే వారు చాలా మందే ఉంటారు. మనలో కూడా ఇలాంటి వారు ఉంటుంటారు. ఇద్దరి వ్యక్తుల మధ్య నారదుడు కలహాలు పెడతాడని అతనికి కలహప్రియుడని, కలహభోజనుడని, కలమానుడని పేర్లు కూడా ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

వాస్తవానికి నారదుడు పెట్టే కలహాలకు ఒక కారణం ఉంటుందని పురాణాలు తెలుపుతున్నాయి. అవును నారదుడు పెట్టే కలహాలన్నీ చివరకు లోకకల్యాణానికి దారిసేవిగానే ఉంటాయట. ఈ కలహాలను కూడా నారదుడు ఎవరైతే గర్వంతో ఉంటారో వారి గర్వాన్ని అణచివేయడానికే ఇలా కలహాలను పెట్టి లోకకల్యాణానికి పునాది వేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇతను ఎంతో మందికి మార్గ నిర్దేశనం కూడా చేశాడు. అయితే నారద మహాముని ఎందుకు లోక సంచారి అయ్యాడో తెలుసా.. పురాణాలు నారదుని గురించి ఏం చెబుతున్నాయో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 
 

38

నారదుడు బ్రహ్మ మానస పుత్రుడుగా కీర్తించబడ్డాడు. దీనికి కారణం బలి చక్రవర్తిని అంతం చేయడానికి శ్రీ మహా విష్ణువు వామనావతారం ఎత్తి.. బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని ఇమ్మని అడుగుతారు. దానికి బలిచక్రవర్తి అంగీకరిస్తాడు. దాంతో వామనావతారంలో ఉన్న విష్ణువు ఒక అడుగు భూమి, ఇంకో అడుగు ఆకాశాన్ని, ఇంకో అడుగు బలిచక్రవర్తి తలపై వేస్తాడు. అయితే అప్పుడు శ్రీహరి పాదాన్ని కడగడానికి బ్రహ్మ తన శక్తి చేత ఒక పుత్రున్ని పుట్టిస్తాడు. అతన్ని నీళ్లను తీసుకురామని చెప్తాడు. తండ్రి మాట ప్రకారమే కొడుకు నీళ్లను తీసుకొచ్చి ఇస్తాడు. ఇలా జన్మించిన నారదుడు బ్రహ్మ మానస పుత్రుడుగా కీర్తించడడ్డాడు. 

48

అంతేకదు నారద మహాముని బ్రహ్మ దేవుడి కంఠం నుంచి పుట్టాడని కూడా కొందరు చెబుతుంటారు. నారదుడు పుట్టిన తర్వాత మొదటగా సరస్వతీ దగ్గర సంగీత విద్యను నేర్చుకుంటాడు. నారదుడు వాయువు నుంచి పొందుతాడు. అందుకనే దానికి మహతి అనే పేరు వచ్చింది. 

58

బ్రహ్మ సమక్షంలో నారదముని తన గాన నైపుణ్యాలను బయటపెడతాడు. దాంతో తండ్రి (బ్రహ్మ)ఎంతో సంతోషపడిపోయి హరిభక్తిని భోదిస్తాడు. అప్పటి నుంచి నారదుడు హరినామ సంకీర్తణను చెబుతూ లోక సంచారిగా మారిపోయాడు. 

68

అయితే ఒకనాడు నారాయణ సరస్సు దగ్గర దక్ష ప్రజాపతి కుమారులు ప్రజా సృష్టి కోసం తపస్సు చేస్తుంటారు. ఆ సమయంలో నారదుడు వారి వద్దకు వెల్లి మీరు అశాశ్వతమైన సంసారాన్ని ఎందుకు కోరుకుంటున్నారు.. దీనికి బదులుగా మోక్షం ప్రసాదించమని కోరుకోవాలి అని వాళ్లకు చెబుతాడు. దాంతో వారి తప్పసుకు భంగం ఏర్పడింది. సృష్టికార్య విముఖలవ్వడంతో.. దక్షుడికి కోపం వచ్చింది. దాంతో నారాయణ మహామునిని ఇలా అన్నాడు.. నువ్వు నా కొడుకుల  బద్దిని చలించేసినందున నీకు నిలకడ ఉండదు గాక. నీవు ఇద్దరి వ్యక్తుల మధ్య కొట్లాటలు పెట్టి కలహాశనుడవుదువు గాక అని శాపం పెట్టాడు. 

78

అయితే కొట్లాటలు(కలహాలు) వల్ల మనశ్శాంతి కరువువుతుంది. అయితే నారదుడు పెట్టే కొట్లాటలు దుష్ణశిక్షణకు కారణమవుతాయి. అవి చివరకు లోకకల్యానికి దారితీస్తాయి. ఈ శాపం చేతనే నారదుడు ఎప్పుడు నిలకడగా ఒక చోట ఉండడు.  

88

అయితే నారదుడు హిరణ్యకష్యపునికి కొడుకు పుట్టబోతున్నాడని.. మళ్లీ ఇంకో రాక్షసుడు జన్మించకూడదని.. హిరణ్యకష్యపుని భార్య లీలావతి గర్భంలోని శిశువును చంపాలనకుంటాడు ఇంద్రుడు . ఆ సమయంలో నారదుడు అడ్డుపడి.. ఆ శిశువు విష్ణుభక్తుడని చెప్పి.. హత్యాయత్నాన్నిఅడ్డుకుంటారు. ఎంతో మందికి మార్గనిర్దేశనం కూడా చేశాడు. ఇతడు మనకొక మార్గదర్శి అని పురాణాలు చెబుతున్నాయి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved