Gold: ఇంట్లో బంగారాన్ని ఏ దిశలో ఉంచితే సంపద జోరుగా వస్తుందో తెలుసా?
వాస్తు ప్రకారం బంగారాన్ని సరైన దిశలో ఉంచితే ధనం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. నైరుతి, ఉత్తర దిశలు ఎందుకు శ్రేయస్కరమో ఈ కథనంలో తెలుసుకోండి.

బంగారం -వాస్తు శాస్త్రం
మన ఇంట్లో బంగారం ఉంచే స్థానం గురించి వాస్తు శాస్త్రం ప్రత్యేకమైన సూచనలను అందిస్తుంది. ఎందుకంటే వాస్తు ప్రకారం ప్రతి వస్తువు స్థిరంగా ఉండే దిక్కు, ఆ వస్తువుతో సంబంధమైన శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో, బంగారాన్ని ఇంట్లో ఎక్కడ ఉంచాలో స్పష్టంగా తెలుసుకోవడం ఎంతో అవసరం.
సంపద, ఐశ్వర్యం
బంగారం అనే పదం వినగానే మనకు సంపద, ఐశ్వర్యం గుర్తుకు వస్తాయి. ఇది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు, శుభానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహానికి బంగారం అధిపతిగా భావిస్తారు.అందుకే ఇంట్లో బంగారం ఉన్న స్థానం, దానికి ఎదురుగా ఉన్న దిక్కు అన్నీ కలిసి మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయని నమ్మకం ఉంది.
నైరుతి దిక్కు..
వాస్తు నిపుణుల అభిప్రాయంలో ఇంట్లో బంగారం ఉంచడానికి అత్యంత శ్రేయస్కరమైన దిక్కు నైరుతి. ఈ దిశకి స్థిరత్వం, భద్రత, సంతులనం వంటి లక్షణాలు ఉన్నాయి. నైరుతి భాగంలో విలువైన వస్తువులను ఉంచితే వాటి పై నియంత్రణ బలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరాలనుకుంటే బంగారాన్ని నైరుతి మూలలో గల సురక్షిత బీరువాలో ఉంచడం మంచిదిగా చెబుతున్నారు.
ఈశాన్య దిశ వద్దు
ఈశాన్య దిశలో బంగారాన్ని ఉంచడాన్ని వాస్తు నిపుణులు అంత మంచిదిగా పరిగణించారు. ఎందుకంటే ఈశాన్య దిక్కు నీటి మూలకాన్ని సూచిస్తుంది. ఈ ప్రాంతంలో బంగారం ఉంచటం వలన నిరంతరంగా ఖర్చులు ఎదురవుతాయి లేదా ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది.
చెక్క బీరువా
బంగారం నిల్వ చేసే వస్తువు విషయానికొస్తే, చెక్కతో చేసిన బీరువా లేదా సేఫ్‌ను ఉపయోగించాలి. లోహపు బీరువా కన్నా చెక్క వస్తువులు ప్రకృతికి సమీపంగా ఉండటంతో మంచి శుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం. అలాగే బంగారాన్ని ఉంచే స్థలాన్ని శుభ్రంగా, వెలుతురుగా ఉంచడం కూడా ముఖ్యమే. ఎక్కడా చెదురుమదురుగా వస్తువులు లేకుండా క్రమంగా ఏర్పాటు చేసిన చోటే సానుకూల శక్తి ఎక్కువగా ప్రవహిస్తుంది
నిద్రించే గది లో వద్దు
కొంతమంది నిద్రించే గదుల్లో బంగారాన్ని ఉంచే అలవాటు ఉంటుంది. కానీ ఇది అంతా మంచిది కాదని నిపుణులు అంటున్నారు.బెడ్ రూమ్ కేవలం పడకలకి మాత్రమే కేటాయించడంతో అక్కడ విలువైన వస్తువులు ఉంచడం వల్ల శాంతి భంగం కలగవచ్చు. అందుకే బెడ్ రూమ్ లో బంగారం పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఉత్తర దిశ
వాస్తు ప్రకారం అల్మారాల్లో బంగారం ఉంచేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. బంగారం ఉన్న అల్మారా తలుపు ఉత్తర దిశలో ఉండాలి. దీనివల్ల సంపద ప్రవాహం ఉత్తరంగా ప్రవహిస్తుందని నమ్ముతారు. ఉత్తర దిక్కు కుబేరునికి సంబంధించినది. కుబేరుడు సంపద దేవత. అందువల్ల ఆయన పాలనలో ఉండే ఉత్తర దిక్కు ఆర్థికంగా మనకు మేలు చేస్తుందనే నమ్మకం ఉంది.
వాయువ్య దిశ
వాయువ్య దిశలో బంగారాన్ని ఉంచడం మంచిది కాదని చెబుతారు. వాస్తు ప్రామాణికాల ప్రకారం, ఈ దిశలో విలువైన వస్తువులు ఉంచితే అవి క్రమంగా మన నుంచి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల లాభం కన్నా నష్టమే అధికం అవుతుంది.