- Home
- Life
- Spiritual
- Birth Date Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదైనా సాధించగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇదేనా?
Birth Date Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదైనా సాధించగలరు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇదేనా?
Birth Date Numerology: సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. పుట్టిన తేదీలను బట్టి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కూడా చెప్పొచ్చు. ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన నక్షత్రం, రాశి, ప్రాంతాన్ని బట్టి వారి జాతకాన్ని అంచనా వేయొచ్చు. అంతేకాకుండా వారి జీవితం ఎలా ఉండబోతోంది. ఏ రంగంలో రాణించగలరు. ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం లాగే సంఖ్యాశాస్త్రాన్ని బట్టి కూడా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, లక్ష్యాలను, జాతకాలను తెలుసుకోవచ్చు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీలను బట్టి వ్యక్తి జాతకాన్ని అంచనా వేస్తారు. కేవలం డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దానికి సంఖ్యా శాస్త్రంలో ఆ డేట్ వెనుక అనేక విషయాలు దాగి ఉంటాయి. తేదీలను బట్టి వ్యక్తులకు ఉండే లక్షణాలు వేరుగా ఉంటాయి. అందుకే సంఖ్యా శాస్త్రం కూడా ఇటీవల చాలా ఫేమస్ అవుతోంది.
ఇది కూడా చదవండి ఉపవాసం దేవుడి కోసం కాదా? మన ఆరోగ్యం కోసమా?
సంఖ్యా శాస్త్రం ప్రకారం 8, 16, 18, 28 తేదీల్లో పుట్టినవాళ్లు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అంతేకాకుండా జీవితంలో ఎంతో సాధించాలనే తపనతో ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు ఏ పని ప్రారంభించినా అందులో విజయం సాధించే దాకా వదిలిపెట్టరు. ఎలాంటి కష్టనష్టాలు వచ్చినా తట్టుకొని అనుకున్నది సాధిస్తారు.
అయితే ఎవరైనా వీరిని మోసం చేస్తే మాత్రం అంత డేంజర్ గానూ మారిపోతారు. మోసాన్ని తట్టుకోలేక ఎంతటి పని చేయడానికైనా వెనుకాడరు.
8, 16, 18, 28 తేదీల్లో పుట్టిన వాళ్ళకి ఆకర్షించే శక్తి ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టినవాళ్లు ఆడవాళ్లు అయితే చాలా అందంగా, అందరినీ ఆకర్షించే విధంగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టినవాళ్లు మగవాళ్లు అయితే నాయకులుగా, గ్రూపులకు పెద్దగా మారతారు. అందువల్ల వీళ్లు ఎక్కడున్నా గొడవలు జరుగుతూ ఉంటాయి.
ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి గెలవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ప్రేమించిన వాళ్ళకి అండగా ఉంటారు. మరి మీరు పుట్టిన తేదీ ఈ లిస్టులో ఉందా?
ఇది కూడా చదవండి ఏప్రిల్‌లో పెళ్లిల్లే.. పెళ్లిళ్లు.. ఇన్ని ముహూర్తాలు కుదరడం చాలా అరుదు