MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Negative Energy: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఉంటే ఏమవుతుంది?

Negative Energy: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఉంటే ఏమవుతుంది?

Negative Energy: జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం.. ఇంటి వాతావరణం మన జీవితంపై లోతైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగితే ఇబ్బందులు తప్పవు అంటున్నారు పండితులు. అసలు ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 23 2026, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి?
Image Credit : Freepik

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి?

జ్యోతిష్య, వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేకమైన శక్తి ప్రవాహం ఉంటుంది. ఆ శక్తి సానుకూలంగా ఉంటే ఇంట్లో శాంతి, ఆరోగ్యం, ఆనందం పెరుగుతాయి. కానీ కొన్ని కారణాల వల్ల అదే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగితే, అది కుటుంబ సభ్యుల మానసిక స్థితి, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. పండితుల ప్రకారం, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా గుర్తించాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇంట్లో అనవసర గొడవలు
Image Credit : Getty

ఇంట్లో అనవసర గొడవలు

ఇంట్లో చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరగడం, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత తగ్గిపోవడం నెగెటివ్ ఎనర్జీ సూచనగా పండితులు చెబుతున్నారు. సాధారణంగా శాంతిగా ఉన్న కుటుంబంలో కూడా ఆకస్మికంగా ఆందోళన పెరిగితే, వాతావరణంలో శక్తి అసమతుల్యత ఉందని భావించవచ్చు. ఇది ఎక్కువకాలం కొనసాగితే మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది.

Related Articles

Related image1
Telugu Saying: నమ్మినాను రామన్నా అంటే, నట్టేట ముంచుతానన్నాడట! ఈ సామెత ఏం చెప్తుందో తెలుసా?
Related image2
Zodiac Signs: ఈ 3 రాశుల అమ్మాయిలకి ఓపిక చాలా ఎక్కువ.. ఫ్యామిలీకి వీరే బలం!
36
అనవసర అలసట
Image Credit : Getty

అనవసర అలసట

ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపించడం, బయటకు వెళ్లినప్పుడు కొంత రిలీఫ్‌గా ఫీల్ అవ్వడం కూడా నెగెటివ్ ఎనర్జీ సూచనగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే రాత్రిపూట నిద్ర సరిగా రాకపోవడం, చెడు కలలు రావడం కూడా ఈ ప్రభావంలో భాగంగా చెబుతున్నారు.

46
ఆర్థిక సమస్యలు
Image Credit : our own

ఆర్థిక సమస్యలు

తగిన ఆదాయం ఉన్నప్పటికీ ఇంట్లో డబ్బు నిల్వకపోవడం, తరచుగా ఏదో ఒక రూపంలో ఖర్చులు రావడం వంటివి వాస్తు శాస్త్రంలో అసమతుల్య శక్తి సూచనగా చెబుతారు. ఇది నేరుగా నెగెటివ్ ఎనర్జీ కాకపోయినా, ఇంటి వాతావరణం అస్థిరంగా ఉంటే నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.

56
వస్తువులు పాడవడం
Image Credit : Pinterest

వస్తువులు పాడవడం

ఎలక్ట్రానిక్ వస్తువులు, గడియారాలు, లైట్లు తరచుగా పాడవడం లేదా వస్తువులు పడిపోవడం వంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటే అది నెగిటివ్ ఎనర్జీకి సూచనగా పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఉన్నా కూడా మనసుకు ప్రశాంతత లేకపోవడం, ఇంట్లో ఉండాలని అనిపించకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగడం వంటి భావనలు నెగెటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

66
నెగెటివ్ ఎనర్జీ పోవాలంటే?
Image Credit : Asianet News

నెగెటివ్ ఎనర్జీ పోవాలంటే?

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, గాలి, వెలుతురు సరిగా వచ్చేలా చూసుకోవడం ముఖ్యం. ఉదయం సమయంలో సూర్యరశ్మి ఇంట్లోకి రావడం పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే దీపం వెలిగించడం, గణపతి లేదా లక్ష్మీ దేవి ప్రార్థనలు చేయడం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు మనసుకు శాంతిని ఇస్తాయని సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Goa Temple: గోవా వెళ్తే బీచ్ కాదు.. ఈ 400 ఏళ్ల నాటి టెంపుల్ చూడాలి.. అక్కడ స్పెషాలిటీ ఇదే
Recommended image2
Puri Jagannath Temple: లవర్స్ ఈ గుడికి వెళ్లకూడదా? వెళ్తే ఏం జరుగుతుంది?
Recommended image3
Evil Eye: దిష్టి తీయడానికి ఉప్పు, మిరపకాయలనే ఎందుకు వాడతారు? అసలు ఈ అలవాటు ఎలా మొదలైంది?
Related Stories
Recommended image1
Telugu Saying: నమ్మినాను రామన్నా అంటే, నట్టేట ముంచుతానన్నాడట! ఈ సామెత ఏం చెప్తుందో తెలుసా?
Recommended image2
Zodiac Signs: ఈ 3 రాశుల అమ్మాయిలకి ఓపిక చాలా ఎక్కువ.. ఫ్యామిలీకి వీరే బలం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved