Raksha Bandhan 2025:ఈ ఏడాది రాఖీ పండగ ఎప్పుడు వచ్చింది..?
శ్రావణ పూర్ణిమను అత్యంత పవిత్రమైన పౌర్ణమిగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా ఈ రోజుని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

రక్షాబంధన్
రాఖీ కట్టడం అనేది ఒక సంప్రదాయం మాత్రమే కాదు, తమ సోదరుల పై ఉన్న ప్రేమను ఈ రక్షా బంధన్ రోజున రాఖీ కట్టి మరీ తెలియజేస్తారు. ఎంత దూరంలో ఉన్నా.. ఆరోజున తన సోదరుడి ఇంటికి వెళ్లి మరీ రాఖీ కడుతూ ఉంటారు. మరి, ఈ ఏడాది రాఖీ పండగ ఎప్పుడు వచ్చింది అనే విషయం తెలుసుకుందాం..
రక్షా బంధన్ 2025: తేదీ, శుభ మహుర్తం..
రక్షా బంధన్ ఆగస్టు 9, 2025 శనివారం జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం, రాఖీ కట్టడానికి అత్యంత పవిత్రమైన సమయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
రాఖీ కట్టడానికి శుభ సమయం - ఉదయం 05:47 నుండి మధ్యాహ్నం 01:24 వరకు
వ్యవధి - 7 గంటల 37 నిమిషాలు
రక్షా బంధన్ భద్ర సూర్యోదయానికి ముందే ముగిసింది
పూర్ణిమ తిథి ఆగస్టు 8, 2025న మధ్యాహ్నం 02:12 గంటలకు ప్రారంభమవుతుంది
పూర్ణిమ తిథి ఆగస్టు 9, 2025న మధ్యాహ్నం 01:24 గంటలకు ముగుస్తుంది
శ్రావణ పూర్ణిమ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత..
శ్రావణ పూర్ణిమను అత్యంత పవిత్రమైన పౌర్ణమిగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా ఈ రోజుని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున దేవుడిని పూజిస్తే.. చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు.
ఈ రోజున సోదరీమణులు రాఖీతో పాటు తిలకం దిద్దీ, హారతి ఇస్తూ, స్వీట్లు తినిపిస్తూ సోదరుని దీర్ఘాయుష్షుతో కూడిన రక్షణ కోసం ప్రార్థిస్తారు. సోదరులు కూడా తమ సోదరీమణులను ఎలాంటి సమస్య నుంచి అయినా కాపాడతామని ప్రతిజ్ఞ చేస్తారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, పురాణాల్లో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. ద్రౌపది.. కృష్ణుడికి రాఖీ కట్టింది. అందుకే.. ఆమె ఆపదలో ఉన్నప్పుడు కృష్ణుడు ఆమెను కాపాడాడు.
ఈ రోజున భాద్రకాల్ అనే అనిష్టమైన సమయంలో రాఖీ కట్టకూడదన్న నమ్మకం ఉంది. కావున, శుభముఖూర్తంలోనే ఈ పండుగ జరుపుకోవడం ఉత్తమం.