Vastu Tips for Students: మీ పిల్లలు టాప్ ర్యాంకర్ కావాలంటే ఇలా చేయండి
Vastu Tips for Students: మీ పిల్లల చదువులో బాగా రాణించాలంటే కూర్చొనే దిశ కూడా ముఖ్యమేనని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏ దిక్కులో కూర్చొని చదివితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం అంటే ఓ పురాతన గ్రంథం మాత్రమే కాదు. ఇది కూడా సైన్స్ లోని భాగమే. పూర్వ కాలమే బుుషులు స్పిర్చువల్ పవర్ ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి వాస్తు శాస్త్రాన్ని రచించారు. ఇది కేవలం హిందువులకు సంబంధించినదని భావిస్తారు. వాస్తు శాస్త్రాన్ని సరిగ్గా పాటిస్తే ఎవరైనా మంచి రిజల్ట్స్ పొందవచ్చు.
వాస్తు శాస్త్రంలో అన్ని దిశలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంటే ఏ వస్తువునైనా తప్పు దిశలో పెట్టినా, లేదా ఏదైనా పనిని తప్పు దిశలో చేసినా అది జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పారు. పిల్లలు చదివేటప్పుడు ఏ దిశలో కూర్చొని చదవాలి అనే విషయం కూడా ఇందులో ఉంది.
దీన్ని కూడా చదవండి: Vastu Tips: ఇంట్లో తులసి మొక్క ఏ దిక్కులో ఉండాలో తెలుసా?
చాలాసార్లు పిల్లలు కష్టపడి చదివినా పరీక్షలో ఆశించిన మార్కులు పొందలేకపోతుంటారు. దీనికి చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ముఖ్యం. అంటే పిల్లలు కూర్చుని చదివే స్థలం, దిశ వాస్తు ప్రకారం సరిగా లేకపోతే వారు కష్టపడి చదివినా సరైన ఫలితాలు పొందలేరు. పిల్లలు కూర్చొని చదివే దిశ వాస్తు ప్రకారం ఉంటే పిల్లల విజయానికి అడ్డంకులు తొలగిపోతాయి. కాబట్టి వాస్తు ప్రకారం పిల్లలు ఏ దిశలో కూర్చుని చదవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తూర్పు లేదా పడమర:
మీ పిల్లలు చదివేటప్పుడు పిల్లల ఫేస్ తూర్పు లేదా పడమర దిశలో ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఒకవేళ ఈ రెండు కుదరకపోతే ఉత్తరం దిక్కు వైపు కూర్చొని పిల్లలను చదివించండి.
ఈశాన్య దిశ:
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కు కూడా చదువుకు ఉత్తమమైనదిగా వాస్తు పండితులు చెబుతారు. కాబట్టి మీ పిల్లలను ఈ దిశలో కూర్చొమని చదివించండి. ఈ దిశల్లో మీ పిల్లలు చదివితే పిల్లల మెదడు వేగంగా పనిచేస్తుంది. వారు త్వరగా అర్థం చేసుకుని చదువుతారు. దీని వల్ల పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు.