MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Vastu Tips: ఇంట్లో తులసి మొక్క ఏ దిక్కులో ఉండాలో తెలుసా?

Vastu Tips: ఇంట్లో తులసి మొక్క ఏ దిక్కులో ఉండాలో తెలుసా?

Tulsi Plant Vastu Tips: పవిత్రమైన తులసి మొక్క ఇంటికి ఎంతో మేలు చేస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే అసలు తులసి మొక్కని ఇంట్లో ఎక్కడ పెట్టాలో మీకు తెలుసా? వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిక్కులో తులసి మొక్క పెంచితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Feb 19 2025, 09:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తులసి మొక్క హిందువులకు ఎంతో పవిత్రమైనది. దాదాపు ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది. ఉదయం, సాయంత్రం అక్కడ దీపారాధన చేసి పూజిస్తారు. తులసి మొక్క పచ్చగా ఉంటే ఇంట్లో ఆనందం ఉంటుందని, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్ముతారు.

సరైన దిశలో, సరైన స్థలంలో తులసి మొక్కను పెంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. డబ్బు కొరత ఉండదని, ఇంటిల్లిపాది ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని వాస్తు పండితులు చెబుతున్నారు. మరి డబ్బు, అదృష్టం కోసం తులసి మొక్కని ఇంట్లో ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తులసి మొక్కన ఏ దిశలో పెట్టాలి..

వాస్తు ప్రకారం తులసి మొక్కని ఇంటి ముంగిట లేదా మధ్యలో పెట్టాలి. ఉత్తరం, ఈశాన్య దిక్కులో కూడా పెట్టి పూజించవచ్చు. ఒకవేళ మీరు బాల్కనీలో లేదా కిటికీలో పెట్టాలనుకుంటే ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పెట్టాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. 

35

తులసి మొక్కని ఈ దిశలో పెట్టకూడదు

వాస్తు ప్రకారం తులసి మొక్కని దక్షిణ దిశలో పెట్టకూడదు. అలా చేస్తే పితృదేవతలకు కోపం వస్తుందట. దక్షిణ దిశలో యమధర్మరాజు ఉంటారు కాబట్టి లక్ష్మీదేవికి కూడా కోపం వచ్చి ఇంట్లో ధనం నిలవదట. దీనివల్ల పేదరికంతో బాధపడాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: ఈ 5 చోట్ల దీపాలు పెట్టిన వారికి సడన్‌గా డబ్బు లభిస్తుంది

45

శుభ్రంగా ఉంచండి

తులసి ఉన్న ఇంట్లో డబ్బు, శ్రేయస్సు, ఆనందం, ప్రశాంతత ఉంటాయి. తులసి పవిత్రమైనది కాబట్టి ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి. చెత్త వంటివి ఉండకూడదు.

తులసి మొక్కని నేలలో నాటకూడదు

తులసి మొక్కని నేలలో నాటడం అశుభం. మీ పనులకు మంచి ఫలితాలు రావాలంటే ఒక కుండీలో నాటాలి. తులసి దగ్గర ముళ్ళ మొక్కలు పెట్టకూడదు. వంటగది బయట తులసి ఉంటే వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. తులసి మొక్కకి తప్పకుండా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.

55

జాగ్రత్తగా సంరక్షించాలి

తులసి మొక్కని జాగ్రత్తగా పెంచాలి. అనవసరంగా విరిచి పారేయకూడదు. మొక్క ఎండిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వాస్తు ప్రకారం తులసిని సరిగ్గా సంరక్షించకపోతే దురదృష్టం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఇరుముడిలో ఏమేం పెడతారు? కొబ్బరికాయలో నెయ్యి ఎందుకు వేస్తారు?
Recommended image2
Money Plant: మనీ ప్లాంట్ దగ్గర ఈ ఒక్కటి పెడితే చాలు.. జీవితంలో డబ్బుకు లోటురాదు!
Recommended image3
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved