MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • ఈ వస్తువులను దానం అసలే చేయకండి.. ఒకవేళ చేశారో..!

ఈ వస్తువులను దానం అసలే చేయకండి.. ఒకవేళ చేశారో..!

హిందూ మతంలో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం.. పేదలకు దానం చేస్తే పుణ్యం దక్కుతుంది. అయితే ఈ దాన ధర్మాలకు సంబంధించిన నియమాలు ఎన్నో శాస్త్రాల్లో ఉన్నాయి. వీటి ప్రకారమే దానధర్మాలు చేస్తే శుభ ఫలితాలను పొందుతారట.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 22 2023, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హిందూ మతంలో దాతృత్వానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. అందుకే పురాణాలు పేదలకు దానధర్మాలు చేయాలని సూచిస్తున్నాయి. మత విశ్వాసాల ప్రకారం.. దానధర్మాలు చేయడం పుణ్యకార్యంగా పరిగణించబడింది. అయితే ఈ దానధర్మాల విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీరు ఇబ్బంది పడటమే కాకుండా అవతలి వ్యక్తిని కూడా ఇబ్బందుల పాలు చేస్తుంది. అందుకే ఎలాంటి వస్తువులను దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

చీపురు

చీపురు మనకు అత్యవసరమైన వస్తువు. దీన్ని కేవలం శుభ్రపరిచే వస్తువుగానే చూస్తారు చాలా మంది. కానీ హిందూ మతంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ మతం ప్రకారం.. చీపురు లక్ష్మీ దేవికి సంబంధించినదిగా నమ్ముతారు. అందుకే చీపురును పొరపాటున కూడా దానం చేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. మీరు ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నమ్ముతారు. 

35
Accupunture needles

Accupunture needles


కత్తులు, సూదులు, కత్తెర

పురాణాల ప్రకారం.. పదునైన  వాటిని కూడా దానం చేయకూడదు. అంటే సూదులు, కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను దానం చేయడం మంచిది కాదని పురాణాల్లో పేర్కొనబడింది. ఒకవేళ మీరు వీటిని దానం చేస్తే ఇంట్లో కొట్లాటలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. 

45

నువ్వులు, ఆవనూనె

పురాణాల ప్రకారం.. కొన్ని రకాల నూనెలను కూడా దానం చేయకూడదు. ముఖ్యంగా నువ్వుల నూనె, ఆవ నూనెను పొరపాటున కూడా దానం చేయకూడదు. దీనివల్ల శనిదేవుడికి కోపం వస్తుందట. దీంతో మీకు అన్నీ సమస్యలే ఎదురవుతాయి. అంతేకాదు మీరు ఉపయోగించిన నూనెను అలాగే పాడైన నూనెను, మిగిలిన నూనెను కూడా ఎప్పుడూ దానం చేయకూడదు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. అన్నీ కష్టాలే కలుగుతాయి. 

55

ఆహారానికి సంబంధించిన నియమాలు

పేదలకు, అవసరమైన వాటికి ఫుడ్ ను దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నారు. దీన్ని పుణ్యకార్యంగా భావిస్తారు. అయితే ఫుడ్ ను దానం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. మీరు దానం చేయాలనుకుంటున్న ఆహారం పాడైపోకూడదు. అలాగే చెడిపోకుండా ఉండాలి. పాడైపోయిన ఆహారాలను దానం చేస్తే మీకు పుణ్యం దక్కదు కదా.. కష్టాలోకి వెళ్లిపోతారు. ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pooja Room Vastu: పూజ గదిలో ఈ 5 చేస్తే నష్టాలు తప్పవు జాగ్రత్త!
Recommended image2
Shakuna Shastra: పనిమీద బయటకు వెళ్తుంటే శవం ఎదురైతే ఏమౌతుంది?
Recommended image3
Kumbhakarna : కుంభకర్ణుడి నిద్ర వెనకున్న పౌరాణిక రహస్యం తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved